IDBI Executive Recruitment 2023: ఐడీబీఐ బ్యాంకులో 1036 ఉద్యోగాలు, పూర్తి వివరాలివే

Rudra Veni

Updated On: June 06, 2023 12:38 PM

ఐడీబీఐ బ్యాంకు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ (IDBI Executive Recruitment 2023)  విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1036 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 
IDBI Executive Recruitment 2023: ఐడీబీఐ బ్యాంకులో 1036 ఉద్యోగాలు, పూర్తి వివరాలివేIDBI Executive Recruitment 2023: ఐడీబీఐ బ్యాంకులో 1036 ఉద్యోగాలు, పూర్తి వివరాలివే

IDBI ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2023 (IDBI Executive Recruitment 2023): ఐడీబీఐ బ్యాంకు (IDBI Executive Recruitment 2023) నుంచి పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. కేవలం డిగ్రీ అర్హతతోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మే 24, 2023 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలను ఒక ఏడాది కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. IDBI ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం పూర్తి వివరాలను ఇక్కడ అందజేశాం.

IDBI ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్-నోటిఫికేషన్ లింక్


ఐడీబీఐ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2023 వివరాలు (IDBI Executive Recruitment 2023 Overview)

IDBI ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేనుంది. ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

రిక్రూటింగ్ బాడీ

ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పరీక్ష పేరు ఐడీబీఐ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2023
పోస్ట్ ఎగ్జిక్యూటివ్
ఖాళీలు 1036
కేటగిరి బ్యాంకు ఉద్యోగాలు
అప్లికేషన్ మోడ్ ఆన్‌లైన్
అప్లికేషన్ తేదీలు మే 24, 2023 నుంచి జూన్ 07, 2023
అధికారిక వెబ్‌సైట్ idbibank.in

IDBI ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాలు (IDBI Executive Recruitment 2023 Eligibility)


IDBI ఎగ్జిక్యూటివ్ 2023 కోసం దరఖాస్తు ఫార్మ్‌ను పూరించే ముందు అభ్యర్థులు ముందుగా అర్హత ప్రమాణాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ దిగువ IDBI ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాల వివరాలను అందజేశాం.
  • ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి కనీసం 55% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.
  • అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఆన్‌లైన్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
  • ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి నెలకు రూ.29,000ల నుంచి రూ.34,000 వరకు ఉంటుంది. ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరం రూ.29,000, రెండో సంవత్సరం రూ.31,000, మూడో సంవత్సరం రూ.34,000లు అందిస్తారు.
  • ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్లూబీడీ కేటగిరి అభ్యర్థులు రూ.200లు చెల్లించాలి. ఇతర అభ్యర్థులు రూ.1000లు చెల్లించాలి.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 07, 2023 తేదీలోగా అప్లై చేసుకోవాలి.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం ఈ లింక్‌‌పై https://www.collegedekho.com/te/news/ క్లిక్ చేయండి.

/news/idbi-recruitment-2023-notification-for-1036-executive-posts-41597/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Recent Related News

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top