TSTRANSCO Apprentice Recruitment 2023: తెలంగాణ ట్రాన్స్‌కోలో ఉద్యోగాలు, అప్లై చేసుకోవడానికి నేడే చివరి తేదీ, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Rudra Veni

Published On:

ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్  గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌ షిప్‌ పోస్టులను (TSTRANSCO Apprentice Recruitment 2023) ప్రకటించింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 11, 2023లోపు అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
TSTRANSCO Apprentice Recruitment 2023: తెలంగాణ ట్రాన్స్‌కోలో ఉద్యోగాలు, అప్లై చేసుకోవడానికి నేడే చివరి తేదీ, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండిTSTRANSCO Apprentice Recruitment 2023: తెలంగాణ ట్రాన్స్‌కోలో ఉద్యోగాలు, అప్లై చేసుకోవడానికి నేడే చివరి తేదీ, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

తెలంగాణ ట్రాన్స్‌కో అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2023 (TSTRANSCO Apprentice Recruitment 2023): హైదరాబాద్‌లోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, కార్పొరేట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నుంచి అప్రెంటీస్ షిప్ నోటిఫికేషన్ (TSTRANSCO Apprentice Recruitment 2023) విడుదలైంది. ఈ అప్రెంటీస్ షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే చివరి తేదీ. అర్హులైన ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గ్రాడ్యుయేట్, టెక్నిషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ పోస్టులు మొత్తం 92 ఉన్నాయి.

ట్రాన్స్‌కో అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్

ఏపీ ట్రాన్స్‌కో ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు (Important Dates of AP Transco Jobs)

ఈ దిగువ పట్టికలో ఉన్న TSTRANSCO రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున చూడండి

రిక్రూట్‌మెంట్ అథారిటీ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్
పోస్టుల పేరు గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్ షిప్
కేటగిరి ఇంజనీరింగ్ ఉద్యోగాలు
పోస్టుల సంఖ్య 92
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ఏప్రిల్ 05, 2023
NATS పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 11, 2023
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 12, 2023
టీఎస్ ట్రాన్స్‌కో అధికారిక వెబ్‌సైట్ https://tstransco.in

ఏపీ ట్రాన్స్‌కో ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు (Required Qualifications for AP Transco Jobs)

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి.
  • అభ్యర్థులు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
  • నిబంధనల ప్రకారం రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • అప్రెంటిస్‌షిప్ నిబంధనల ప్రకారం వయో పరిమితి అనుసరించబడుతుంది.
  • అభ్యర్థులు డిప్లొమా/డిగ్రీ (సంబంధిత ఇంజనీరింగ్) పాసై ఉండాలి, 2020,2021, 2022 సంవత్సరంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
  • అప్రెంటీస్ శిక్షణ కాలం: ఒక ఏడాది

TSTRANSCO అప్రెంటీస్ జీతం 2023 (TSTRANSCO Apprentice Salary 2023)

ఈ పోస్టుల్లో చేరిన వారికి శిక్షణ కాలంలో అభ్యర్థులకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఏడాది పాటు ఈ ట్రైనింగ్ ఉంటుంది.
పోస్టుల పేరు స్టైఫండ్
గ్రాడ్యుయేషన్ అప్రెంటీస్ 9,000
డిప్లొమా అప్రెంటీస్ 8,000


ఈ ఉద్యోగాలకు డిగ్రీ, డిప్లొమా కోర్సులో అభ్యర్థి పొందిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ h ttps://tstransco.in‌ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలను కూడా వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌ క్లిక్ చేయండి.

/news/ts-transco-apprentice-recruitment-39000/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Recent Related News

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top