BEML రిక్రూట్‌మెంట్ 2025 440+ ఆపరేటర్ పోస్టులు, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
BEML రిక్రూట్‌మెంట్ 2025లో 440కి పైగా ఆపరేటర్ పోస్టులు విడుదలయ్యాయి. అర్హులైన అభ్యర్థులు ముందుగా నిర్ణయించిన తేదీకి ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
BEML రిక్రూట్‌మెంట్ 2025 ఆపరేటర్ పోస్టులకు అర్హత, జీతం, ఖాళీలు, దరఖాస్తు వివరాలు ఇవే (BEML Recruitment 2025 Operator Posts Eligibility, Salary, Vacancies, Application Details): BEML రిక్రూట్‌మెంట్ 2025లో భాగంగా 440కి పైగా ఆపరేటర్ (Non-Executive ITI) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకంలో ఫిట్టర్, టర్నర్, వెల్డర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్ వంటి విభిన్న ట్రేడ్స్‌లో ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లో ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయో పరిమితి సాధారణ అభ్యర్థులకు 29 సంవత్సరాలు కాగా, SC/ST, OBC అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.23,000 నుండి రూ.27,000 వరకు జీతం ఇవ్వబడుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తు సెప్టెంబర్ 1, 2025 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 5, 2025 వరకు కొనసాగుతుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా bemlindia.in వెబ్‌సైట్‌లోని Careers సెక్షన్ ద్వారా అప్లై చేయవచ్చు. ఎంపికలో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ,మెడికల్ పరీక్షలు ఉంటాయి.
BEML రిక్రూట్‌మెంట్ 2025 ఆపరేటర్ ఖాళీలు (BEML Recruitment 2025 Operator Vacancies)
ఈ రిక్రూట్‌మెంట్‌లో వివిధ ట్రేడ్స్‌కి మొత్తంగా 440 ఖాళీలు ఉన్నాయి. ప్రతి ట్రేడ్‌కు ప్రత్యేకంగా ఖాళీల వివరాలు ఈ కింద ఇవ్వబడింది.
ట్రేడ్ పేరు | ఖాళీల సంఖ్య |
ఫిట్టర్ | 189 |
టర్నర్ | 95 |
వెల్డర్ | 91 |
మెషినిస్ట్ | 52 |
ఎలక్ట్రీషియన్ | 13 |
మొత్తం | 440 |
BEML రిక్రూట్‌మెంట్ 2025 ఎలా దరఖాస్తు చేయాలి (How to Apply for BEML Recruitment 2025)
BEML రిక్రూట్‌మెంట్ అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.ఈ క్రింద ఇచ్చినా విధముగా దరఖాస్తు చేసుకోండి.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ bemlindia.in కి వెళ్లి ఆ తరువాత Careers సెక్షన్ లోకి వెళ్ళాలి.
- దరఖాస్తు ఫారం పూర్తి వివరాలతో భర్తీ చేయాలి
- ఫీజు చెల్లింపు జనరల్/OBC/EWS రూ.500, SC/ST/PwBD మినహాయింపు
- ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన తర్వాత ఓ ధృవీకరణ పత్రం ఇవ్వబడుతుంది
BEML రిక్రూట్‌మెంట్ 2025 అవసరమైన డాక్యుమెంట్స్ (BEML Recruitment 2025 Required Documents)
BEML రిక్రూట్‌మెంట్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి.
- ITI ట్రేడ్ సర్టిఫికేట్
- ఆధార్ కార్డు
- వయో సర్టిఫికేట్
- ఆధార్ కార్డు లేదా ID ప్రూఫ్
- జాతి/వర్గం సర్టిఫికేట్ (అవసరమైతే)
- తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
- విద్య సర్టిఫికేట్లు
BEML రిక్రూట్‌మెంట్ 2025 ద్వారా 440కి పైగా ఆపరేటర్ పోస్టుల భర్తీకి అద్భుతమైన అవకాశం లభించింది. అర్హతలున్న, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సరైన డాక్యుమెంట్స్ తో , నిర్ణీత తేదీలలో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగంలో చేరవచ్చు. ఇది ITI ట్రేడ్స్‌లో కెరీర్ మొదలుపెట్టడానికి గొప్ప అవకాశంగా ఉంది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.