EMRS మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 7,267 ఖాళీలు, ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 7,267 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగినవారు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 23 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఏకలవ్య ఉద్యోగాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.
EMRS టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల (EMRS Notification released for the recruitment of teaching and non-teaching posts): ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) వివిధ టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టుల కోసం 7,267 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టుల కోసం అర్హతగల అభ్యర్థులు సంబంధిత పీజీ, బీటెక్ /డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, ఇంటర్, టెన్త్ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 19, 2025 నుంచి అక్టోబర్ 23, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్, OBC, EWS అభ్యర్థులకు పోస్టుల ప్రకారం రూ.1,500 నుంచి రూ.2,500 వరకు ఉంటుంది. SC/ST/PWD/మహిళా అభ్యర్థుల కోసం రూ.500 మాత్రమే. ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
EMRS పోస్టుల అధికారిక లింక్ (Official link of EMRS posts)
ఈ క్రింది లింక్ ద్వారా అభ్యర్థులు నేరుగా దరఖాస్తు ఫారం మరియు పూర్తి సమాచారం పొందవచ్చు.
EMRS పోస్టుల కోసం ఎలా దరఖాస్తు చేయాలి (How to apply for EMRS posts)
EMRS పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు ఈ క్రింది విధంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ emrs.nic.in కు వెళ్లండి.
- ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేసి యూజర్ ID, పాస్వర్డ్ పొందండి.
- వ్యక్తిగత ,విద్యా వివరాలను సరిగ్గా ఎంటర్ చేయండి.
- కావాల్సిన పోస్టును ఎంచుకుని అవసరమైన వివరాలు నమోదు చేయండి.
- దరఖాస్తు ఫీజు చెల్లించండి.
- దరఖాస్తు పూర్తి అయిందో లేదో ఒకసారి పరీక్షించుకోండి.
- ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసి భవిష్యత్తుకు సేవ్ చేసుకోండి
EMRS ఖాళీలు, వయసు & జీతం వివరాలు (EMRS Vacancies, Age & Salary Details)
ఈ కింద ఇచ్చిన పట్టికలో అన్ని పోస్టుల ఖాళీలు, వయస్సు మరియు జీతం వివరాలు ఉన్నాయి.
పోస్ట్ పేరు | ఖాళీలు | వయస్సు | జీతం (రూ.) |
ప్రిన్సిపల్ | 225 | 50 | రూ.78,800 నుండి 2,09,200 వరకు |
PGT (టీచర్ ) | 1,460 | 40 | రూ.47,600 నుండి రూ.1,51,100 వరకు |
TGT (టీచర్ ) | 3,962 | 35 | రూ.44,900 నుండి రూ.1,42,400 వరకు |
హాస్టల్ వార్డెన్ (Male ) | 346 | 35 | రూ.29,200 నుండి రూ.92,300 వరకు |
హాస్టల్ వార్డెన్ (Female ) | 289 | 35 | రూ.29,200 నుండి రూ.92,300 వరకు |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (క్లర్క్ ) | 228 | 30 | రూ.19,900 నుండి రూ.63,200 వరకు |
అకౌంటెంట్ | 61 | 30 | రూ.35,400 నుండి రూ.1,12,400 వరకు |
స్టాఫ్ నర్స్ (Female) | 550 | 35 | రూ.29,200 నుండి రూ.92,300 వరకు |
ల్యాబ్ అటెండెంట్ | 146 | 30 | రూ.18,000 నుండి రూ.56,900 వరకు |
మొత్తం ఖాళీలు | 7,267 |
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 7,267 ఖాళీల భర్తీకి ఇది ఆసక్తి ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం. అర్హులైన వారు సమయానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయడం మర్చిపోకండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.