RITES లిమిటెడ్‌లో 17 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టులు ,డిసెంబర్ 8లోపు దరఖాస్తు చేయండి
రైట్స్ లిమిటెడ్‌లో (RITES Limited) వ్యక్తిగత కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 8,2025 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
రైట్స్ లిమిటెడ్‌లో ఇండివిడ్యువల్ కన్సల్ట్‌ంట్ ఖాళీలు (Individual Consultant Vacancies at Rights Limited): ప్రభుత్వ రంగ సంస్థ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (RITES Limited) ఇటీవల వివిధ విభాగాల్లో ఇండివిడ్యువల్ కన్సల్ట్‌ంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు ఒప్పంద ప్రాతిపదికన జరుగుతాయి. మొత్తం 17 ఖాళీలు లభ్యమయ్యాయి. అభ్యర్థులు డిప్లోమా లేదా బీటెక్ (B.Tech) వంటి సంబంధిత విద్యార్హతలతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం కలిగి ఉండాలి. వయస్సు గరిష్ఠంగా 62 సంవత్సరాలు. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 08,2025 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపికైన అభ్యర్థులకు పోస్టుకు అనుగుణంగా నెలకు రూ.60,000 నుండి రూ.2,55,000 వరకు వేతనాన్ని ఇవ్వబడుతుంది. ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన వారు RITES Limited ప్రాజెక్ట్‌లలో సాంకేతిక, ఇంజనీరింగ్, మరియు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో పని చేస్తారు. అనుభవజ్ఞులైన ఇంజినీర్లకు ఇది మంచి అవకాశం
RITES లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 2025, కన్సల్టెంట్లు పోస్టుల నోటిఫికేషన్ లింక్
రైట్స్ లిమిటెడ్‌లో ఇండివిడ్యువల్ కన్సల్ట్‌ంట్ ఖాళీల పూర్తి నోటిఫికేషన్‌ను ఈ క్రింద పట్టికలో ఇచ్చాము చూడండి.
RITES 2025 కన్సల్టెంట్లు పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు విధానము (RITES 2025 Consultants Posts Online Application Procedure)
రైట్స్ లిమిటెడ్ ఇండివిడ్యువల్ కన్సల్ట్‌ంట్ పోస్టులకు దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలి.దరఖాస్తుకు ఈ క్రింది సూచనలు పాటించండి.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.rites.com సందర్శించండి.
- ఆ తరువాత హోమ్‌పేజీలోని “Career” సెక్షన్‌లోకి వెళ్లండి.
- సంబంధిత నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
- అవసరమైన వివరాలతో ