AP EAMCET 2025 BC A కేటగిరీకి టాప్ ఇంజినీరింగ్ కాలేజీల అంచనా కటాఫ్ ర్యాంకులు
AP EAMCET 2025 లో BC-A కేటగిరీకి చెందిన అభ్యర్థులు టాప్ ఇంజినీరింగ్ కాలేజీలు గురించి పూర్తి సమాచారం ఇక్కడ అందించాము.మంచి ర్యాంక్ ఉన్నవారు వీటిని వెబ్ ఆప్షన్‌లలో టాప్ (AP EAMCET 2025 BC A Category Estimated Cut-off Ranks of Top Engineering Colleges)ప్రాధాన్యంగా పెట్టుకోవాలి.
AP EAMCET 2025 BC A కేటగిరీకి టాప్ ఇంజినీరింగ్ కాలేజీల అంచనా కట్-ఆఫ్ ర్యాంకులు(AP EAMCET 2025 BC A Category Estimated Cut-off Ranks of Top Engineering Colleges): AP EAMCET 2025లో BC-A కేటగిరీకి ఉన్న రిజర్వేషన్ కారణంగా మంచి ర్యాంక్ ఉన్న విద్యార్థులకు రాష్ట్రంలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా CSE, ECE, AIML వంటి హై డిమాండ్ కోర్సులకు వేల కొద్ది మంది అభ్యర్థులు పోటీ పడతారు.ఈ కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, విద్యార్థులు తమ ర్యాంక్‌ను బట్టి తగిన స్థాయి కాలేజీ ఎంచుకోవాలి. ANITS, విజ్ఞాన్ లారా, PVPSIT, SRKR, లకిరెడ్డి బాలి రెడ్డి, GMRIT, స్వర్ణాంధ్ర వంటి మంచి ప్రైవేట్ కాలేజీల్లో 10,000–16,000 ర్యాంక్‌తో అడ్మిషన్ అవకాశాలు ఉన్నాయి.
ఈ కాలేజీల్లో CSE, ECE, IT, AIML కోర్సులు ఎక్కువగా సెలెక్ట్ చేయబడతాయి. CSE & AIML కోర్సులకు అత్యధిక డిమాండ్ ఉంది, ముఖ్యంగా జాబ్ అవకాశాలు ఎక్కువగా ఉండే టెక్ రంగాల్లోకి వెళ్లాలనుకునే విద్యార్థులు వీటిని ఎంపిక చేస్తున్నారు. వెబ్ కౌన్సెలింగ్ సమయంలో, విద్యార్థులు తమ ర్యాంక్‌కు తగినట్లు ఈ టాప్ 20 కాలేజీలను ప్రాధాన్యత ఇవ్వాలి. ముందుగా JNTU & AU లాంటి గవర్నమెంట్ కాలేజీలను, ఆపై GVP, VR Siddhartha, RVRJC వంటి ప్రముఖ ప్రైవేట్ కాలేజీలను వెబ్ ఆప్షన్లలో టాప్‌గా పెట్టాలి. తదుపరి స్థాయిలో VVIT, ANITS, SRKR, GMRIT వంటి కాలేజీలు పెట్టుకోవచ్చు. సరైన వెబ్ ఆప్షన్ ఎంపిక ద్వారా, మీకు అనుకూలమైన బ్రాంచ్‌లో టాప్ కాలేజీలో అడ్మిషన్ పొందే అవకాశం పెరుగుతుంది.
AP EAMCET 2025 BC A కేటగిరీకి టాప్ ఇంజినీరింగ్ కాలేజీల అంచనా కట్-ఆఫ్ ర్యాంకులు(AP EAMCET 2025 BC A Category Estimated Cut-off Ranks of Top Engineering Colleges)
AP EAMCET 2025 కోసం BC-A కేటగిరీకి టాప్ 20 ఇంజినీరింగ్ కాలేజీల వివరాలు ఈ క్రింద టేబుల్ పట్టికలో అందించాము.
