యువతకు మంచి ఛాన్స్, PMEGP స్కీమ్‌తో స్వయం ఉపాధి అవకాశాలు
PMEGP పథకం ద్వారా యువతకు రుణాలు మరియు సబ్సిడీతో ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయి. స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం రూ.50 లక్షల వరకు రుణం అందిస్తోంది.
PMEGP యువతకు స్వయం ఉపాధి (PMEGP self-employment for youth): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PMEGP (ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం) నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి సృష్టించడానికి కీలకంగా మారింది. ఒక్కో యూనిట్‌కు రూ.50 లక్షల వరకు రుణం మరియు గరిష్టంగా 35% సబ్సిడీ పొందవచ్చు .ఇదే ఈ పథకానికి ప్రధాన ఆకర్షణ. 18 సంవత్సరాలు పైనవాళ్ళందరూ దరఖాస్తు చేయగలరు. సేవా రంగానికి కనీసం 8వ తరగతి ఉత్తీర్ణత అవసరం; తయారీ రంగానికి ఎక్కువ విద్యార్హత కావాలి. బ్యాంకు అకౌంట్ ఉండటం తప్పనిసరి. పరిశ్రమ స్థాపన పూర్తయినప్పుడే సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రస్తుతం స్వీకరిస్తున్నారు, పథకం కొనసాగుతోందని దరఖాస్తులు ఇప్పటికే ప్రాసెస్ అవుతూన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వేర్వేరు రాయితీ శాతాలు ఉండడంతో చిన్న పరిశ్రమల విస్తరణకు ఇది గొప్ప తోడుగా నిలుస్తోంది.
2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాల వారీగా పథకం అమలును చూస్తే దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటివరకు వచ్చిన 577 దరఖాస్తులలో 367 ను బ్యాంకులకు పంపారు, అందులో 263 యూనిట్లకు రూ.871.01 లక్షల రుణం మంజూరు అయ్యింది. ఇంకా 104 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఈ డేటా పథకం ప్రభావాన్ని చూపుతున్నాయి. PMEGP ఎందుకు కీలకమంటే నిరుద్యోగి తన కోసం ఉద్యోగం వెతకకుండా, స్వయంగా ఉద్యోగ అవకాశాన్ని ఇస్తుంది.
PMEGP పథకానికి ఆన్‌లైన్ దరఖాస్తు విధానం (Online application procedure for PMEGP scheme)
PMEGP పథకానికి దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలి.దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఈ క్రింది దశలను పాటించండి.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి kviconline.gov.in వెళ్లండి
- “PMEGP Application” ఆప్షన్‌ను ఎంచుకోండి.
- కొత్త రిజిస్ట్రేషన్ చేసి లాగిన్ అవ్వండి.
- యూనిట్ వివరాలు మరియు ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్‌లోడ్ చేయండి.
- అవసరమైన పత్రాలు జత చేయండి.
- దరఖాస్తు సమర్పించిన తర్వాత బ్యాంకు ఎంపిక చేయండి.
- పరిశీలన పూర్తయ్యాక రుణం మంజూరు అవుతుంది.
- రుణం విడుదలైన తర్వాతే సబ్సిడీ ఖాతాలో జమ అవుతుంది.
PMEGP పథకానికి అవసరమైన పత్రాలు (Documents required for PMEGP scheme)
PMEGP పథకానికి దరఖాస్తు సమయంలో ఈ క్రింది పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు
- విద్యార్హత సర్టిఫికెట్ (కనీసం 8వ తరగతి)
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- బ్యాంక్ పాస్‌బుక్ / ఖాతా వివరాలు
- ప్రాజెక్ట్ రిపోర్ట్ (Project Report / DPR)
- చిరునామా రుజువు (Address Proof)
- కుల / మైనారిటీ / దివ్యాంగ సర్టిఫికెట్ (అవసరమైతే)
- రిటైర్డ్ ఉద్యోగులకు రిలీవింగ్ / పెన్షన్ పత్రాలు (అవసరమైతే)
PMEGP పథకం ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి సృష్టించుకునే మంచి అవకాశం అందుతోంది. సరైన ప్రాజెక్ట్‌తో దరఖాస్తు చేస్తే రుణం మరియు సబ్సిడీని కూడా పొందవచ్చు. స్వంత పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకునే వారు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.