KVS Admission 2025 Offline Registration: 2 నుంచి 12 తరగతులకు ఆఫ్‌లైన్‌లో ఇలా అప్లై చేసుకోండి
KVS అడ్మిషన్ 202, 2 నుండి 12 తరగతులకి ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ (KVS Admission 2025 Offline Registration) ప్రారంభమైంది. ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి విధానం ఇక్కడ అందించాం.
KVS అడ్మిషన్ 2025 ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ (KVS Admission 2025 Offline Registration) : కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) 2వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ మధ్య అన్ని తరగతులకు దరఖాస్తులు కోరుతుంది. ఈ మేరకు అర్హతలున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. అడ్మిషన్ల కోసం విద్యార్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 2న దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 11, 2025 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. KVS అడ్మిషన్ కోసం 2025 (KVS Admission 2025 Offline Registration) తల్లిదండ్రులు, సంరక్షకులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య తమ పాఠశాలల్లో పూరించిన దరఖాస్తులను, అవసరమైన డాక్యుమెంట్ల ను జత చేసి అందించాలి. అడ్మిషన్ షెడ్యూల్ ప్రకారం మొదటి ప్రొవిజనల్ ఎంపిక జాబితా ఏప్రిల్ 17న ప్రకటించబడుతుంది.
KVS అడ్మిషన్ 2025కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- కేంద్రీయ విద్యాలయ సంఘటన్ KVS వెబ్‌సైట్‌ను kvsangathan.nic.in సందర్శించాలి.
- హోంపేజీలో "Admission" లేదా "ప్రవేశాలు" అనే విభాగాన్ని గుర్తించాలి.
- 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్, అడ్మిషన్ ప్రక్రియ వివరాలను చెక్ చేయాలి.
- KVS ఆఫ్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఉంటుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- లేదా సంబంధిత కేంద్రీయ విద్యాలయం కార్యాలయం నుంచి అప్లికేషన్‌ను తీసుకోవాలి.
- దరఖాస్తును అభ్యర్థులు తమ వివరాలను అంటే తల్లిదండ్రులు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఇతర వివరాలను రాసి పూరించాలి.
- అప్లికేషన్‌తో పాటు అవసరమైన డాక్యుమెంట్లు జతపరచాలి.
- పూర్తి చేసిన అప్లికేషన్, డాక్యుమెంట్లను చివరి తేదీలోపు సంబంధిత కేంద్రీయ విద్యాలయం కార్యాలయంలో అందించాలి.
KVS అడ్మిషన్ 2025 ముఖ్యమైన తేదీలు (KVS Admission 2025 Important Dates)
KVS అడ్మిషన్ 2025 ముఖ్యమైన తేదీలు ఈ దిగువున ఉన్న టేబుల్లో అందించాం. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ తేదీలను గమనించి, వాటి ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు.
KVS Admission 2025 ఈవెంట్లు | ముఖ్యమైన తేదీలు |
KVS అడ్మిషన్ 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ | ఏప్రిల్ 2, 2025, ఉదయం 9:00 గంటలకు |
KVS అడ్మిషన్ 2025 రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ | ఏప్రిల్ 11, 2025, సాయంత్రం 4:00 గంటల వరకు |
KVS అడ్మిషన్ 2025 ఫైనల్ ప్రవేశ జాబితా ప్రచురణ | ఏప్రిల్ 17, 2025 (పాఠశాల నోటీసు బోర్డు, అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది) |
KVS అడ్మిషన్ 2025 పిరియడ్ | ఏప్రిల్ 18 నుండి ఏప్రిల్ 21, 2025 వరకు |
అభ్యర్థుల వయోపరిమితి, ప్రవేశ ప్రమాణాలు | కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) అడ్మిషన్ గైడ్‌లైన్స్ 2025-26 ప్రకారం |
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.