AP SSC 2026 కొత్త మోడల్ పేపర్లు ఇవే, ఈ కొత్త ఫార్మాట్‌తో పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి
AP SSC 2026 మోడల్ పేపర్లు విడుదల. మోడల్ ప్రశ్నపత్రాలుని ఇక్కడ మేము క్రింద లింకులుతో సహా ఇచ్చాము విద్యార్థులు నేరుగా ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సిద్ధత కోసం విద్యార్థులు ఇవి ఉపయోగించుకోవచ్చు.
AP SSC 2026 మోడల్ ప్రశ్నపత్రాలు విడుదల (AP SSC 2026 Model Question Papers Released) : ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 2026 సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి (SSC) మోడల్ ప్రశ్నపత్రాలను అధికారికంగా విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులకు అసలు పరీక్షకు ముందుగా సరైన దిశలో సిద్ధమయ్యేందుకు ఎంతో ఉపయోగపడతాయి. వాటిలోని ప్రశ్నల నమూనాలు, మార్కుల పంపిణీ, సమయ నిర్వహణ పద్ధతులు విద్యార్థులు పరీక్షకు ముందు ఎలా ఉండబోతుందో తేలికగా ఊహించుకునేలా సహాయపడతాయి. ముఖ్యంగా ఈసారి మోడల్ పేపర్ల రూపకల్పనలో కొన్ని మార్పులు చేసారు బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు, విశ్లేషణాత్మక ప్రశ్నలు, చిన్న చిన్న అభిప్రాయప్రధాన ప్రశ్నలు అనుసంధానం కావడంతో విద్యార్థుల ఆలోచనాత్మకతను పరీక్షించే విధంగా పేపర్లు తయారయ్యాయి. తెలుగు, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ వంటి అన్ని ప్రధాన సబ్జెక్టులకు ఈ మోడల్ పేపర్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఇవి www.bse.ap.gov.in అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.పూర్తిస్థాయి PDF రూపంలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. మంచి స్కోరు సాధించాలనుకునే ప్రతి విద్యార్థికి ఈ మోడల్ పేపర్లు ఒక కీలక సాధనంగా మారుతాయి. ఇవి విద్యార్థుల్లో పట్టుదల పెంచి, పరీక్షలపై భయం తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో కూడా సహాయపడతాయి.
AP SSC 2026 మోడల్ ప్రశ్నపత్రాల లింకులు(AP SSC 2026 Model Question Papers Links)
AP SSC 2026 పదవ తరగతి విద్యార్థుల కోసం అన్ని ముఖ్య సబ్జెక్టుల మోడల్ పేపర్లు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయవచ్చు. క్రింది పట్టికలో ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన లింకులు ఇవ్వబడ్డాయి.
సబ్జెక్టు పేరు | మోడల్ పేపర్ లింక్ (E.M) | మోడల్ పేపర్ లింక్ (T.M) |
తెలుగు | ||
గణితం | ||
భౌతిక శాస్త్రం | ||
జీవ శాస్త్రం | ||
సాంఘిక శాస్త్రం | ||
సెకండ్ లాంగ్వేజ్ తెలుగు | ||
సెకండ్ లాంగ్వేజ్ హిందీ | ||
సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లిష్ |
AP SSC 2026 మోడల్ ప్రశ్నపత్రాల విడుదలతో విద్యార్థులకు పరీక్షలకు సరైన ప్రణాళికతో సిద్ధమయ్యే అవకాశం లభించింది. ఈ పేపర్లు విద్యార్థుల చదువులో స్పష్టతను తీసుకురావడంతో పాటు, అసలు పరీక్ష పట్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఇప్పుడు నుంచే ఈ మోడల్ పేపర్లను పాఠ్యాంశాలనుసారంగా అభ్యాసం చేస్తూ, సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలను సాధించవచ్చు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.