EMRS Recruitment 2023: ఏకలవ్య మోడల్ స్కూల్లో 38 వేల ఉద్యోగాలు, నెలకు రూ.2,09,200 వరకు జీతం, పూర్తి వివరాలివే

Rudra Veni

Published On:

కేంద్ర విద్యాశాఖ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్  (EMRS Recruitment 2023) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 38 వేల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టుల భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు  రూ. 18,000ల నుంచి రూ.2,09,200 వరకు జీతం అందజేయడం జరుగుతుంది. 
 
EMRS Recruitment 2023: ఏకలవ్య మోడల్ స్కూల్లో 38 వేల ఉద్యోగాలు, నెలకు  రూ.2,09,200 వరకు జీతం, పూర్తి వివరాలివేEMRS Recruitment 2023: ఏకలవ్య మోడల్ స్కూల్లో 38 వేల ఉద్యోగాలు, నెలకు రూ.2,09,200 వరకు జీతం, పూర్తి వివరాలివే

EMRS రిక్రూట్‌మెంట్ 2023 (EMRS Recruitment 2023): కేంద్ర విద్యాశాఖ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉండే ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో డైరక్ట్ ప్రాతిపదికన 38 వేల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టుల భర్తీ చేయనుంది. అభ్యర్థులు EMRS రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు ఫార్మ్‌ను విడుదల చేసిన తర్వాత ఆన్‌లైన్ మోడ్‌లో పూరించాలి. EMRS రిక్రూట్‌మెంట్ 2023 పరీక్షను నేషనల్ టెస్ట్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు EMRS రిక్రూట్‌మెంట్ 2023 గురించి పూర్తి వివరాలు ఇక్కడ అందజేశాం.

EMRS రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ లింక్

EMRS Recruitment 2023 వివరాలు (EMRS Recruitment 2023 Overview)

ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో సిబ్బంది పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో అందజేశాం.
ఎగ్జామినేషన్ పేరు EMRS రిక్రూట్‌మెంట్ 2023
కండక్టింగ్ బాడీ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (NTA)
అప్లికేషన్ మోడ్ ఆన్‌లైన్
ఎగ్జామినేషన్ మోడ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
ఖాళీలు 38,800
పరీక్ష డ్యురేషన్ మూడు గంటలు
అధికారిక వెబ్‌సైట్ https://recruitment.nta.nic.in

EMRS రిక్రూట్‌మెంట్‌ 2023 పోస్టుల వివరాలు (EMRS Recruitment 2023 Posts Details)


EMRS రిక్రూట్‌మెంట్ 2023 పోస్టులకు సంబంధించిన వివరాలు ఈ దిగువున టేబుల్లో అందజేశాం.
ప్రిన్సిపాల్ పోస్టులు 740
వైస్‌ ప్రిన్సిపాల్ పోస్టులు 740
పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ 8,880
ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (TGT) పోస్టులు 8,840
ఆర్ట్‌ టీచర్‌ పోస్టులు 740
మ్యూజిక్‌ టీచర్‌ పోస్టులు 740
ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (PET) పోస్టులు 1,480
లైబ్రేరియన్‌ పోస్టులు 740
కౌన్సెలర్‌ పోస్టులు 740
స్టాఫ్‌ నర్సు పోస్టులు 740
హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులు 1,480
అకౌంటెంట్‌ పోస్టులు 740
సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టులు 740
జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టులు 1480
క్యాటరింగ్ అసిస్టెంట్‌ పోస్టులు 740
డ్రైవర్‌ పోస్టులు 740
ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌ పోస్టులు 740
ల్యాబ్‌ అటెండెంట్‌ పోస్టులు 740
గార్డెనర్‌ పోస్టులు 740
కుక్‌ పోస్టులు 470
మెస్‌ హెల్పర్‌ పోస్టులు 1480
చౌకీదార్‌ పోస్టులు 1480
స్వీపర్‌ పోస్టులు 2,220

EMRS రిక్రూట్‌మెంట్ 2023-అర్హత ప్రమాణాలు (EMRS Recruitment 2023 Eligibility)

ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 38 వేల ఖాళీలకు అభ్యర్థుల నుంచి నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (NESTS) దరఖాస్తులు కోరుతోంది.
  • పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీతోపాటు బీఈడీలో పాసై ఉండాలి.
  • ఇంగ్లీష్, హిందీ, ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి.
  • 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
  • ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 18,000ల నుంచి రూ.2,09,200 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను త్వరలో వెల్లడించడం జరుగుతుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోండి.

/news/eklavya-model-residential-schools-recruitment-2023-41554/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Recent Related News

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top