IBPS PO మెయిన్స్ 2025 అడ్మిట్ కార్డ్ విడుదల
IBPS PO మెయిన్స్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ ఇప్పుడు అందుబాటులో ఉంది. అభ్యర్థులు అక్టోబర్ 10 వరకు హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. PO మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 12, 2025న జరుగుతుంది. పూర్తి సమాచారం ఇక్కడ అందించబడింది.
IBPS PO మెయిన్స్ అడ్మిట్ కార్డ్ (IBPS PO Mains Admit Card): ఇండియా బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) సంస్థ Probationary Officer (PO) భర్తీ ప్రక్రియకు సంబంధించిన IBPS PO మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2025ను రిలీజ్ చేసింది. ఈ అడ్మిట్ కార్డ్ అధికారిక వెబ్‌సైట్ ibps.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్ మరియు పాస్‌వర్డ్ లేదా పుట్టిన పుట్టిన తేదీ నమోదు చేసి హాల్ టికెట్ పొందవచ్చు. డౌన్‌లోడ్ చేసిన తర్వాత ప్రతి అభ్యర్థి తన అడ్మిట్ కార్డ్ పై ఉన్న అన్ని వివరాలు తనిఖీ చేయాలి, ఎటువంటి లోపాలు లేదా స్పెల్లింగ్ తప్పులు ఉండకూడదు. అడ్మిట్ కార్డ్‌లో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, పరీక్ష కేంద్రం, తేదీ, సమయం, వర్గం మరియు ఇతర ముఖ్య సూచనలు ఉంటాయి. ఈ సంవత్సరం PO మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 12, 2025న నిర్వహించబడనుంది. మొత్తం 5208 ఖాళీల భర్తీకి ఈ పరీక్షా నిర్వహిస్తున్నారు .
IBPS PO మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2025ని డౌన్‌లోడ్ చేసే విధానం (How to download IBPS PO Mains Admit Card 2025)
IBPS PO మెయిన్స్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింద ఉన్న దశలను పాటించండి.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ ibps.inకి వెళ్లండి.
- ఆ తరువాత హోమ్‌పేజ్‌లోని “CRP PO/MT” సెక్షన్‌పై క్లిక్ చేయండి.
- “ప్రొబేషనరీ ఆఫీసర్ కోసం సాధారణ నియామక ప్రక్రియ” లింక్‌ను ఎంచుకోండి.
- IBPS PO మెయిన్స్ అడ్మిట్ కార్డ్ లింకు పేజీకి వెళ్లండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్/రొల్ నంబర్ మరియు పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ నమోదు చేయండి.
- అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌లో చూపిన తర్వాత PDFగా డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
- డౌన్‌లోడ్ చేసిన అడ్మిట్ కార్డ్‌పై అన్ని వివరాలు సరైనవో కన్ఫర్మ్ చేయండి. వివరాలలో ఏదైనా తప్పు కనిపిస్తే వెంటనే అధికారిని సంప్రదించండి.
IBPS PO మెయిన్స్ 2025 కోసం అవసరమైన డాక్యుమెంట్లు (Documents required for IBPS PO Mains 2025)
IBPS PO మెయిన్స్ 2025 పరీక్షకు హాజరు కాకాలంటే అభ్యర్థులు ఈ డాక్యుమెంట్లు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి.
- అడ్మిట్ కార్డ్ (పరీక్షలో గుర్తింపు కోసం)
- ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ (Aadhaar, PAN, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ID)
- డౌన్‌లోడ్ చేసిన హాల్ టికెట్ PDF కాపీ
- ఇటీవల తీయించిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో (అడ్మిట్ కార్డులో ఉన్న ఫోటో)
- అవసరమైతే వర్గం సర్టిఫికెట్ (SC/ST/OBC) మీరు ఎలాంటి వర్గానికి చెందుతున్నారో ఆధారంగా
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.