DRDO–SSPL పేయిడ్ ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్ 2026, 52 ఖాళీలకు దరఖాస్తులు
DRDO ఆధ్వర్యంలోని సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ (SSPL), ఢిల్లీ 6 నెలల పేయిడ్ ఇంటర్న్‌షిప్‌కు 52 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు జనవరి 14, 2026 లోపు ఈ క్రింద ఇచ్చిన గూగుల్-లింక్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
DRDO –SSPL పేయిడ్ ఇంటర్న్‌షిప్ 2026 వివరాలు (DRDO –SSPL Paid Internship 2026 Details): దేశ రక్షణ పరిశోధనల్లో కీలక పాత్ర పోషిస్తున్న DRDO-SSPL (సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ), ఢిల్లీలో 6 నెలల కాలానికి పేయిడ్ ఇంటర్న్‌షిప్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 52 ఇంటర్న్‌షిప్ ఖాళీలను భర్తీ చేస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెటీరియల్ సైన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, లేజర్ ఆప్టిక్స్, సెమీకండక్టర్ డివైజ్, ఐటీ, SESE వంటి విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌లు లభ్యమవుతాయి. ఎంపికైన అభ్యర్థులు DRDOలో జరిగే పరిశోధన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని విలువైన అనుభవం పొందగలుగుతారు. ఇవి పూర్తిగా పేయిడ్ ఇంటర్న్‌షిప్‌లు మరియు ఎంపికైన వారికి నెలకు రూ.5,000 స్టైపెండ్ అందజేస్తారు.
ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులను వారి విద్యార్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, అవసరమైతే ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా గూగుల్ ఫామ్ లింక్ ద్వారా జరుగుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. దరఖాస్తు చివరి తేదీ జనవరి 14,2026 అని నిర్ణయించారు. ఈ తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించారు.పరిశోధన రంగంలో కెరీర్ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు ఇది మంచి అవకాశంగా భావించవచ్చు.
DRDO–SSPL ఇంటర్న్‌షిప్ దరఖాస్తు లింక్ (DRDO–SSPL Internship Application Link)
DRDO సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీలో పేయిడ్ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా గూగుల్ ఫామ్‌లో తమ వివరాలు నమోదు చేయాలి.
DRDO–SSPL ఇంటర్న్‌షిప్‌కు ఎలా దరఖాస్తు చేయాలి? (How to apply for DRDO–SSPL internship?)
DRDO–SSPL పేయిడ్ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు మొత్తం ఆన్‌లైన్‌లోనే ఈ క్రింది దశల ద్వారా జరుగుతుంది.
- మొదట DRDO–SSPL అధికారిక గూగుల్ ఫామ్ దరఖాస్తు లింక్ ఓపెన్ చేయాలి
- దరఖాస్తు ఫారమ్‌లో పేరు, ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలు నమోదు చేయాలి
- విద్యార్హతలకు సంబంధించిన వివరాలు సరిగ్గా నమోదు చేయాలి
- సంబంధిత విభాగం (ఫిజిక్స్/కెమిస్ట్రీ/ఎలక్ట్రానిక్స్ మొదలైనవి) ఎంచుకోవాలి
- అవసరమైన సర్టిఫికెట్లను, మార్క్ లిస్టులను అప్లోడ్ చేయాలి
- అన్ని వివరాలు ఒకసారి చూసుకున్న తర్వాత ఫారమ్ సబ్మిట్ చేయాలి
- ఫారమ్ సబ్మిట్ చేసిన తర్వాత వచ్చిన కన్ఫర్మేషన్‌ను భవిష్యత్ అవసరాల కోసం సేవ్ చేసుకోండి
DRDO–SSPL పేయిడ్ ఇంటర్న్‌షిప్ అర్హతలు (DRDO–SSPL Paid Internship Eligibility)
DRDO–SSPL పేయిడ్ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఈ క్రింది అర్హతల్ని కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు అయితే అర్హత ఉంటుంది లేదా ఎంఎస్సీ/ఎంటెక్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు
- ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెటీరియల్ సైన్స్ తదితర సంబంధిత విభాగాల విద్యార్హత ఉండాలి
- అభ్యర్థులు ప్రస్తుతంలో చదువుతున్నవారై ఉండాలి (పాస్ అయినా అభ్యర్థులకు అవకాశం లేదు)
- DRDO నియమాల ప్రకారం ఇతర అర్హతలు కూడా వర్తిస్తాయి
DRDO–SSPL పేయిడ్ ఇంటర్న్‌షిప్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి అవకాశంగా ఉంది. అర్హత ఉన్నవారు చివరి తేదీకి ముందు దరఖాస్తు చేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.