ONGC 2025 అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్, దేశవ్యాప్తంగా 2,623 ఖాళీలు
ONGCలో మొత్తం 2,623 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది, దరఖాస్తు చేసుకునే చివరి తేదీ నవంబర్ 17.దరఖాస్తుల గురించి పూర్తి సమాచారం ఇక్కడ క్రింద చూడండి.
ONGC 2,623 అప్రెంటిస్ పోస్టులకు భారీ నియామకం (ONGC makes massive recruitment for 2,623 apprentice posts): భారత ప్రభుత్వ రంగ సంస్థ ONGC (Oil and Natural Gas Corporation) మొత్తం 2,623 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా Northern, Mumbai, Western, Eastern, Southern, Central సెక్టార్లలో ఈ పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, ల్యాబ్ కెమిస్ట్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ వంటి విభాగాల్లో అప్రెంటిస్ నియామకాలు జరుగుతాయి. ఈ పోస్టులకు సంబంధిత రంగంలో ఐటీఐ / డిప్లొమా / డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారే అర్హులు. వయోపరిమితి నవంబర్ 6,2025 నాటికి 18 నుండి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం SC/ST కు 5 ఏళ్లు, OBC కు 3 ఏళ్లు, PwBD కు 10 ఏళ్ల సడలింపు అందుబాటులో ఉంటుంది.
అప్రెంటిస్ అభ్యర్థులకు నెలకు రూ.9,600 నుండి రూ.12,300 వరకు స్టైపెండ్ ఇవ్వబడుతుంది. ఎంపిక పూర్తిగా విద్యార్హతలలో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఎటువంటి పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. దరఖాస్తు ప్రారంభం అక్టోబర్ 16,2025 చివరి తేదీ నవంబర్ 17,2025. ప్రభుత్వం రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకి ఇది మంచి అవకాశంగా ఉంటుంది.
ONGC అప్రెంటిస్ నియామకాలకు ఆన్‌లైన్ దరఖాస్తు విధానం (Online application procedure for ONGC Apprentice Recruitment)
ONGC అప్రెంటిస్ నియామకాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడతాయి.దరఖాస్తు చేసే ముందు ఈ క్రింది దశలను పాటించండి.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- Apprentice Registration (NAPS / NATS పోర్టల్) పూర్తి చేయండి
- ONGC అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి
- పోస్టు, సెక్టార్, ట్రేడ్ ఎంచుకోండి
- అవసరమైన వివరాలు నమోదు చేసి డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
- సమర్పించే ముందు ప్రివ్యూ చెక్ చేసి సబ్మిట్ చేయండి
- రిజిస్ట్రేషన్ నంబర్ / అప్లికేషన్ కాపీ సేవ్ చేసుకోండి
ONGC అప్రెంటిస్ దరఖాస్తుకు అవసరమైన పత్రాల జాబితా (List of documents required for ONGC Apprentice application)
ONGC అప్రెంటిస్ ఆన్‌లైన్ దరఖాస్తు చేసే సమయంలో స్కాన్ చేసిన కాపీలు మాత్రమే ఆప్ లోడ్ చేయాలి.
- విద్యార్హత సర్టిఫికెట్లు (ITI / డిప్లొమా / డిగ్రీ)
- పుట్టినతేది సర్టిఫికెట్ (SSC / జనన సర్టిఫికెట్)
- కాస్ట్ సర్టిఫికెట్ (సంబంధించేవారికి మాత్రమే)
- ఆదార్ కార్డ్
- ఫోటో & సంతకం (JPEG ఫార్మాట్)
- బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ / కాపీ
- PwBD సర్టిఫికెట్ (అవసరమైతే)
సెక్టార్ వారీగా ONGC అప్రెంటిస్ ఖాళీల వివరాలు (Sector-wise ONGC Apprentice Vacancies Details)
దేశవ్యాప్తంగా ఆరు సెక్టార్లలో మొత్తం 2,623 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయబడనున్నాయి.ఖాళీల వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
సెక్టార్ | ఖాళీల సంఖ్య |
నర్తర్న్ (Northern) సెక్టార్ | 165 |
ముంబయి (Mumbai) సెక్టార్ | 569 |
వెస్టర్న్ (Western) సెక్టార్ | 856 |
ఈస్టర్న్ (Eastern) సెక్టార్ | 458 |
సౌతార్న్ (Southern) సెక్టార్ | 322 |
సెంట్రల్ (Central ) సెక్టార్ | 253 |
మొత్తం ఖాళీలు | 2,623 |
ONGC అప్రెంటిస్ నియామకాలు యువతకు మంచి అవకాశం. అర్హులైన అభ్యర్థులు చివరి తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయగలరు
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.