TS Constable Final Written Exam Hall Ticket 2023: తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదల,ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Rudra Veni

Updated On: April 25, 2023 10:36 AM

తెలంగాణలో కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్‌కు సంబంధించిన హాల్ టికెట్లను (TS Constable Final Written Exam Hall Ticket 2023) పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేయడం జరిగింది. హాల్ టికెట్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. 
TS Constable Final Written Exam Hall Ticket 2023: తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదల,ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిTS Constable Final Written Exam Hall Ticket 2023: తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదల,ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

TS కానిస్టేబుల్ ఫైనల్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 (TS Constable Final Written Exam Hall Ticket 2023): పోలీస్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) నోటిఫికేషన్ (Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రిలిమనరీ ఎగ్జామ్, ఫిజికల్ ఈవెంట్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ రెండో దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 30న మెయిన్స్ ఎగ్జామ్ జరగనుంది. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను (TS Constable Final Written Exam Hall Ticket 2023) అధికారులు విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు 28వ తేదీ అర్థ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు అధికారిక వెబ్‌సైట్ https://www.tslprb.in/ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

టీఎస్ కానిస్టేబుల్ మెయిన్స్ హాల్ టికెట్ 2023 పూర్తి వివరాలు (TS Constable Mains Hall Ticket 2023 Overview)

టీఎస్ కానిస్టేబుల్ మెయిన్స్ హాల్ టికెట్ 2023కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో అందజేశాం.

సంస్థ పేరు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB)
పోస్టుల పేరు తెలంగాణ కానిస్టేబుల్
కేటగిరి ప్రభుత్వ ఉద్యోగం
ఫైనల్ రాత పరీక్ష ఏప్రిల్ 30, 2023
టీఎస్ కానిస్టేబుల్ రాత పరీక్ష హాల్ టికెట్లు స్టేటస్ విడుదల అయ్యాయి
ఉద్యోగ ప్రదేశం తెలంగాణ
అధికారిక వెబ్‌సైట్ www.tslprb.in

టీఎస్ కానిస్టేబుల్ మెయిన్స్ హాల్ టికెట్ 2023 లింక్ (TSLPRB Police Constable Mains Hall Ticket 2023 Download Link)

టీఎస్ కానిస్టేబుల్ మెయిన్ హాల్ టికెట్‌ 2023‌ని డౌన్‌లోడ్ లింక్ యాక్టివేట్ అయిన వెంటనే దరఖాస్తుదారులు ఈ కింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసి హాల్ టికెట్‌ని 2023 డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టీఎస్ కానిస్టేబుల్ మెయిన్ హాల్ టికెట్ కోసం డైరక్ట్ లింక్


టీఎస్ కానిస్టేబుల్ మెయిన్స్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం (Steps to Download TSLPRB Police Constable Mains Hall Ticket 2023)

టీఎస్ కానిస్టేబుల్ మెయిన్స్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అవ్వొచ్చు.
  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.tslprb.in ని సందర్శించాలి.
  • హోంపేజీలో Download TSLPRB Police Constable Mains Hall Ticket లింక్‌పై క్లిక్ చేయాలి.
  • ఆ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ లాగిన్ వివరాలను నమోదు చేసి, మొబైల్ నెంబర్, పాస్ వర్డ్ అవసరమైన ప్రదేశాలలో నమోదు చేయాలి.
  • TSLPRB Police Constable Mains Hall Ticket 2023 మీ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. మీ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • ఆ హాల్ టికెట్‌ని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే support@tslprb.in కు మెయిల్‌ లేదా 9393711110, 9391005006 నెంబర్లను సంప్రదించాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల క ోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పైక్లిక్ చేయండి.

/news/tslprb-police-constable-mains-exam-hall-ticket-2023-39565/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Recent Related News

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top