ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2025, 170 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
భారత తటరక్షక దళం 170 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు జూలై 23, 2025 లోపు దరఖాస్తు చేయాలి.పూర్తి సమాచారం ఇక్కడ అందించాము.
ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2025, జూలై 23 వరకు దరఖాస్తు పూర్తి వివరాలు9Indian Coast Guard Recruitment 2025, complete details of application till July 23) : భారత తటరక్షక దళం (Indian Coast Guard) 2025 సంవత్సరానికి గాను అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 170 ఖాళీలు ఉన్న ఈ రిక్రూట్‌మెంట్‌లో జనరల్ డ్యూటీ (GD) ,టెక్నికల్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్, B.E./B.Tech అర్హతలతో యువతకు ఇది కేంద్ర ప్రభుత్వ స్థాయి మంచి ఉద్యోగ అవకాశం. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షలు ఉంటాయి. ఎంపికైనవారికి ₹56,100 ప్రారంభ జీతంతో పాటు అలౌయెన్సులు, భద్రతా ప్రయోజనాలు లభిస్తాయి. దరఖాస్తు ప్రక్రియ జూలై 08,2025 నుంచి ప్రారంభమై, జూలై 23,2025 చివరి తేదీగా నిర్ణయించబడింది.
ఇండియన్ కోస్ట్ గార్డ్ 2025 రిక్రూట్‌మెంట్ ఖాళీల వివరాలు(Indian Coast Guard 2025 Recruitment Vacancies Details)
ఈసారి విడుదలైన ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2025లో మొత్తం 170 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలు జనరల్ డ్యూటీ (GD) ,టెక్నికల్ విభాగాలకు చెందినవిగా ఉన్నాయి. ఖాళీల విభాగాల వారీ వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
విభాగం | పోస్టుల సంఖ్య |
జనరల్ డ్యూటీ (GD) | 140 |
టెక్నికల్ బ్రాంచ్ | 30 |
మొత్తం ఖాళీలు | 170 |
ఇండియన్ కోస్ట్ గార్డ్ 2025 అర్హతలు (Indian Coast Guard 2025 Eligibility Criteria)
- జనరల్ డ్యూటీ (GD), కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ
- జనరల్ డ్యూటీకి 10+2లో ఫిజిక్స్ ,మ్యాథ్స్ తప్పనిసరి
- టెక్నికల్ బ్రాంచ్, సంబంధిత విభాగాల్లో B.E./B.Tech డిగ్రీ
- టెక్నికల్ బ్రాంచ్‌లో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ బ్రాంచులు మాత్రమే అర్హత
ఇండియన్ కోస్ట్ గార్డ్ 2025 ముఖ్యమైన తేదీలు(Indian Coast Guard 2025 Important Dates)
ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 8 జూలై 2025 నుంచి ప్రారంభమై, 23 జూలై 2025 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.ముఖ్యమైన తేదీలు ఇక్కడ క్రింద ఇచ్చిన టేబుల్ పట్టికలో చూడండి.
వివరాలు | తేదీలు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జూలై 08,2025 |
దరఖాస్తు చివరి తేదీ | జూలై 23,2025 (రాత్రి 11:59 వరకు) |
దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ (joinindiancoastguard.cdac.in) |
అప్లికేషన్ ఫీజు | రూ.300 (SC/ST కు మినహాయింపు) |
ఇండియన్ కోస్ట్ గార్డ్ 2025 ఎంపిక విధానం(Indian Coast Guard 2025 Selection Procedure)
ఇండియన్ కోస్ట్ గార్డ్ 2025 ఎంపిక 5 దశలుగా జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- PSB (ప్రిలిమినరీ ఎంపిక బోర్డు)
- తుది ఎంపిక బోర్డు (FSB)
- మెడికల్ పరీక్ష
- ఫైనల్ మెరిట్ ఆధారంగా ఎంపిక
జీతం(salary)
- అసిస్టెంట్ కమాండెంట్ జీతం, రూ.56,100 (Level 10)
- డెప్యూటీ కమాండెంట్ జీతం: రూ.67,700+
- కమాండెంట్ (JG/విన్నర్) జీతం, రూ.78,800 నుండి రూ.1.2 లక్షల వరకు
ముఖ్య గమనికలు(Important Notes)
- అభ్యర్థులు joinindiancoastguard.cdac.in ఈ వెబ్ సైట్ లో దరఖాస్తు చేయాలి.
- ఒకే ఒక్క దరఖాస్తే అనుమతించబడుతుంది
- అప్లికేషన్ ఫీజు ₹300 (SC/STకు మినహాయింపు)
- అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవాలి
- ఏవైనా సందేహాల వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను తరుచు తనిఖీ చేస్తూ ఉండాలి.
భారత తటరక్షక దళంలో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు ఇది మంచి అవకాశంగా నిలుస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీకి ముందు దరఖాస్తు చేసి, ఎంపిక ప్రక్రియకు సిద్ధంగా ఉండాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.