TSPSC Group 3 Hall Ticket Release Date: TSPSC Group 3 హాల్ టికెట్ ఎప్పుడు విడుదలవుతుందంటే?

Rudra Veni

Published On:

TSPSC Group 3 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారా? హాల్ టికెట్ విడుదల తేదీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? (TSPSC Group 3 Hall Ticket Release Date)  అయితే ఈ న్యూస్ ఆర్టికల్లో తెలుసుకోండి. 
TSPSC Group 3 Hall Ticket Release Date: TSPSC Group 3 హాల్ టికెట్ ఎప్పుడు విడుదలవుతుందంటే?TSPSC Group 3 Hall Ticket Release Date: TSPSC Group 3 హాల్ టికెట్ ఎప్పుడు విడుదలవుతుందంటే?

TSPSC Group 3 హాల్ టికెట్ రిలీజ్ డేట్ (TSPSC Group 3 Hall Ticket Release Date): తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాలలో జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అకౌంటెంట్లు ఇతర పోస్టుల కోసం అభ్యర్థులను నియమించడానికి TSPSC గ్రూప్ 3 పరీక్షను త్వరలో నిర్వహించనుంది. TSPSC జనవరి 2023లో వివిధ విభాగాలలో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కమిషన్ 1365 ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులు సంబంధిత పోస్టులకు 24 జనవరి నుంచి 23 ఫిబ్రవరి 2023 వరకు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ పరీక్ష సెప్టెంబర్ 15న, 2023న రెండు షిఫ్టులలో జరిగే అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారో ఈ ఆర్టికల్లో తెలియజేయడం జరిగింది. అయితే TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్లు పరీక్ష తేదీకి కనీసం రెండు వారాల ముందు వెబ్‌సైట్‌లో విడుదల చేయబడతాయి. దరఖాస్తు రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి అభ్యర్థులు దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తదనుగుణంగా ఈ వెబ్‌పేజీలో హాల్ టిక్కెట్‌ను సూచించే డైరెక్ట్ లింక్‌ను మేము అందిస్తాం.

TSPSC Group 3 హాల్ టికెట్ వివరాలు (TSPSC Group 3 Hall Ticket Details)

TSPSC Group 3 హాల్ టికెట్‌కు సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి.
రాష్ట్రం తెలంగాణ
రిక్రూట్‌మెంట్ ఆర్గనైజేషన్ TSPSC
రిక్రూట్‌మెంట్ పేరు గ్రూప్ 3 సర్వీసెస్
ఖాళీల వివరాలు 1356
రాత పరీక్ష సెప్టెంబర్ 15 (అంచనా)
TSPSC Group 3 Hall Ticket విడుదల తేదీ పరీక్షకు రెండు వారాల ముందు
అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in

తెలంగాణ గ్రూప్ 3 పోస్టుల పరీక్షా విధానం (Telangana Group 3 Posts Examination Scheme)

తెలంగాణ గ్రూప్ 3 పోస్టుల పరీక్షా విధానం ఎలా ఉంటుందో ఈ దిగువున తెలియజేశాం.
  • TSPSC గ్రూప్ 3 పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది
  • మొత్తం మూడు పేపర్లు ఉంటాయి.
  • ఒక్కో భాగంలో 150 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి.
  • ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది.
  • ఒక్కో పేపర్ 150 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

TSPSC గ్రూప్ 3 పరీక్షకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ రాత పరీక్ష తేదీ కోసం దరఖాస్తుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరీక్ష షెడ్యూల్, ఇతర సమాచారాన్ని అధికారులు త్వరలో విడుదల చేస్తారు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/tspsc-group-3-hall-ticket-release-date-2023-43896/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Recent Related News

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top