అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై ప్రత్యేక వ్యాసం (Women's Day 2025 Essay in Telugu)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసాన్ని (Women's Day 2025 Essay in Telugu) ఇక్కడ అందించాం. మహిళా దినోత్సవం చరిత్రను కూడా ఇక్కడ అందించాం.
ఇది కూడా చూడండి: మహిళా దినోత్సవం గొప్పతనంపై స్పీచ్
అంతర్జాతీయ శ్రామిక పోరాట మహిళా దినోత్సవం చరిత్ర (International Women's Day History)
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించారు.1975వ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించింది. అలాగే ప్రతి ఏటా ఏదో ఒక ఇతివృత్తం (థీమ్)తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి.
అయితే మహిళల హక్కుల కోసం, వారి సాధికారత కోసం ఏళ్ల తరబడి పోరాటాలు జరుగుతున్నా.. చాలాదేశాల్లో మహిళలకు రక్షణ లేకుండా ఉంది. ఇంటా, బయటా కనీసమైన భద్రత కరువవుతుంది. అత్యాచారాలు, హత్యలు, లైగింక వేధింపులు, మానసిక వేధింపులు వారిపై కొనసాగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ల వరకు మహిళలు వివక్షతకు గురవుతూనే ఉన్నారు. లింగపరమైన సమానత్వం కలగా మిగిలిపోయింది. దీంతో మహిళల పోరాటం అనివార్యం అవుతుంది.
ఒక దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు, లింగ సమానత్వం, స్థితి ఆందోళన కలిగించే ఒక సమస్యగానే ఉంది. ప్రతి దేశంలోనూ మహిళల పరిస్థితి అత్యంత దారుణంగానే ఉంటుంది. ఈ విషయంలో కొన్ని దేశాలు పోటి పడుతున్నాయి. ముఖ్యంగా 2024లో నిర్వహించిన ఓ స్టడీలో ఈ విషయం మరోసారి తేలింది. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రయత్నాలు వంటి వివిధ అంశాల ఆధారంగా మహిళలు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్న టాప్ 10 దేశాలను ఇక్కడ చూడండి.
మహిళలకు అత్యంత ప్రమాదకరమైన 10 దేశాల జాబితా
- ఆఫ్ఘనిస్తాన్
- సిరియా
- యెమెన్
- పాకిస్తాన్
- ఇరాక్
- దక్షిణ సూడాన్
- బురుండి
- కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్
- సోమాలియా
- ఎస్వాటిని (Eswatini)
కాంగో (DRC) మహిళలకు అత్యంత దారుణమైన దేశాలలో ఒకటి. లింగ అసమానత, అధిక స్థాయి హింస, విద్య, ఆరోగ్య సంరక్షణకు పరిమిత ప్రాప్యతతో సహా మహిళలను ప్రభావితం చేసే అనేక సవాళ్లతో దేశం బాధపడుతోంది. సోమాలియా UNDP లింగ అసమానత సూచిక స్కోర్ 0.776ను కలిగి ఉంది. సోమాలియాలో అత్యాచారాలు, లైంగిక హింస అధికంగా ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక అత్యాచారాలు జరుగుతున్న దేశాల్లో ఒకటిగా ఉంది. ఎస్వాటిని గతంలో స్వాజిలాండ్ అని పిలిచేవారు. దక్షిణాఫ్రికాలోని ఒక చిన్న, భూపరివేష్టిత దేశం. లింగ సమానత్వం పరంగా ఎస్వాటిని పేలవంగా ఉంది. UNDP లింగ అసమానత సూచిక ప్రకారం, Eswatini స్కోరు 0.569.
మహిళలకు మంచి దేశాలు ఏవి?
ఈ కాలంలో మహిళలు జీవించడానికి మంచి దేశాలు నిలిచినవి మూడు మాత్రమే.
- నెదర్లాండ్స్
- నార్వే
- స్వీడన్
2025లో మహిళా పర్యాటకుల కోసం టాప్ 10 అత్యంత ప్రమాదకరమైన దేశాలు, మన దేశం ఏ ప్లేస్‌లో ఉందంటే?
