ఇండియన్ ఆర్మీ 67వ SSC (టెక్) కోర్సు 2026 నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ ఆర్మీ 67వ SSC (టెక్) కోర్సు 2026కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన మహిళలు మరియు రక్షణ సిబ్బంది వితంతువులు ఫిబ్రవరి 4, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ ఆర్మీ 2026 67వ SSC (టెక్) కోర్సు రిక్రూట్ మెంట్ వివరాలు (Indian Army 2026 67th SSC (Tech) Course Recruitment Details):ఇండియన్ ఆర్మీ 2026 అక్టోబర్‌లో ప్రారంభించే 67వ షార్ట్ సర్వీస్ కమీషన్ (టెక్) కోర్సుకు మహిళలు మరియు రక్షణ సిబ్బంది వితంతువుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఈ నోటిఫికేషన్‌లో SSC (Tech)-67 మహిళలు – 29 పోస్టులు, SSC(W)(Tech)-67 వితంతువులు – 1 పోస్ట్, SSC(W)(Non-Tech) (Non-UPSC)-127 వితంతువులు – 1 పోస్ట్ ఉన్నాయి. ఈ పోస్టులు సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వంటి ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించినవిగా ప్రకటించబడ్డాయి. ఎంపికైన అభ్యర్థులకు ప్రి-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ (PCTA)లో శిక్షణ అందిస్తారు.
అభ్యర్థులు నిర్దిష్ట ఫిజికల్ స్టాండర్డ్స్ కలిగి ఉండాలి: 2.4 కి.మీ పరుగు 13 నిమిషాల్లో పూర్తి చేయడం, 15 పుష్ -అప్స్, 2 పుల్-అప్స్, 25 సిట్-అప్స్ చేయగలగడం మరియు ఈతలో ప్రాథమిక అవగాహన ఉండాలి. వయోపరిమితి 20 నుంచి 27 సంవత్సరాల వరకు నిర్ణయించారు ( అక్టోబర్ 01,1999 నుంచి సెప్టెంబర్ 30, 2006 మధ్య జన్మించినవారు), వితంతు అభ్యర్థులకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. ఎంపిక దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, గ్రాడ్యుయేషన్ మార్కులు మరియు SSB ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్‌లో స్వీకరించబడతాయి, దరఖాస్తుల ప్రారంభ తేదీ జనవరి 06,2026 మరియు చివరి తేదీ ఫిబ్రవరి 04,2026.
ఇండియన్ ఆర్మీ 2026 ఆధికారిక నోటిఫికేషన్ లింక్ (Indian Army 2026 Official Notification Link)
ఇండియన్ ఆర్మీ 67వ షార్ట్ సర్వీస్ కమీషన్ (టెక్) కోర్సు 2026కి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను ఈ క్రింద తనిఖీ చేయండి.
ఇండియన్ ఆర్మీ 67వ షార్ట్ సర్వీస్ కమీషన్ (టెక్) కోర్సు 2026 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు విధానం (Online Application Procedure for Indian Army 67th Short Service Commission (Tech) Course 2026)
ఇండియన్ ఆర్మీ 67వ షార్ట్ సర్వీస్ కమీషన్ (టెక్) కోర్సు 2026 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఈ క్రింది దశలను పాటించండి.
- ముందుగా అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళాలి
- ఆ తరువాత “Officers Entry Apply / Login” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
- కొత్త అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి
- లాగిన్ అయ్యాక SSC (Tech)-67 ఎంట్రీని ఎంచుకోవాలి
- అవసరమైన వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి
- ఫోటో, సంతకం వంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి
- ఫారమ్ సబ్మిట్ చేసే ముందు అన్ని వివరాలను మరోసారి పరిశీలించాలి
- దరఖాస్తు ఫారమ్ సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి
అర్హతలు, జీతం & ట్రైనింగ్ స్టైపెండ్ పూర్తి వివరాలు (Complete details of qualifications, salary & training stipend)
ఇండియన్ ఆర్మీ 67వ షార్ట్ సర్వీస్ కమీషన్ (టెక్) కోర్సు 2026కి సంబంధించిన అర్హతలు, జీతభత్యాలు మరియు ట్రైనింగ్ సమయంలో ఇచ్చే స్టైపెండ్ వివరాలు ఇవే.
అర్హతలు (Qualifications)
- AICTE / UGC గుర్తింపు పొందిన సంస్థల నుంచి BE / BTech పూర్తి చేయాలి
- అక్టోబర్ 01, 2026కి ముందు డిగ్రీ పూర్తి చేసి ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అర్హులు
- SSC(W) (Non-Tech) పోస్టులకు ఏదైనా డిగ్రీ సరిపోతుంది
జీతం (salary)
- పే లెవల్ 10 ప్రకారం ప్రారంభ జీతం నెలకు రూ.56,100
- హోదా పెరిగే కొద్దీ జీతం రూ.1,77,500 వరకు పెరుగుతుంది
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు వర్తిస్తాయి
ట్రైనింగ్ స్టైపెండ్ (Training stipend)
- ఫ్రీ-కమిషనింగ్ ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ అందించబడుతుంది.
మొత్తంగా, ఇండియన్ ఆర్మీ 67వ SSC (టెక్) కోర్సు 2026 మహిళలు మరియు రక్షణ సిబ్బంది వితంతువులకు మంచి అవకాశాన్ని అందిస్తోంది. ఆసక్తి ఉన్న అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీకి ముందు దరఖాస్తు చేసుకోవాలి
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.