JoSAA 2025 రెండవ మాక్ కేటాయింపు ఫలితాల డౌన్‌లోడ్ లింక్
JoSAA 2025 రెండవ మాక్ అలాట్‌మెంట్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు josaa.nic.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.పూర్తి సమాచారం(JoSAA 2025 Second Mock Allotment Results Download Link)ఇక్కడ అందించాము.
JoSAA 2025 రెండవ మాక్ కేటాయింపు ఫలితాల డౌన్‌లోడ్ లింక్(JoSAA 2025 Second Mock Allotment Results Download Link): JoSAA 2025 రెండవ మాక్ సీట్ అలాట్‌మెంట్ ఫలితాలు జూన్ 11, 2025న విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన josaa.nic.in లో లాగిన్ అయి తమ రిజిస్ట్రేషన్ వివరాలు ఉపయోగించి(JoSAA 2025 Second Mock Allotment Results Download Link)ఫలితాలను చూడవచ్చు. ఈ ఫలితాలు తుది సీటు కేటాయింపుకు ముందు అభ్యర్థులకు ఒక అంచనా ఇవ్వడానికే ఉద్దేశించబడ్డాయి. ఎంపికలలో మార్పులు చేసుకునే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. అభ్యర్థులు జూన్ 12, 2025 సాయంత్రం 5 గంటలలోపు తమ ఎంపికలను సవరించి లాక్ చేయాలి.
JoSAA 2025 రెండవ మాక్ కేటాయింపు ఫలితాల డౌన్‌లోడ్ లింక్(ఆప్ డేట్ చేయబడుతుంది) |
JoSAA 2025 రెండవ మాక్ కేటాయింపు ఫలితాలను ఎలా చూసుకోవాలి?(How to check JoSAA 2025 second mock allotment results?)
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ josaa.nic.in కి వెళ్లండి
- ఆ తరువాత హోమ్ పేజీలో “Mock Seat Allocation – Round 2” లింక్ పై క్లిక్ చేయండి
- మీ JEE Main లేదా JEE Advanced రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ,సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
- మీకు కేటాయించిన కాలేజ్, బ్రాంచ్ వివరాలు స్క్రీన్ పై చూపబడతాయి
- వీటిని PDF ఫైల్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు
JoSAA 2025 ముఖ్యమైన తేదీలు(JoSAA 2025 Important Dates)
JoSAA 2025 పరీక్షా విడుదల తేదీ, సమయం, సీట్ కేటాయింపు గురించి పూర్తి వివరాలు ఈ క్రింద (JoSAA 2025 Important Dates)టేబుల్ లో చూడగలరు.
వివరాలు | తేదీలు |
JoSAA 2025 2వ మాక్ ఫలితాలు విడుదల తేదీ | జూన్ 11,2025 |
JoSAA 2025 చాయిస్ ఫిల్లింగ్ చివరి తేదీ | జూన్ 12, 2025 సాయంత్రం 5 గంటలకు |
JoSAA 2025 ఫైనల్ Round 1 కేటాయింపు తేదీ | జూన్ 14, 2025 ఉదయం 10 గంటలకు |
JoSAA 2025 రెండవ మాక్ ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు తమ ఎంపికలపై జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆశించిన కాలేజ్ లేదా కోర్సు లేకపోతే, తమ ఎంపికల క్రమాన్ని సవరించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఎంపికలను లాక్ చేయడానికి చివరి గడువు జూన్ 12 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంది. ఆ సమయంలోలోపు లాక్ చేయకపోతే, చివరిగా సేవ్ చేసిన ఎంపికలే స్వయంగా లాక్ అవుతాయి. అందుకే, అభ్యర్థులు తమ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని, సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇది తుది కేటాయింపుకు ముందు సిద్ధంగా ఉండే అవకాశంగా భావించాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.