AISSEE 2025 సైనిక్ స్కూల్ కోరుకొండ అంచనా కటాఫ్ మార్కులు (AISSEE 2025 Sainik School Korukonda Expected Cutoff Marks)
సైనిక్ స్కూల్ AISSEE 2025 ఆంధ్రప్రదేశ్ అంచనా కటాఫ్ మార్కులు ఎంతంటే దరఖాస్తు చేసిన (AISSEE 2025 Sainik School Korukonda Expected Cutoff Marks) అభ్యర్థులుకు ఈ క్రిందన ఇచ్చాము చూడండి.
AISSEE 2025 సైనిక్ స్కూల్ కోరుకొండ ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ మార్కులు (AISSEE 2025 Sainik School Korukonda Expected Cutoff Marks) :
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి రౌండ్‌కు AISSEE కటాఫ్ మార్కులను త్వరలో విడుదల చేస్తుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సైనిక్ స్కూల్ కటాఫ్ జాబితా 2025 మే 2025లో అధికారిక వెబ్‌సైట్
pesa.ncog.gov.in
లో విడుదల చేయడం జరుగుతుంది. సైనిక్ స్కూల్ ఫలితం 2025ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేస్తుంది. ఫలితాలు మే 2025 మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.సైనిక్ స్కూల్స్‌లో అడ్మిషన్ పొందాలంటే కటాఫ్ మార్కులు కీలకం అని చెప్పాలి. ఈ AISSEE 2025 కటాఫ్ మార్కులను పాఠశాల వారీగా కేటగిరీ వారీగా అంచనా వేయడానికి సహాయపడుతుంది. ఈ క్రమంలో ఇక్కడ కోరుకొండ పాఠశాల కోసం అన్ని కేటగిరీలకు AISSEE 2025 సైనిక్ స్కూల్ ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్‌ను తీసుకువచ్చాం. దరఖాస్తుదారుల సంఖ్య, పరీక్ష కష్ట స్థాయి, మొత్తం అభ్యర్థుల పనితీరు వంటి అంశాలపై ఆధారపడి వాస్తవ కటాఫ్ మార్కులు మారే అవకాశం ఉంటుంది.
సైనిక్ స్కూల్ కోరుకొండ ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఉంది. విద్యార్థులు 6వ తరగతి 9వ తరగతుల్లో NTA నిర్వహించే MCQ- ఆధారిత ఆఫ్‌లైన్ పరీక్ష, ఆల్-ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AISSEE) ద్వారా సైనిక్ స్కూల్ కోరుకొండలో ప్రవేశం పొందవచ్చు.
AISSEE సైనిక్ స్కూల్ కటాఫ్ 2025ను ప్రభావితం చేసే అంశాలివే..
AISSEE సైనిక్ స్కూల్ కటాఫ్ 2025ను ప్రభావితం చేసే అంశాలు ఈ దిగువున అందించడం జరిగింది.
- పరీక్ష కష్టం: పరీక్ష క్లిష్టతస్థాయి అభ్యర్థుల మొత్తం పనితీరును ప్రభావితం చేస్తుంది.
- దరఖాస్తుదారుల సంఖ్య: పరీక్షలో ఎక్కువ మంది దరఖాస్తుదారులు.
- లభ్యమయ్యే సీట్లు: పరిమిత సీట్లు ఉన్న పాఠశాలలు తరచుగా అధిక కటాఫ్‌లను కలిగి ఉంటాయి.
- కేటగిరీ రిజర్వేషన్లు : SC, ST, OBC మరియు EWS కేటగిరీలకు రిజర్వ్ చేయబడిన సీట్లు కటాఫ్‌లను ప్రభావితం చేస్తాయి.
- కొత్త పాఠశాలలు: కొత్తగా స్థాపించబడిన పాఠశాలలు ప్రారంభంలో తక్కువ కటాఫ్‌లను కలిగి ఉంటాయి.
బాలురు, బాలికలకు AISSEE 2025 సైనిక్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ ఎక్సపెక్టెడ్ కటాఫ్ మార్కులు
AISSEE 2025 సైనిక్ స్కూల్ ఆంద్రప్రదేశ్ బాలురు, బాలికలకు ఎక్సపెక్టెడ్ కటాఫ్ మార్కులను ఈ క్రింద టేబుల్లో అందించాం.
సైనిక్ స్కూల్ కోరుకొండ ( ఆంధ్రప్రదేశ్ )
మొత్తం సీట్లు | ఆంధ్రప్రదేశ్ | ఇతర రాష్ట్రాలు |
బాలురు -83 | 57 | 5 |
బాలికలు -10 | 5 | 5 |
సైనిక్ స్కూల్ కోరుకొండ ( ఆంధ్రప్రదేశ్ )
క్యాటగిరీ | ఆంధ్రప్రదేశ్ (బాలురు &బాలికలు) | ఇతర రాష్ట్రాలు (బాలురు &బాలికలు ) |
సాధారణ | 271-276 | 276-281 |
ఓబీసీ - ఎన్ సి ల్ (NCL ) | 270-275 | 274-278 |
రక్షణ | 267-271 | 270-274 |
SC | 265-268 | 269-274 |
ST | 258-265 | 262-265 |
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.