Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

హోలీ పండుగ విశేషాలు

పండుగల్లో హోలీ పండుగ చాలా ప్రత్యేకమైనది. ఆ రోజున అందరూ రంగుల్లో మునిగితేలుతుంటారు. చిన్నవాళ్లు, పెద్దవాళ్లు అందరూ ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీ పండుగకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ చూడండి.  

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

భారతదేశంలో ప్రధాన పండుగల్లో హోలీ కూడా ఒకటి. ఈ పండుగ సంతోషానికి చిహ్నం. హోలీ ఒక రంగుల పండుగ. ఈ పండుగ సందర్భంగా ప్రజలు ఒకరికొకరు రంగులు పూసుకుంటారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడుపుతారు. హిందూ పంచాంగం ప్రకారం హోలీ పండుగను ఫాల్గుణ మాసం పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఇది మార్చి నెలలో వస్తుంది. హోలీ హిందువుల ముఖ్యమైన పండుగ. ఈ ఏడాది కూడా
మార్చి 04వ తేదీన హోలీ పండుగ వచ్చింది.

ఈ హోలీ పండుగ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, హోలీపై మాట్లాడే పోటీలు నిర్వహిస్తుంటారు. అందుకే విద్యార్థుల కోసం మేము ఇక్కడ 100 పదాలు, 200 పదాలు, 500 పదాలు లేదా 1000 పదాల్లో వ్యాసాలు ఎలా రాయోలో తెలియజేసాం. ఈ ఆర్టికల్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇది కూడా చూడండి:హోలీ పండుగ ప్రాముఖ్యత వివరాలు

100 పదాల్లో తెలుగులో హోలీ పండుగపై వ్యాసం (Essay on Holi in 100 words in telugu)

హోలీ పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఇష్టమైన పండుగ.. ఆనందోత్సహాల వేడుక. కేరింతలు.. తుళ్లింతల మేళవింపు. వీధులన్నీ రంగులమయమవుతాయి. ఈ పండుగకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఈ పండుగను ఒక్కో దగ్గర ఒక్కోలా పిలుస్తారు. వసంత పంచమి, రంగ్ పంచమి, పాల్గుణ పౌర్ణమి, కాముని పున్నమి ఇలా ఎక్కడ ఏ పేరుతో పిలిచినా ఈ పండుగను జరుపుకునే తీరు మాత్రం ఒక్కటే. చిన్నవాళ్లు, పెద్దవాళ్లు అందరూ రంగుల్లో తడిసి ముద్దవుతారు. ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుంటారు. ఆటపాటల్లో మునిగితేలుతారు. పైగా ఈ పండుగను కుల, మతాలకు అతీతంగా జరుపుకుంటారు. వీధుల్లో అందరూ.. అందరితో కలసి మెలసి జరుపుకునే గొప్ప పండుగ హోలీ. ఇంకో విషయం ఏమిటంటే మనకి ఇది పండగ మాత్రమే. నేపాలీయులకి జాతీయ వేడుక., బంగ్లాదేశ్‌, పాకిస్థాన్, సురినామ్‌, దక్షిణాఫ్రికా, మలేషియా, బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియా, మారిషస్‌, ఫిజి దీవుల్లోనూ హోలీని ఘనంగా జరుపుకుంటారు.

200 పదాల్లో తెలుగులో హోలీ పండుగపై వ్యాసం (Essay on Holi in 200 words in telugu)

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా హోలీ పండుగ వచ్చేసింది. రంగు రంగుల అల్లికల హోలీ పండుగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా నిర్వహించుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో హోలీ పండుగ రోజున ఒకరిపై మరొకరు రంగులు, రంగు నీళ్లు జల్లుకుంటూ ఉత్సాహంగా గడుపుతారు. కానీ ఉత్తరప్రదేశ్‌లో హోలీని పెద్ద పండుగలా జరుపుకుంటారు. ఇక్కడ నందగావ్‌ గ్రామాన్ని కృష్ణ జన్మస్థలంగానూ, బర్సానాని రాధ పుట్టిన ఊరుగానూ భావించి ఈ వేడుకని 16 రోజులపాటు వైభవంగా జరుపుకుంటారు. నందగావ్‌, బర్సానాలో స్త్రీలు రాధలుగానూ, మగవాళ్లు కవ్వించే మాటలతో కృష్ణులుగా మారిపోతారు. దాంతో రాధలంతా కలిసి సరదాగా కర్రలతో కొడుతుంటే వెంట తెచ్చుకున్న డాలుతో తమను కాపాడుకునేందుకు కృష్ణులు తంటాలు పడుతారు. అందుకే దీన్ని లాఠ్‌మార్‌ హోలీ అంటారు. ఇక ఒడిశాలో జగన్నాథ, పూరీ ఆలయాలలో రాధా, కృష్ణుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు జరిపించి ఆ తర్వాత హోలీ వేడుకలను ప్రారంభిస్తారు. గుజరాత్‌లో అయితే హోలీ రోజున పెద్ద మైదానం లాంటి ప్రదేశం దగ్గర గుమికూడి మంటలు వేస్తారు. ఈ మంటల్లో ఇంట్లో ఉన్న పాత చెక్క సామానులన్నీ తీసుకొచ్చి వేస్తారు. మంటల చుట్టూ చేరి నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఆనందిస్తారు.అదేవిధంగా మహారాష్ట్రలో హోలీక దిష్టిబొమ్మను దహనం చేస్తారు. ఇక్కడ ఉదయం వేసిన మంటలు సాయంత్రం దాకా మండుతూనే ఉంటాయట. దీనికోసం ఒక వారం ముందు నుంచే యువకులు ఇంటింటికి తిరిగి పాత చెక్క సామానులు సేకరిస్తుంటారు.

