AP DEECET 2025 వెబ్ ఆప్షన్స్ చివరి తేదీ

manohar

Updated On: July 12, 2025 07:48 AM

AP DEECET 2025 వెబ్ ఆప్షన్స్ జూలై 8 నుండి 12 వరకు నిర్వహించబడుతుంది. అభ్యర్థులు తమ ప్రాధాన్య క్రమంలో కళాశాలలను ఎంచుకోవాలి.పూర్తి సమాచారం(AP DEECET Web Options Last Date)ఇక్కడ అందించాము.

AP DEECET 2025 వెబ్ ఆప్షన్స్ చివరి తేదీ(AP DEECET 2025 Web Options Last Date)AP DEECET 2025 వెబ్ ఆప్షన్స్ చివరి తేదీ(AP DEECET 2025 Web Options Last Date)

AP DEECET 2025 వెబ్ ఆప్షన్స్ చివరి తేదీ,పూర్తి వివరాలు ఇవే(AP DEECET 2025 Web Options Last Date And details): AP DEECET 2025 వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ జూలై 8, 2025 నుండి ప్రారంభమై జూలై 12 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో అభ్యర్థులు తాము ప్రవేశించాలనుకునే D.El.Ed. కళాశాలలను తమ ప్రాధాన్యత ఆధారంగా (AP DEECET 2025 Web Options? Last Date)ఎంచుకోవాలి. వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి, కోర్సు మాధ్యమం (తెలుగు లేదా ఇంగ్లీష్), జిల్లా, ప్రభుత్వ లేదా ప్రైవేట్ కళాశాలలు మొదలైన ఫిల్టర్లను ఉపయోగించి ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఒకసారి అన్ని ఆప్షన్లు ఎంచుకున్న తర్వాత, వాటిని తప్పకుండా "లాక్/ఫ్రీజ్" చేయాలి. లేకపోతే ఆప్షన్లు లెక్కలోకి తీసుకోబడకపోవచ్చు. జూలై 15న సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలవుతాయి, మరియు జూలై 16 నుండి 20 వరకు ఫీజు చెల్లించి సంబంధిత కాలేజీలో జాయిన్ కావచ్చు. కావున అభ్యర్థులు ఈ ప్రక్రియను గడువులోపు పూర్తిచేసుకోవాలి.

AP DEECET 2025 వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి? (How to set AP DEECET 2025 web options?)

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి apdeecet.apcfss.in వెళ్లండి
  • ఆ తరువాత హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్‌తో లాగిన్ అవ్వండి
  • "Web Options" సెక్షన్‌కి వెళ్లండి
  • కోర్సు, మాధ్యమం, జిల్లా, కళాశాల ఆధారంగా ఆప్షన్లు ఎంచుకోండి
  • ఎంపికలు సరిచూసి "Freeze Options" క్లిక్ చేయండి

AP DEECET 2025 వెబ్ ఆప్షన్స్ ముఖ్యమైన తేదీలు (AP DEECET 2025 Web Options Important Dates)

AP DEECET 2025 వెబ్ ఆప్షన్స్ గురించి ముఖ్యమైన తేదీలను ఇక్కడ క్రింద టేబుల్ పట్టికలో (AP DEECET 2025 Web Options Important Dates)చూడండి

వివరాలు

తేదీలు

వెబ్ ఆప్షన్స్ ప్రారంభ తేదీ

జూలై 8, 2025

వెబ్ ఆప్షన్స్ ముగింపు తేదీ

జూలై 12, 2025

ఆప్షన్లు లాక్/ఫ్రీజ్ చివరి తేదీ

జూలై 12 సాయంత్రం 6:00 గంటల లోపు

అధికారిక వెబ్‌సైట్

apdeecet.apcfss.in

లాగిన్ అవసరమైన వివరాలు

హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ

ఆప్షన్ ఎంపికకు అవసరమైన అంశాలు

కోర్సు, మాధ్యమం, జిల్లా, కళాశాల

ఫలితాల విడుదల తేదీ

జూలై 15, 2025

జాయినింగ్ & ఫీజు చెల్లింపు తేదీలు

జూలై 16 నుండి 20, 2025

AP DEECET 2025 వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ విద్యార్థుల భవిష్యత్తులో కీలకమైన దశ. అభ్యర్థులు వారి ప్రాధాన్యతలను బట్టి కళాశాలలు జాగ్రత్తగా ఎంచుకుని, సమయానికి ముందు ఆప్షన్లు లాక్ చేయాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తిచేయడం ,అధికారిక తేదీలను గమనిస్తూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా సీటు పొందే అవకాశాలు మెరుగవుతాయి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ap-deecet-2025-web-options-last-date-68475/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top