AP POLYCET 2025 స్టడీమెటీరియల్ ఇంగ్లీష్ మీడియం PDFని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి
AP POLYCET 2025 స్టడీమెటీరియల్ pdf ఇంగ్లీష్ మీడియం కోసం అభ్యర్థులు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి.ఇంకా పూర్తి సమాచారం మొత్తము ఈ క్రింద ఇవ్వబడింది.
ఏపీ పాలిసెట్ 2025 ఇంగ్లీష్ స్టడీ మెటిరీయల్ (AP POLYCET 2025 English Study Material) :
AP POLYCET 2025 పరీక్ష ఏప్రిల్ 30, 2025 తేదీన జరగనుంది. ఇప్పటికే ఏపీ పాలిసెట్ 2025 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ పాలిసెట్ 2025 పరీక్షకు నమోదు చేసుకున్న అభ్యర్థులు AP POLYCET అధికారిక వెబ్‌సైట్ polycetap.nic.in నుంచి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీ పాలిసెట్‌కు హాజరుకాబోతున్న విద్యార్థుల కోసం ఇక్కడ స్టడీ మెటిరీయల్‌ని అందించాం. ఈ స్టడీ మెటిరీయల్ ద్వారా అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ని మరింత సులభం చేసుకోవచ్చు.
ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ రంగాలలో డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోసం ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP POLYCET) 2025ను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ (SBTET AP) నిర్వహిస్తుంది. పదో తరగతి విద్యార్థులు ఏపీ పాలిసెట్ 2025 రాయవచ్చు.
AP POLYCET 2025 ఇంగ్లీష్ మీడియం స్టడీ మెటిరీయల్ PDF డౌన్‌లోడ్ లింక్ (AP POLYCET 2025 English Medium Study Material PDF D ownload link)
AP POLYCET 2025 మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టుల ఇంగ్లీష్ మీడియం స్టడీ మెటీరియల్ PDF డౌన్‌లోడ్ లింక్స్‌ని ఇక్కడ అందించాం. ఈ దిగువున ఇచ్చిన లింక్‌లపై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP POLYCET 2025 ముఖ్యమైన తేదీలు(AP POLYCET 2025 Important Dates)
AP POLYCET 2025 అభ్యర్థులు సంబంధించిన ముఖ్యమైన తేదీలను తెలుసుకోవాలి, వాటిలో పరీక్ష తేదీ, ఫలితాల వివరాలు మొత్తము ఈ క్రింద టేబుల్ లో ఇవ్వబడింది.
ఈవెంట్స్ | తేదీలు |
AP POLYCET 2025 ప్రవేశ పరీక్ష | ఏప్రిల్ 30, 2025 |
ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల | మే 1, 2025 |
తుది జవాబు కీ విడుదల | మే 5, 2025 |
ఫలితాల ప్రకటన | మే 8, 2025 |
AP POLYCET 2025 సిలబస్ (AP POLYCET 2025 Syllabus)
AP POLYCET 2025 సిలబస్‌లో 10వ తరగతి పాఠ్యాంశాల ప్రకారం గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం నుండి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అభ్యర్థులు పరీక్షలో బాగా రాణించడానికి ఈ విషయాలను పూర్తిగా స్టడీ చేసుకోవాలి.ఈ సిలబస్ విద్యార్థులు అత్యంత సంబంధిత అంశాలపై దృష్టి పెట్టడంలో మార్గనిర్దేశం చేస్తుంది.
AP POLYCET పరీక్షా సరళి 2025 (AP POLYCET Exam Pattern 2025)
AP POLYCET 2025 పరీక్షా సరళి గురించి పూర్తి వివరాలను అందిస్తుంది, ప్రశ్నల సంఖ్య, మార్కింగ్ వివరణ ,వ్యవధితో సహా. పరీక్షా సరళిని గ్రహించే పట్టిక క్రింద ఉంది
ప్రత్యేకతలు | వివరాలు |
పరీక్షా విధానం | ఆఫ్‌లైన్ (పెన్ & కాగితం ఆధారితం) |
వ్యవధి | 2 గంటలు (120 నిమిషాలు) |
మొత్తం ప్రశ్నలు | 120 |
ప్రశ్నరకం | బహుళైచ్ఛిక ప్రశ్నలు (MCQలు) |
కవర్ చేసిన సబ్జెక్ట్‌లు | గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం |
మార్కింగ్ వివరణ | ప్రతి సరైన సమాధానానికి +1, నెగిటివ్ మార్కులు లేవు |
మీడియం | ఇంగ్లీష్ & తెలుగు |
AP POLYCET ఫలితం 2025 (AP POLYCET Result 2025)
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ (SBTET AP), AP POLYCET 2025 ఫలితాన్ని మే 2025లో అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది.
అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా తమ ఫలితాలను తనిఖీ చేయవచ్చు. ఫలితంలో సబ్జెక్టుల వారీగా స్కోర్‌లు, మొత్తం మార్కులు ,ర్యాంక్ ఉంటాయి. ఫలితం ఆధారంగా తదుపరి ప్రవేశ ప్రక్రియలు అనుసరించబడతాయి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.