AIIMS NORCET Recruitment 2023: ఎయిమ్స్‌లో 3,055 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే

Rudra Veni

Published On:

న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ (AIIMS NORCET Recruitment 2023) అయింది. మొత్తం 3,055 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి. 
AIIMS NORCET Recruitment 2023: ఎయిమ్స్‌లో 3,055 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవేAIIMS NORCET Recruitment 2023: ఎయిమ్స్‌లో 3,055 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే

ఎయిమ్స్‌ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ 2023 (AIIMS NORCET Recruitment 2023): న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) దేశవ్యాప్తంగా ఉన్న పలు ఎయిమ్స్ సంస్థల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3,055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్‌)- 4 నోటిఫికేషన్‌ (AIIMS NORCET Recruitment 2023) రిలీజ్ అయింది. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు AIIMS NORCET 2023 కోసం norcet4.aiimsexams.ac.in వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో తెలియజేయడం జరిగింది. ఈ దిగువున టేబుల్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.

నోటిఫికేషన్ డైరక్ట్ లింక్

ఎయిమ్స్ రిక్రూట్‌‌మెంట్ 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు (AIIMS NORCET 2023 Overview)

ఎయిమ్స్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో చూడండి
రిక్రూట్‌మెంట్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
పోస్ట్ పేరు నర్సింగ్ ఆఫీసర్లు
ఖాళీల వివరాలు 3055 పోస్టులు
జాబ్ లోకేషన్ దేశ వ్యాప్తంగా
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 05, 2023
రాత పరీక్ష జూన్ 03, 2023
అధికారిక వెబ్‌సైట్ norcet4.aiimsexams.ac.in

ఎయిమ్స్ రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాలు (AIIMS Recruitment 2023 Eligibility Criteria)

ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి.
  • మే 05, 2023 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాలు నిండి ఉండాలి
  • రిజర్వేషన్ కేటగిరికి చెందిన అభ్యర్థులకు వయస్సులో మినహాయింపు ఉంటుంది.
  • ఈ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల కోసం అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. లేదా GNM, రెండేళ్ల అనుభవం ఉండాలి.

AIIMS Recruitment 2023 పోస్టుల వివరాలు (AIIMS Recruitment 2023 Posts Details)

దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఎన్ని పోస్టులున్నాయో ఈ దిగువున టేబుల్లో అందజేశాం.
పోస్టులు ఖాళీల సంఖ్య
ఎయిమ్స్‌ భటిండా పోస్టులు 142
ఎయిమ్స్‌ భోపాల్ పోస్టులు 51
ఎయిమ్స్‌ భువనేశ్వర్ పోస్టులు 169
ఎయిమ్స్‌ బీబీనగర్ పోస్టులు 150
ఎయిమ్స్‌ బిలాస్‌పూర్ పోస్టులు 178
ఎయిమ్స్‌ దేవ్‌ఘర్ పోస్టులు 100
ఎయిమ్స్‌ గోరఖ్‌పూర్ పోస్టులు 121
ఎయిమ్స్‌ జోధ్‌పూర్ పోస్టులు 300
ఎయిమ్స్‌ కల్యాణి పోస్టులు 24
ఎయిమ్స్‌ మంగళగిరి పోస్టులు 117
ఎయిమ్స్‌ నాగ్‌పుర్ పోస్టులు 87
ఎయిమ్స్‌ రాయ్ బరేలీ పోస్టులు 77
ఎయిమ్స్‌ న్యూఢిల్లీ పోస్టులు 620
ఎయిమ్స్‌ పట్నా పోస్టులు 200
ఎయిమ్స్‌ రాయ్‌పూర్ పోస్టులు 150
ఎయిమ్స్‌ రాజ్‌కోట్ పోస్టులు 100
ఎయిమ్స్‌ రిషికేశ్ పోస్టులు 289
ఎయిమ్స్‌ విజయ్‌పూర్ పోస్టులు 180

అర్హతలున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు మే 05, 2023 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లోొ దరఖాస్తు చేసుకోవాలి. అలాగే దరఖాస్తుల సవరణకు మే 6 నుంచి 8వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.3000లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.2,400లు ఫీజు చెల్లించాలి. నార్‌సెట్‌-4 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.9,300ల నుంచి రూ.34,800ల వరకు జీతంగా ఇవ్వడం జరుగుతుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి

/news/aiims-norcet-nursing-officer-posts-notification-2023-39164/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Recent Related News

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top