ఏపీ గురుకులం 5వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు 2025 ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీ గురుకులం 5వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు 2025 రిలీజ్ అయ్యాయి. విజయవంతంగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఇక్కడ చెప్పిన విధంగా (Gurukulam Hall Ticket download Link 2025) హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ గురుకులం హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ 2025 (Gurukulam Hall Ticket download 2025) : ఏపీ గురుకులం 5వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు 2025 విడుదలయ్యాయి. విజయవంతంగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల కోసం హాల్ టికెట్లను (Gurukulam Hall Ticket download 2025) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ అధికారిక వెబ్‌సైట్‌లో https://aprs.apcfss.in యాక్టివేట్ అయింది. ఏపీ గురుకులం 5వ తరగతి (APRS CAT 2025) ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పరీక్ష కేంద్రాలను కేటాయించడం జరిగింది. ఈ ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియంలో జరుగుతుంది. ఈ పరీక్షలో విద్యార్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.
ఏపీ గురుకులం హాల్ టికెట్లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి 2025
అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి డైరక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ కింద చెప్పిన విధంగా అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ aprs.apcfss.inని సందర్శించాలి.
హోంపేజీలో APR Fifth Class Admission Form - 2025-26 అని ఉన్న టేబుల్లో Hall Ticket అని ఉంటుంది.
ఆ Hall Ticket అని ఎదురుగా Click Hereని క్లిక్ చేయాలి.
తర్వాత ఓ బాక్స్ తెరుచుకుంటుంది. అందులో అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
అనంతరం విద్యార్థుల పేరు మీద ఉన్న హాల్ టికెట్ కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
APRS CAT 2025 ముఖ్యమైన తేదీలు (APRS CAT 2025 Important Dates)
APRS CATకు సంబంధించిన 2025 ముఖ్యమైన తేదీలు ఈ దిగువున టేబుల్లో అందించాం.
పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు | తేదీలు |
APRS CAT పరీక్ష తేదీ | ఏప్రిల్ 25, 2025 |
APRS CAT ఫలితాలు విడుదల తేదీ | మే 14, 205 |
మొదటి సెలక్షన్ జాబితా విడుదల తేదీ | మే 14, 2025 |
రెండో సెలక్షన్ జాబితా విడుదల తేదీ | మే 30, 2025 |
మూడో సెలక్షన్ జాబితా విడుదల తేదీ | జూన్ 13, 2025 |
మరిన్ని విద్యా సంబంధిత వార్తల కోస కాలేజ్ దేఖోని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పొందండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.