GATE 2026 దరఖాస్తుకు ముందు సిద్ధం చేయాల్సిన పత్రాల జాబితా
GATE 2026 రిజిస్ట్రేషన్ త్వరలో ప్రారంభం కానుంది.అభ్యర్థులు అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి.ఫోటో, సంతకం, ID ప్రూఫ్ వంటి పత్రాలు తప్పనిసరి. పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.
GATE 2026 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, వ్యక్తిగత పూర్తి వివరాలు (GATE 2026 Registration Documents, Personal Complete Details): GATE 2026 పరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ నేడు ప్రారంభమైంది. ఈ సంవత్సరం GATE 2026 పరీక్షను నిర్వహించే సంస్థగా భారతీయ సాంకేతిక విద్యాసంస్థ గౌహతి (IIT Guwahati) వ్యవహరిస్తోంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.in ద్వారా సమర్పించాలి. అర్హులైన అభ్యర్థులకు సెప్టెంబర్ 25, 2025 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం, GATE 2026 పరీక్షలు 2026 ఫిబ్రవరి 7, 8, 14 మరియు 15 తేదీలలో జరుగనున్నాయి. ప్రతీ రోజూ పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయి . ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉదయం సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు మధ్యాహ్నం సెషన్‌గా నిర్వహించబడతాయి.
GATE 2026 రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు అన్ని పత్రాలు మరియు వ్యక్తిగత వివరాలను సరిగా సమర్పించాలి. తెల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటో, ముఖం 60–70% కవరేజ్‌తో ఉండాలి. సంతకం బ్లాక్ లేదా డార్క్ బ్లూ ఇంతో మాత్రమే ఉండాలి. ఫోటో, సంతకం JPG/JPEG, ఇతర సర్టిఫికెట్లు PDF ఫార్మాట్‌లో అప్లోడ్ చేయాలి. ID ప్రకారం వ్యక్తిగత వివరాలు ఇవ్వడం రిజిస్ట్రేషన్ సులభతరం చేస్తుంది.
GATE 2026 రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాలు (Documents required for GATE 2026 registration)
GATE 2026 రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు సిద్ధం చేసుకోవాల్సిన ముఖ్యమైన పత్రాలు ఇవి.
- తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో (JPG/JPEG ఫార్మాట్)
- స్పష్టమైన సంతకం (బ్లాక్ లేదా డార్క్ బ్లూ ఇంతో)
- ఫోటో ID ప్రూఫ్ ,ఆధార్, పాస్‌పోర్ట్, PAN, వోటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్ (PDF)
- SC/ST/OBC-NCL వర్గ ధృవపత్రం (అవసరమైతే)
- PwD సర్టిఫికేట్ లేదా UDID కార్డ్ (అవసరమైతే)
- Dyslexia సర్టిఫికేట్ (అవసరమైతే)
- Annexure పత్రాలు (అవసరమైతే)
GATE పరీక్ష రిజిస్ట్రేషన్‌కి అవసరమైన వ్యక్తిగత వివరాలు (Personal details required for GATE exam registration)
GATE రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు అందించాల్సిన వ్యక్తిగత వివరాలు ఇవి.
- పూర్తి పేరు (ఆధార్ లేదా ID ప్రూఫ్‌లో ఉన్నట్లుగా)
- పుటిన తేది (Date of Birth)
- లింగం (Gender)
- జాతీయత (Nationality)
- తండ్రి/తల్లి పేరు
- ఆధార్ నంబర్ లేదా ఇతర ID ప్రూఫ్ వివరాలు
- విద్యార్హతల వివరాలు (Degree, Year of Passing)
- కమ్యూనికేషన్ చిరునామా (Permanent & Present Address)
- ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్
GATE 2026 రిజిస్ట్రేషన్ సరిగా, సమయానికి పూర్తి చేయడం అత్యంత ముఖ్యం. అభ్యర్థులు అన్ని వ్యక్తిగత వివరాలు, ఫోటో, సంతకం మరియు ఇతర అవసరమైన పత్రాలను నిర్ణీత ఫార్మాట్‌లో అప్లోడ్ చేయడం తప్పనిసరి. వివరాలు పాటించకపోతే అప్లికేషన్ తిరస్కరించబడే అవకాశం ఉంటుంది మరియు ఫీజు తిరిగి ఇవ్వబడదు. అందువల్ల, అన్ని నియమాలు జాగ్రత్తగా పరిశీలించి, జాగ్రతగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం ద్వారా అభ్యర్థులు పరీక్షలో పాల్గొనే అవకాశం పొందగలరు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.