ఆ సమయానికే NEET PG 2024 అడ్మిట్ కార్డులు విడుదల? (NEET PG 2024 Admit Card Expected Release Time)
NEET PG అడ్మిట్ కార్డ్ 2024 ఆగస్టు 8న విడుదల చేయబడుతుంది. మునుపటి సంవత్సరాల విడుదల సమయం ట్రెండ్‌ల ఆధారంగా అంచనా విడుదల సమయాన్ని ఇక్కడ చెక్ చేయవచ్చు. నీట్ పీజీ 2024 ఆగస్టు 11న నిర్వహించాల్సి ఉంది.
NEET PG అడ్మిట్ కార్డ్ 2024 ( NEET PG Admit Card 2024) : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ NEET PG అప్లికేషన్ పోర్టల్ 'అభ్యర్థి లాగిన్' ద్వారా ఈరోజు ఆగస్టు 8న NEET PG 2024 కోసం అడ్మిట్ కార్డులను విడుదల చేయబోతోంది. అయితే NEET PG అడ్మిట్ కార్డ్ విడుదలకు సంబంధించి NBE అధికారిక సమయాన్ని నిర్ధారించ లేదు. అభ్యర్థులు అంచనా విడుదల సమయాన్ని ఇక్కడ చూడవచ్చు. సాధారణంగా నీట్ పీజీ అడ్మిట్ కార్డ్ ప్రతి సంవత్సరం సాయంత్రంలోపు విడుదలవుతుంది. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ (NEET PG Admit Card 2024) చేసుకోవడానికి అభ్యర్థులు తమ 'యూజర్ ఐడీ', 'పాస్‌వర్డ్'ని సిద్ధంగా ఉంచుకోవాలి. వివిధ టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా విద్యార్థులను మోసం చేసేందుకు స్కామర్లు ప్రయత్నిస్తున్నారని, నీట్ పీజీ ప్రశ్నపత్రం లీక్‌పై ఎలాంటి పుకార్లను నమ్మవద్దని అభ్యర్థులకు సూచించారు.
NEET PG అడ్మిట్ కార్డ్ 2024 అంచనా విడుదల సమయం (Expected Release Time of NEET PG Admit Card 2024)
ఇతర పరీక్షల కోసం అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసే NBE ట్రెండ్‌ను పరిశీలిస్తే, ఇవ్వబడిన టేబుల్‌లో రాబోయే NEET PG హాల్ టిక్కెట్ 2024 కోసం విడుదల చేయాల్సిన సమయం ఇక్కడ అందించాం.
విశేషాలు | వివరాలు |
ఆశించిన విడుదల సమయం 1 | 10:00 గంటల నుంచి 1:00 గంటల మధ్య (తక్కువ అవకాశం) |
ఆశించిన విడుదల సమయం 2 | 6:00 గంటల నుంచి 10:00 గంటల మధ్య (ఎక్కువ అవకాశం) |
NEET PG పరీక్ష తేదీ | ఆదివారం, ఆగస్టు 11, 2024 |
అభ్యర్థులు తమ పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే, 'అభ్యర్థి లాగిన్'లో అందుబాటులో ఉన్న 'రెస్ట్ పాస్‌వర్డ్' పాస్‌వర్డ్ ఆప్షన్ ద్వారా దానిని తిరిగి పొందవచ్చు. అలాగే, అడ్మిట్ కార్డ్‌లను ప్రింట్ చేయడానికి ముందు వాటిపై పేర్కొన్న సమాచారాన్ని ధ్రువీకరించడం చాలా ముఖ్యం. అభ్యర్థులు తమ పేర్లు, రిజిస్ట్రేషన్ నెంబర్లు, తల్లిదండ్రుల పేర్లు, జెండర్, పరీక్షా వేదిక వంటి వివరాలను జాగ్రత్తగా చదవాలి. NEET PG 2024 పరీక్ష రోజున వివరాలు సరిపోలనందున ఏదైనా వ్యత్యాసాన్ని వెంటనే రిపోర్ట్ చేయాలి. అభ్యర్థులు NBE పోర్టల్‌కి +91-7996165333 వద్ద అధికారిక హెల్ప్‌డెస్క్ ద్వారా దిద్దుబాటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, అభ్యర్థులు హాల్ టిక్కెట్‌లో దిద్దుబాట్లు పొందడానికి రిఫరెన్స్ ఫ్రూఫ్‌లను అందించాల్సి ఉంటుంది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.