కాలేజీ కోడ్ | కాలేజీ పేరు | లొకేషన్ | బ్రాంచ్ పేరు | BC-A అంచనా కటాఫ్ ర్యాంక్ |
JNTK | JNTU కాకినాడ | కాకినాడ | CSE,ECE | 1 నుండి 2,000 వరకు |
AUCE | ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ | విశాఖపట్నం | CSE,ECE | 1 నుండి 3,000 వరకు |
JNTA | JNTU అనంతపూర్ | అనంతపురం | CSE,ECE | 2,000 నుండి 4,500 వరకు |
SVUC | శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజీ | తిరుపతి | CSE,ECE | 3,000 నుండి 5,500 వరకు |
AUFW | AU బాలికల ఇంజనీరింగ్ కాలేజీ | విశాఖపట్నం | CSE,ECE | 4,000 నుండి 6,000 వరకు |
GVPE | గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజీ | విశాఖపట్నం | CSE,ECE, IT | 5,000 నుండి 8,000 వరకు |
VRSE | VR సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ | విజయవాడ | CSE,ECE,AIML | 5,000 నుండి 8,500 వరకు |
RVRJ | RVR & JC ఇంజనీరింగ్ కాలేజీ | గుంటూరు | CSE,ECE | 6,000 నుండి 9,000 వరకు |
VVIT | వాసిరెడ్డి వేంకటాద్రి ఇంజనీరింగ్ కాలేజీ | నంబూరు, గుంటూరు | CSE,ECE,IT | 6,000 నుండి 9,500 |
ANIT | అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (ANITS) | విశాఖపట్నం | CSE,ECE | 7,000 నుండి 11,000 వరకు |
VLRG | విజ్ఞాన్స్ లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ | గుంటూరు | CSE,ECE | 8,000 నుండి 11,500 వరకు |
SRKR | S.R.K.R. ఇంజనీరింగ్ కాలేజీ | భీమవరం | CSE,IT | 8,500 నుండి 12,000 వరకు |
PVPS | ప్రసాద్ వి. పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (PVPSIT) | విజయవాడ | CSE,ECE | 9,000 నుండి 13,000 వరకు |
LBRC | లకిరెడ్డి బాలి రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ | మైలవరం | CSE,ECE | 9,500 నుండి 13,500 వరకు |
VIGN | విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ IT | విశాఖపట్నం | CSE,ECE | 10,000 నుండి 14,000 వరకు |
GMRR | GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | రాజాం | CSE,ECE | 10,500 నుండి 14,500 వరకు |
PRAG | ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ | సూరంపాలెం | CSE, IT | 11,000 నుండి 15,000 వరకు |
BVCE | BVC ఇంజనీరింగ్ కాలేజ్ | అమలాపురం | CSE | 11,500 నుండి 15,500 వరకు |
BVCH | బోనం వెంకట చలమయ్య ఇంజినీరింగ్ కళాశాల | ఓడలరేవు | CSE,ECE | 12,000 నుండి 16,000 వరకు |
SWRN | స్వర్ణాంధ్ర కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ | నర్సాపూర్ | CSE,ECE | 12,500 నుండి 16,500 వరకు |
ఈ కటాఫ్‌లు 2024 డేటా ఆధారంగా తయారు చేయబడిన అంచనాలు మాత్రమే. 2025 ఫైనల్ కటాఫ్‌లు కౌన్సెలింగ్ సమయంలో అధికారికంగా వెల్లడి అవుతాయి.BC-A కేటగిరీకి 2025లో 2,000 నుండి 16,000 లోపు ర్యాంక్ ఉన్న విద్యార్థులకు వివిధ టాప్ ప్రైవేట్ ,ప్రభుత్వ కాలేజీలలో సీట్లు దొరికే అవకాశం ఉంది. వెబ్ కౌన్సెలింగ్ సమయంలో మీరు ఎంచుకునే బ్రాంచ్ ఎంత డిమాండ్‌లో ఉందో, ఆ కాలేజీకి మార్కెట్‌లో ఎంత పేరుందో, గతంలో అక్కడ ప్లేస్‌మెంట్లు ఎలా జరిగాయో బట్టి మీ ఎంపికలను రూపొందించాలి.
ముఖ్యమైన లింకులు..
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.