AISSEE 2026 సిటీ స్లిప్పులు విడుదల, జనవరి 18న సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష
NTA AISSEE 2026 పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను విడుదల చేసింది. AISSEE విద్యార్థులు తమ పరీక్షకు సంబంధించిన నగర వివరాలను ఈ క్రింద ఉన్న అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
AISSEE 2026 సిటీ ఇంటిమేషన్ స్లిప్ వివరాలు (AISSEE 2026 City Intimation Slip Details) :ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AISSEE 2026) కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు విడుదల చేసింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ద్వారా పరీక్షకు కేటాయించిన నగరాన్ని చెక్ చేసుకోగలరు. 2026–27 విద్యాశంవత్సరంలో 6వ మరియు 9వ తరగతుల ప్రవేశాల కోసం ఈ పరీక్ష జనవరి 18న దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. పరీక్ష పూర్తిగా పెన్-అండ్-పేపర్ OMR విధానంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.
6వ తరగతి పరీక్ష 150 నిమిషాల పాటు, సాయంత్రం 4:30 వరకు జరుగుతుంది. 9వ తరగతి పరీక్ష 180 నిమిషాల పాటు, సాయంత్రం 5:00 వరకు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష కేంద్రాలు కూడా ప్రకటించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం వంటి నగరాలు సెంటర్లుగా ఉన్నట్లు ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాదు, కరీంనగర్ పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు.
AISSEE 2026 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ల లింక్ మీ పరీక్ష నగరాన్ని ఇక్కడ చెక్ చేయండి (AISSEE 2026 City Intimation Slips Check Your Exam City Here)
AISSEE 2026 పరీక్ష సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా చెక్ చేయవచ్చు.
AISSEE 2026 సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఎలా చెక్ చేయాలి? (How to check AISSEE 2026 City Intimation Slip?)
AISSEE 2026 అభ్యర్థులు తమ పరీక్ష నగర వివరాలు తెలుసుకోవడానికి ఈ క్రింది దశలను పాటించండి.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ aissee.ntaonline.in ఓపెన్ చేయండి
- హోమ్‌పేజ్‌లో ఉన్న "City Intimation Slip 2026" లింక్‌పై క్లిక్ చేయండి
- మీ Application Number, Password, Security Pin నమోదు చేయండి
- లాగిన్ అయిన తర్వాత పరీక్ష నగర వివరాలు స్క్రీన్‌లో కనిపిస్తాయి
- అవసరమైతే సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి
AISSEE 2026 పరీక్ష విధానం వివరాలు (AISSEE 2026 Exam Pattern Details)
AISSEE 2026 6వ & 9వ తరగతుల సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో సబ్జెక్టుల వారీగా ప్రశ్నల సంఖ్య మరియు మార్కులు ఈ క్రింది టేబుల్‌లో ఇవ్వబడ్డాయి.
తరగతి | విషయాలు | ప్రశ్నలు | మార్కులు |
6వ తరగతి | లాంగ్వేజ్ | 25 | 50 |
మ్యాథమెటిక్స్ | 50 | 150 | |
ఇంటెలిజెన్స్ | 25 | 50 | |
జనరల్ నాలెడ్జ్ | 25 | 50 | |
మొత్తం | —- | 125 | 300 |
9వ తరగతి | మ్యాథమెటిక్స్ | 50 | 200 |
ఇంటెలిజెన్స్ | 25 | 50 | |
ఇంగ్లీష్ | 25 | 50 | |
జనరల్ సైన్స్ | 25 | 50 | |
సోషల్ సైన్స్ | 25 | 50 | |
మొత్తం | —- | 150 | 400 |
AISSEE 2026 కోసం సిటీ స్లిప్‌లు విడుదల కావడంతో పరీక్ష కేంద్రాల గురించి విద్యార్థులకు స్పష్టత లభించింది. ఇప్పుడు జనవరి 18న జరిగే పరీక్షకు సిద్ధమవ్వడం మాత్రమే మిగిలి ఉంది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.