LIC AAO 2025 అడ్మిట్ కార్డ్ విడుదల, పరీక్ష హాల్ టికెట్ డౌన్‌లోడ్ స్టెప్స్ ఇవే
LIC AAO 2025 అడ్మిట్ కార్డ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ప్రత్యేక లాగిన్ వివరాలను ఉపయోగించి అభ్యర్థులు తమ హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.పూర్తి సమాచారం ఇక్కడ అందించాము.
LIC AAO 2025 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ (LIC AAO 2025 Admit Card Download): భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) 2025 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) ప్రిలిమ్స్ పరీక్షకు అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ అడ్మిట్ కార్డ్ లేకపోతే అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడం సాధ్యంకాదు. డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వంటి లాగిన్ వివరాలను ఉపయోగించాలి. పరీక్షకు హాజరుకావడానికి అభ్యర్థులు ప్రింట్ చేసిన కాపీ మరియు ప్రభుత్వ గుర్తింపు పత్రం తీసుకెళ్లాలి. పరీక్ష ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతుంది, ఇందులో రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ఇంగ్లీష్ భాష విభాగాలు ఉంటాయి. ఈ ప్రక్రియ ద్వారా LIC అభ్యర్థులను సరైన ర్యాంక్ ఆధారంగా ఫైనల్ ఎంపికకు అర్హత కల్పిస్తుంది.
LIC AAO 2025 అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి (How to download LIC AAO 2025 Admit Card)
అభ్యర్థులు ఈ క్రింద ఉన్న దశల ద్వారా LIC AAO 2025 అడ్మిట్ కార్డ్ ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- అధికారిక వెబ్‌సైట్ licindia.inను సందర్శించండి.
- హోమ్‌పేజీలో “Careers” లేదా “Recruitment” విభాగంపై క్లిక్ చేయండి.
- “Recruitment of AAO 2025” లింక్ ఎంచుకోండి.
- “Download Phase-I Call Letter” పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ నమోదు చేయండి.
- వివరాలు సమర్పించి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి.
అడ్మిట్ కార్డ్‌లో ఉన్న LIC AAO 2025 వివరాలు (LIC AAO 2025 details on the admit card)
LIC AAO 2025 అడ్మిట్ కార్డ్‌లో పరీక్షకు సంబంధించిన ముఖ్య సమాచారం ఉంటుంది:
- అభ్యర్థి పేరు
- రిజిస్ట్రేషన్ నంబర్
- పుట్టిన తేదీ
- పరీక్ష కేంద్రం వివరాలు
- పరీక్ష తేదీ, సమయం
- పరీక్ష హాల్‌లో పాటించవలసిన గైడ్‌లైన్‌లు
- అవసరమైన డాక్యుమెంట్ల వివరాలు
LIC AAO 2025 పరీక్ష నమూనా (Exam Pattern)
LIC AAO 2025 ప్రిలిమ్స్ ఆన్‌లైన్‌లో జరిగుతుంది. ఇంగ్లిష్ సెక్షన్ కేవలం క్వాలిఫైయింగ్ పద్దతిలో ఉంటుంది.
విభాగం(Section) | మొత్తం ప్రశ్నలు (Total Questions) | గరిష్ట మార్కులు ( Maximum Marks) | సెక్షన్ సమయం ( Section Timing ) |
రీజనింగ్ అబిలిటీ (Reasoning Ability) | 35 | 35 | 20 నిమిషాలు |
క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ (Quantitative Aptitude) | 35 | 35 | 20 నిమిషాలు |
ఇంగ్లిష్ భాష (English Language) | 30 | 30 | 20 నిమిషాలు |
మొత్తం (Total ) | 100 | 70 | 01 గంట |
LIC AAO 2025 అడ్మిట్ కార్డ్ విడుదల అయ్యింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లతో పరీక్షకు సమయానికి హాజరుకావాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.