కొన్ని దేశాల్లో మహిళల హక్కులలో కొంత పురోగతి ఉన్నప్పటికీ, అనేక దేశాల్లో మహిళల పరిస్థితి అత్యంత ప్రమాదకరంగానే ఉన్నాయి. నిజానికి ఆ దేశాలు మహిళలు జీవించడానికి ప్రమాదకరమైన దేశాలుగా పరిగణింపబడుతున్నాయి. కొన్ని దేశాలు మహిళలు ట్రావెలింగ్‌కి అత్యంత ప్రమాదకరంగా మారినట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఈ లిస్ట్‌లో మన దేశం కూడా 8వ స్థానంలో ఉంది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ ద్వారా తాజా ఉమెన్ డేంజర్ ఇండెక్స్ 2025 ప్రకారం మహిళా పర్యాటకులకు అసురక్షితంగా పరిగణించబడే టాప్ 10 దేశాలు ఇక్కడ అందించాం.
- దక్షిణా ఆఫ్రికా
- బ్రెజిల్
- రష్యా
- మెక్సికో
- ఇరాన్
- ఈజిప్ట్
- మార్కో
- భారతదేశం
- థాయిలాండ్
- కొలంబియా
ఎవరైనా మహిళలు ఈ దేశాలను సందర్శించాలనుకుంటే కచ్చితంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ దేశాలను సందర్శించే ముందు సమగ్ర పరిశోధన చేయాలని, ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లను అందుబాటులో ఉంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో సమూహాలలో ప్రయాణించడం మంచిదని చెబుతున్నారు.
ఈ 2025లో కూడా మహిళల పరిస్థితి ఇంత దారుణంగా ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి లేదు. ఈ నేపథ్యంలో ప్రతి దేశం కూడా మహిళల హక్కుల కోసం, ఆమె రక్షణ కోసం కచ్చితంగా ప్రత్యేకమైన చర్యలను తీసుకోవాలి. మహిళల విషయంలో ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. ప్రతి మహిళ చదువుకునేలా ఏర్పాట్లు చేయాలి. ఆర్థికంగా స్థిరపడేలా మార్గాలను అన్వేషించాలి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాముఖ్యత (International Women's Day: Importance)
- సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ జీవితంలో మహిళల విజయాలను గౌరవించడం.
- జీవితంలోని ప్రతి రంగంలో లింగ సమానత్వం కోసం పోరాడడం.
- జీతభత్యాల్లో తేడాలను వ్యతిరేకించడం, అధికార స్థానాల్లో తక్కువ ప్రాతినిథ్యం, విద్యను పొందే అవకాశం వంటి కొనసాగుతున్న అసమానతలను వెలుగులోకి తీసుకురావడం.
- మహిళా దినోత్సవాన్ని సూచించడానికి ఉపయోగించే రంగులు - ఊదా (న్యాయం), ఆకుపచ్చ (ఆశ), తెలుపు (స్వచ్ఛత) ఈ రంగులు మహిళల ఓటు హక్కు, సమానత్వం కోసం సుదీర్ఘ పోరాటాన్ని సూచిస్తాయి.
మహిళల తెలుసుకోవాల్సిన ముఖ్యమైన హక్కులు (Women's Rights to Know)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన హక్కుల గురించి ఈ దిగువున అందించాం. ఈ హక్కులపై మహిళలకు కచ్చితంగా అవగాహన ఉండాలి. వీటి గురించి తెలుసుకుంటే మహిళలు దేని కోసం పోరాడాలో.. ఎలా పోరాడాలో వారికి దిశ నిర్దేశం ఏర్పడుతుంది. సాటి మహిళలకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
- లింగ సమానత్వం: విద్య, పని, నాయకత్వంలో సమాన అవకాశాలు.
- హింస నిర్మూలన: గృహ హింస, లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణా నిర్మూలన.
- ఆర్థిక సాధికారత: వేతనంలో లింగ అంతరాన్ని తగ్గించడం, వనరులను పొందేలా చూడటం.
- రాజకీయ భాగస్వామ్యం: ప్రభుత్వంలో మహిళల భాగస్వామ్యం విస్తరణ.
- ఆరోగ్యం, విద్య: బాలికలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు, విద్య అందుబాటులో ఉండాలి.