మరో AP DSC 2026 నోటిఫికేషన్, ఎన్ని పోస్టులకు? ఎప్పుడు వస్తుంది?
మరో AP DSC 2026 నోటిఫికేషన్ త్వరలో రానుంది. దీనికి సంబంధించి కసరత్తు జరుగుతున్నట్టుగా సమాచారం. మొత్తం 10 వేల పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
AP DSC నోటిఫికేషన్ 2026 (AP DSC Notification 2026) :మరో AP DSC 2026 నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు త్వరలో ఏపీ ప్రభుత్వం టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ మేరకు 10,000 పోస్టులతో AP DSC Notification 2026 ఫిబ్రవరి రెండో వారంలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఏపీలో ఇటీవల మెగా DSC నోటిఫికేషన్ (AP DSC Notification 2026) రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఈ నియామకాలు పూర్తయ్యాయి. కానీ ఇందులో కొన్ని పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా మిగిలిపోయాయి. దీంతో పాటు రాష్ట్రంలో ఈ ఏడాది వేలాది సంఖ్యలో ఉపాధ్యాయులు రిటైర్ కానున్నారు. ఈ ఖాళీలకు మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ వెలువడనుంది.
అయితే మొత్తం అన్ని పోస్టులకు కలిపి నోటిఫికేషన్ (AP DSC 2026 Notification Expected Date) ఇస్తారా? లేదంటే కొన్ని పోస్టులకే ప్రకటన ఇస్తారా? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే ఈసారి డీఎస్సీలో కొత్తగా ఇంగ్లీష్, కంప్యూటర్ టెక్నాలజీప కూడా ఎగ్జామ్స్ నిర్వహించే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటికే AP TET ఆన్సర్ కీ రిలీజ్ అయింది. ఆన్సర్ కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత జనవరి 13న ఫైనల్ కీ విడుదలవుతుంది. AP TET రిజల్ట్స్ జనవరి 19, 2026వ తేదీన విడుదలవ్వనున్నాయి. ఏపీ టెట్‌కు హాజరైన అభ్యర్థులు తమ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షట్లను tet2dsc.apcfss.in లేదా aptet.apcfss.in వెబ్‌సైట్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP TET అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ నిర్వహించే రాష్ట్ర స్థాయి ఎగ్జామ్. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి 8 తరగతులకు ఉపాధ్యాయులు కావాలనుకునే అభ్యర్థుల అర్హతను అంచనా వేయడానికి ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది.
ఏపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముందుకు కదులుతుంది. ఇందులో భాగంగా ముందు ముందు జరగబోయే కొత్త డీఎస్సీ పరీక్షలో కూడా కీలక మార్పులు తీసుకువచ్చే యోచనలో ఉంది. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో టీచింగ్ క్వాలిటీని పెంచి, ఎప్పటికప్పుడు ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం యోచిస్తుంది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.