ISRO NRSC టెక్నికల్ ఉద్యోగాలు,నవంబర్ 30లోపు దరఖాస్తు చేయండి
హైదరాబాద్‌లోని ISRO నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) వివిధ సాంకేతిక విభాగాల్లో ఖాళీలను ప్రకటించింది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 30, 2025 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ISRO NRSC టెక్నికల్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల (ISRO NRSC Technical Jobs Notification Released): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)కి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC), హైదరాబాద్‌లో వివిధ సాంకేతిక విభాగాల్లో మొత్తం 13 ఖాళీలు ప్రకటించబడ్డాయి. వీటిలో టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్, ఆటోమొబైల్) మరియు టెక్నీషియన్‑బి (ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, సివిల్) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూత్ నుండే ITI, NTC, NAC, డిప్లొమా లేదా బీటెక్ లో ఉత్తీర్ణులు కావాలి. కనీసం 75% మార్కులు పొందినవారికి ప్రాధాన్యం ఉంటుంది. సంబంధిత రంగంలో పని అనుభవం ఉన్నవారికీ అదనపు ప్రాధాన్యం ఉంది. అభ్యర్థుల వయస్సు నవంబర్ 30,2025 నాటికి 18 నుంచి 35 సంవత్సరాలు మధ్య ఉండాలి.
ఎంపిక రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా జరగుతుంది. ఎంపికైనవారికి పోస్టు ఆధారంగా నెలకు రూ.21,700 నుంచి రూ.1,42,400 వరకు జీతం అందుతుంది. దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 10,2025న ప్రారంభించి , నవంబర్ 30,2025 వరకు కొనసాగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు NRSC అధికారిక వెబ్‌సైట్ https://www.nrsc.gov.in ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి.
ISRO NRSC 2025 ఆన్‌లైన్ దరఖాస్తు విధానం (ISRO NRSC 2025 Online Application Procedure)
ISRO NRSC 2025 దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి.దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఈ క్రింది దశలను పాటించండి.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి https://www.nrsc.gov.in వెళ్లండి
- ఆ తరువాత సంబంధిత పోస్టు నోటిఫికేషన్ ఓపెన్ చేయండి
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ పూరించండి
- అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయండి
- ఫారమ్ సబ్మిట్ చేసి ప్రింట్ కాపీ సేవ్ చేసుకోండి
ISRO NRSC 2025 పోస్టు వారీ వేతన శ్రేణి జీతం వివరాలు (ISRO NRSC 2025 Post-Wise Pay Range Salary Details)
ISRO NRSC 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టుపై ఆధారంగా ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీ ఇవ్వబడుతుంది. జీతం వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి
పోస్టు పేరు | వేతన శ్రేణి (రూ.) |
టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) | రూ.44,900 – రూ.1,42,400 |
టెక్నికల్ అసిస్టెంట్ (ఆటోమొబైల్) | రూ.44,900 – రూ.1,42,400 |
టెక్నీషియన్-‘బి’ (ఎలక్ట్రానిక్ మెకానిక్) | రూ.21,700 – రూ.69,100 |
టెక్నీషియన్-‘బి’ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) | రూ.21,700 – రూ.69,100 |
టెక్నీషియన్-‘బి’ (ఎలక్ట్రికల్) | రూ.21,700 – రూ.69,100 |
టెక్నీషియన్-‘బి’ (సివిల్) | రూ.21,700 – రూ.69,100 |
ISRO NRSCలో టెక్నికల్ ఉద్యోగాలు అంతరిక్ష రంగంలో కెరీర్ ఆరంభించాలనుకునే వారికి నిజంగా ఇది మంచి అవకాశం. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 30, 2025లోపు దరఖాస్తు చేయాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.