అలాగే మణిపూర్‌లో హోలీని వారం రోజుల పాటు నిర్వహిస్తారు. పండుగ రోజు మగపిల్లలు ఆడపిల్లలకు డబ్బులు ఇస్తేనే ఆడ పిల్లలు వారి మీద రంగులు చల్లుతారు. రాత్రి సమయంలో చిన్నాపెద్దా అందరూ కలిసి ఒక చోట చేరి మంటల చుట్టూ డ్యాన్స్ చేస్తారు. అంతేకాదు చివరిరోజు కృష్ణుడి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. కశ్మీర్‌లో కూడా సైనికులతో సహా అందరూ హోలీ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆటపాటలతో గడుపుతారు. పంజాబ్‌లోని సిక్కులు కూడా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఇక్కడ హోలీని హోలా మోహల్లా అంటారు. వాస్తవానికి దేశం మొత్తంలో ఆనంద్‌పూర్ సాహిబ్‌లో జరిగే హోలీ ఉత్సవం చాలా పేరు పొందింది. విదేశాల నుంచి కూడా ప్రజలు పంజాబ్‌కు వచ్చి వారి సంప్రదాయ పద్ధతిలో హోలి పండుగను జరుపుకుంటారు. పెద్ద స్థాయిలో పంజాబ్‌లో హోలీని నిర్వహిస్తారు. హర్యాణాలో కూడా హోలీ పండుగకు కొంత ప్రత్యేకంగా నిర్వహిస్తారు. కరోర్ మార్ హోలీ పేరుతో వేడుకలు చేస్తారు.

విద్యార్థుల జీవితంలో హోలీ పండుగ ప్రాధాన్యం (The importance of Holi festival in the lives of students)

విద్యార్థుల జీవితంలో హోలీ పండుగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ సందర్భంగా పాఠశాలల్లో వ్యాస రచన, ప్రసంగ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యార్థులు తమ స్నేహితులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారు. హోలీ పండుగ ద్వారా స్నేహం, సమానత్వం, కలిసిమెలిసి జీవించడం వంటి విలువలను విద్యార్థులు నేర్చుకుంటారు. పరీక్షల ఒత్తిడిని మరిచి, ఉల్లాసంగా గడిపే అవకాశం హోలీ అందిస్తుంది.

500 పదాల్లో తెలుగులో హోలీ పండుగపై వ్యాసం (Essay on Holi in 500 words in telugu)

మన అంతరంగాన్ని చెబుతాయి.. మన ఉద్వేగాలకు ఆకారాన్ని ఇస్తాయి.. మంచి, చెడులకు చిహ్నాలుగా నిలబడతాయి.. అవే రంగులు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో రంగులు.. కొన్ని రంగులు మురిపిస్తాయి.. మరికొన్ని మరిపిస్తాయి.. ఇంకొన్ని మైమరిపిస్తాయి. ఏ వర్ణాన్ని చూసినా.. ఏదో తెలియని తియ్యని అనుభూతి కలుగుతుంది. అలాంటిది అన్ని ఒకచోటే చేరితే.. ఆ థ్రిల్లే వేరు. అన్ని వర్ణాల కలబోతే .. హోలీ. హోలీ వచ్చేసింది.. చెప్పలేని ఆనందాన్ని తెచ్చేసింది. చిన్న,పెద్ద అని తేడా లేకుండా అందరూ రంగుల్లో మునిగి తేలే.. ఆట. ఇప్పటికే ఆ రంగుల ఖేళీకి దేశం సిద్ధమైంది.

భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ ఉత్సవంగా జరుపుకునే పర్వదినం హోలీ పండుగ. సప్తవర్ణాలను ఒకరిపై ఒకరు చల్లుకుని, అంతరాలను దూరంగా ఉంచి సంబరంగా జరుపుకునే శుభదినం. హోలీ పండుగకు అనేక కథలు ఉనికిలో ఉన్నా పండుగకు చాలా చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. వింధ్య ప్రాంతంలో గల రాయగఢ్ దగ్గర జరిగిన తవ్వకాల్లో లభించిన శిలలపై ఉన్న రాతలు హోలీ పండగ గురించి తెలియజేశాయి. ఇవి 300 B.C కాలం నాటివి గా చరిత్రకారులు గుర్తించారు. ఏడో శతాబ్దంలో హర్షవర్ధనుడు రచించిన 'రత్నావళి'లో కుడా హోలీ పండగ గురించి చెప్పబడిందంట. ఆది నుంచి వసంత రుతువును పసుపు నీళ్లను జల్లుకుని ఆహ్వానించడం , శీతాకాలానికి వీడ్కోలు చెప్పడం ఈ పండుగ జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తుంది.

హోలీ పండుగ వెనుక ఉన్న పురాణ కథ (The legendary story behind the festival of Holi)

హోలీ పండుగకు సంబంధించిన పురాణ కథ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. అసుర రాజు హిరణ్యకశిపుడు తనను తప్ప మరెవ్వరు దేవుడిని పూజించకూడదని ఆజ్ఞాపించాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడిగా ఉండటంతో హిరణ్యకశిపుడు అతడిని శిక్షించాలనుకున్నాడు. తన చెల్లలు హోలికకు అగ్నిలో కాలిపోని వరం ఉండటంతో, ప్రహ్లదుడిని ఆమె ఒడిలో కూర్చోబెట్టి మంటల్లోకి పంపాడు. అయితే విష్ణు కృప వల్ల ప్రహ్లాదుడికి ఏమి కాలేదు. హోలిక మాత్రం అగ్నిలో దహనమైంది. ఈ సంఘటన మంచి చెడుపై గెలిచిన రోజుగా భావించి, హోలీ పర్వదినాన్ని జరుపుకుంటారు. అందుకే హోలీ ముందు రోజు హోలిక దహనం చేస్తారు. ఇది ధర్మానికి అధర్మంపై కలిగిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది.

హోలీ పండుగలో అనేక ఆరోగ్య సూత్రాలు కూడా దాగి ఉన్నాయి. చలికాలం వెళ్లి వేసవి వచ్చే సమయంలో జ్వరాలు, జలుబులూ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే వసంతంలో విరబూసే వేప, బిల్వ, మందార, అగ్నిపూలు వంటి ఔషధ గుణాలున్న ఆకులూ పువ్వుల పొడుల్నీ పసుపూ కుంకుమల్నీ నీళ్లలో కలిపి చల్లుకోవడం ఆనవాయితీ అయిందని ఆయుర్వేదం చెబుతోంది. ఈ నీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. అలా ఆరోగ్యం కోసం ఆడుకునేది కాస్తా క్రమంగా కృత్రిమ రంగులతో నిండిపోయిందనే వాదన కూడా ఉంది. దాంతో మార్కెట్‌లో సహజ రంగులు మాత్రమే తీసుకోవడానికి అందరూ ఇష్టపడుతున్నారు.

పర్యావరణ హిత హోలీ (Eco-friendly Holi)

నేటి కాలంలో హోలీ పండుగను పర్యావరణాన్ని కాపాడుతూ జరుపుకోవడం చాలా అవసరం. రసాయనాలతో తయారైన కృత్రిమ రంగులు చర్మం మరియు కళ్లకు హానికరంగా ఉంటాయి. అంతేకాక, నీటి వృథా కూడా పెరుగుతుంది. అందుకే, పూర్వకాలంలో వాడిన పసుపు, కుంకుమ, పూలు, ఆకులతో తయారైన సహజ రంగులను ఉపయోగించడం మంచిది. నీటిని అవసరమైనంత మాత్రమే వినియోగించి, జంతువులు మరియు పక్షులకు ఇబ్బంది కలగకుండా హోలీ జరుపుకోవాలి. ఇలా చేస్తే, హోలీ పండుగ ఆనందాన్ని మాత్రమే కాకుండా, బాధ్యతను కూడా గుర్తు చేసే పండుగగా మారుతుంది.

ఈ హోలీ పండుగ లో రంగులకే కాదు పిండి వంటలకు, పానీయాలకు కుడా ప్రాముఖ్యం ఉంది. ఈ పండుగలో రకరకాల తీపి పదార్థాలు చోటు దక్కించుకున్నాయి. హోలీ పండుగ రోజున ఉత్తరాదిన కోవా, కొబ్బరి, బెల్లం, మైదా కలిపి చేసే గుజియా అనే సంప్రదాయ స్వీటు చవులూరిస్తుంది. ఆ రోజున రంగుల హేల అయ్యాక, ఒకరికొకరు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుని, కుల్ఫీలు తిని, చలువచేసే ఠండాయీ.. వంటి పానీయాలు తాగుతూ ఆనందంగా గడుపుతారు.

అలాగే హోలీ రోజు రంగులదే ప్రధాన పాత్ర. ఆ రంగులకి, మనసుకి చాలా దగ్గర సంబంధం ఉందని సైకాలజీస్టులు చెబుతుంటారు. మనం ఇష్టపడే రంగు మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందట. ఇష్టపడే రంగును బట్టి మనిషిని అంచనా వేయవచ్చంట. అంతేకాదు మనకిష్టమైన రంగును చూసినప్పుడు మనసుకు ప్రశాంతత, మానసిక ఆనందం కలుగుతుంది.

మనం ఇష్టపడే రంగు మన మానసిక, శారీరక స్థితిగతులను చెబుతాయి. అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉన్న వారు ముదురు రంగులను, తటస్థ వైఖరి ఉన్న వారు సాదా రంగులు ఇష్టపడతారట. హుందాగా ఉండాలనుకునే వారికి లేతరంగులే నచ్చుతాయట. క్రియేటివ్‌గా ఆలోచించేవారు ఆఫ్‌బీట్‌ కలర్స్‌నే ఎక్కువగా ఇష్టపడతారు. సహజంగా మహిళలు బ్రైట్‌, లైవ్‌లీ రంగుల్ని ఇష్టపడతారు. వ్యక్తి కలర్‌ను ఎంచుకోవడం ద్వారా వారిలో ఆ స్వభావం ఉంటుందని చెప్పవచ్చు. ఒకే రంగును ఇష్టపడే వ్యక్తుల మధ్య స్నేహం కూడా చిగురిస్తుందని అంటున్నారు సైకాలజిస్టులు. అలాగే కొందరికి కొన్ని రంగులు అస్సలు నచ్చవు. అలాంటి రంగులు మీలో ఉన్న అశక్తత, వీక్‌నెస్‌‌లను గురించి తెలియజేస్తాయి.

మొత్తానికి, హోలీ పండుగ ఆనందం, ఐక్యత మరియు స్నేహానికి సంకేతం. కుల, మత భేదాలు లేకుండా అందరినీ ఒకటిగా కలిపే గొప్ప పండుగ ఇది. రంగుల్లా మన జీవితాలు కూడా సంతోషంగా, శాంతియుతంగా ఉండాలని హోలీ మనకు తెలియజేస్తుంది.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

సంబంధిత ఆర్టికల్స్

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

Fees amount fees. Amount hostel quality at Padmasree College of Nursing

-Mini nelsonUpdated on May 19, 2026 04:12 PM
  • 1 Answer
Nidhi Priya, Content Team

Padmasree College of Nursing offers accommodation facilities to its students through the hostels at the campus. It has separate hostels for the male and female students. The hostel rooms are well furnished and have all the essential facilities for the students to ensure a comfortable stay. Padmasree College of Nursing hostel fee ranges between Rs 50,000 to 70,000 depending on the type of the hostel room. The hostel is supervised by wardens and assistant wardens. It also has a mess that takes care of the food requirements.

READ MORE...

Can you please remove account from collegedekho. I don't want to receive any SMS, Email's and Phone calls from Colleges. Even though i am you sending mails there is no response from you.

-NothingUpdated on May 19, 2026 04:12 PM
  • 78 Answers
Chaudhary tiya Vishnubhai, Student / Alumni

Padmasree College of Nursing offers accommodation facilities to its students through the hostels at the campus. It has separate hostels for the male and female students. The hostel rooms are well furnished and have all the essential facilities for the students to ensure a comfortable stay. Padmasree College of Nursing hostel fee ranges between Rs 50,000 to 70,000 depending on the type of the hostel room. The hostel is supervised by wardens and assistant wardens. It also has a mess that takes care of the food requirements.

READ MORE...

How can i get admission in bckv through cuet?

-swastika barmanUpdated on May 19, 2026 12:17 PM
  • 28 Answers
Shila, Student / Alumni

Padmasree College of Nursing offers accommodation facilities to its students through the hostels at the campus. It has separate hostels for the male and female students. The hostel rooms are well furnished and have all the essential facilities for the students to ensure a comfortable stay. Padmasree College of Nursing hostel fee ranges between Rs 50,000 to 70,000 depending on the type of the hostel room. The hostel is supervised by wardens and assistant wardens. It also has a mess that takes care of the food requirements.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us