ఈ తేదీన AP EAMCET అగ్రికల్చర్ రెస్పాన్స్ షీట్ 2025 విడుదలయ్యే ఛాన్స్
AP EAMCET 2025 అగ్రికల్చర్ రెస్పాన్స్ షీట్ మే 27, 2025 విడుదల కానుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా తనిఖీ చేస్తూ ఉండాలి.పూర్తి సమాచారం ఈ క్రింద చూడండి.
AP EAMCET 2025 రెస్పాన్స్ షీట్ విడుదల తేదీ(AP EAMCET 2025 Response Sheet Release Date): AP EAMCET 2025(ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయం ,ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) 2025 పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) ఆనంతపురం APSCHE ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. వ్యవసాయ విభాగానికి చెందిన పరీక్షలు మే 19 మరియు 20, 2025 తేదీల్లో జరుగుతున్నాయి. ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల కోసం రెస్పాన్స్ షీట్ అనేది ఒక కీలక పత్రం.రెస్పాన్స్ షీట్ అనేది అభ్యర్థి పరీక్ష సమయంలో ఇచ్చిన సమాధానాలను రికార్డ్ చేసే డిజిటల్ పత్రం. ఇది పరీక్ష అనంతరం జారీ చేస్తారు. అభ్యర్థులు దీనిలో తమ అభ్యంతరాలను పరిశీలించి, అధికారిక "Answer Key"తో పోల్చుకుని తాము పొందే అంచనా మార్కులు తెలుసుకోవచ్చు.2025 సంవత్సరానికి సంబంధించిన AP EAMCET వ్యవసాయ విభాగం రెస్పాన్స్ షీట్ను మే 27, 2025న విడుదల చేయనున్నారు. ఇది అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.inలో అందుబాటులో ఉంటుంది.
AP EAMCET 2025 ముఖ్య తేదీలు(AP EAMCET 2025 Important Dates)
AP EAMCET 2025 ముఖ్యమైన తేదీలు, వివరాలు గురించి క్రింద ఈ పట్టికలో చూడండి
వివరాలు | తేదీలు |
AP EAMCET 2025 పరీక్ష తేదీలు | వ్యవసాయ & ఫార్మసీ: మే 19-20, 2025 ఇంజినీరింగ్: మే 21-27, 2025 |
AP EAMCET 2025 రెస్పాన్స్ షీట్ విడుదల | మే 27, 2025 |
AP EAMCET 2025 ప్రారంభ సమాధాన కీ విడుదల | మే 27, 2025 |
AP EAMCET 2025 ప్రారంభ సమాధాన కీపై అభ్యంతరాలు | మే 2025 నాలుగో వారం |
AP EAMCET 2025 ఫలితాల విడుదల | జూన్ 2025 రెండో వారం |
AP EAMCET 2025 ర్యాంక్ కార్డ్ విడుదల | జూన్ 2025 రెండో వారం |
సీటు కేటాయింపు ప్రారంభం | జూలై 2025 |
AP EAMCET రెస్పాన్స్ షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?(How to download the AP EAMCET response sheet?)
- ముందుగా అభ్యర్థులు ఆధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in కు సందర్శించండి .
- AP EAMCET వ్యవసాయ రెస్పాన్స్ షీట్ లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి.
- డాష్‌బోర్డ్‌లో మీ రెస్పాన్స్ షీట్ కనిపిస్తుంది.
- దాన్ని PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
-
భవిష్యత్తులో ఉపయోగపడేలా ఫలితాన్ని సేవ్ చేసుకోండి
అభ్యర్థులు తమ సమాధానాలు సరిగా ఉన్నాయా లేదా అని అంచనా వేసుకోవాలి.అధికారిక Answer Keyతో పోల్చి తాము పొందే మార్కులను ముందుగా అంచనా వేయవచ్చు.అభ్యంతరాల సమర్పణకు ఇది ఆధారంగా ఉపయోగపడుతుంది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.