పవర్‌గ్రిడ్‌లో 2025 లో భారీ ఉద్యోగ నోటిఫికేషన్, 1543 పోస్టుల భర్తీ, లక్షా 20 వేల వరకు జీతం
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ 1,543 ఫీల్డ్ ఇంజినీర్ ,సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు తీసుకుంటోంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయవచ్చు.దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 17, 2025.పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.
పవర్‌గ్రిడ్ ఫీల్డ్ ఇంజినీర్ & సూపర్ వైజర్ పోస్టుల కోసం దరఖాస్తు విధానం (Application Procedure for Powergrid Field Engineer & Supervisor Posts): పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (PGCIL) 2025 కోసం ఫీల్డ్ ఇంజినీర్ , ఫీల్డ్ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్జీలు ఆగస్టు 27, 2025 నుండి ప్రారంభమయ్యి, సెప్టెంబర్ 17, 2025, రాత్రి 11:59 వరకు సమర్పించవచ్చు. ఫీల్డ్ ఇంజినీర్ కావడానికి సంబంధిత ఇంజినీరింగ్ కోర్సులో B.E/B.Tech/B.Sc డిగ్రీ ఉండాలి, ఫీల్డ్ సూపర్ వైజర్ కి సంబంధిత విభాగంలో డిప్లొమా అవసరం. వయ్యస్సు పరిమితి 29 సంవత్సరాల వరకు, రిజర్వ్ వర్గాలకు రాయితీ ఉంది. వేతనం ఫీల్డ్ ఇంజినీర్‌కు రూ.30,000 నుండి రూ.1,20,000, ఫీల్డ్ సూపర్ వైజర్ కు రూ.23,000 నుండి రూ.1,05,000 మధ్యగా ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ చేసి, వివరాలు నమోదు చేసి, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, దరఖాస్తు ఫీజు చెల్లించి (ఫీల్డ్ ఇంజినీర్‌ల కోసం రూ.400, ఫీల్డ్ సూపర్ వైజర్ ల కోసం రూ.300, SC/ST/PwBD/Ex-SM అభ్యర్థులకు మినహాయింపు) దరఖాస్తు సమర్పించాలి. ఈ పోస్టులు కాంట్రాక్ట్ ఆధారంగా ఉంటాయి.
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ పోస్టుల ఖాళీల వివరాలు (Power Grid Corporation Vacancy Details)
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఫీల్డ్ ఇంజినీర్ ,ఫీల్డ్ సూపర్ వైజర్ పోస్టుల ఖాళీల వివరాలు ఈ కింద ఇవ్వబడ్డాయి
పోస్టు రకం | మొత్తం పోస్టులు | బ్రాంచ్‌లు |
ఫీల్డ్ ఇంజినీర్ | 730 | ఇలక్ట్రికల్, సివిల్ |
ఫీల్డ్ సూపర్ వైజర్ | 813 | ఇలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ |
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ పోస్టుల ఖాళీల ఎలా అప్లై చేయాలి (How to apply for Power Grid Corporation vacancies)
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ పోస్టుల ఖాళీల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ సమర్పించవచ్చు. ఈ క్రింద ఉన్న దశలను పాటించండి.
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ powergrid.inకి వెళ్లండి.
- "కెరీర్స్" సెక్షన్‌లో "జాబ్ ఓపెనింగ్స్"పై క్లిక్ చేయండి.
- ఫీల్డ్ ఇంజినీర్/సూపర్ వైజర్ పోస్టుల కోసం అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
- అవసరమైన వివరాలు నమోదు చేసి, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
- దరఖాస్తు ఫీజు చెల్లించండి (ఫీల్డ్ ఇంజినీర్ రూ.400, ఫీల్డ్ సూపర్ వైజర్ రూ.300; SC/ST/PwBD/Ex-SM కి మినహాయింపు).
- దరఖాస్తు సమర్పించి, కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకోండి.
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2025లో 1,543 పోస్టుల భర్తీకి గొప్ప అవకాశం అందిస్తోంది. తగిన అర్హతలున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా త్వరగా అప్లై చేసి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 17, 2025, కావున సమయానికి దరఖాస్తు చేయడం మర్చిపోకండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.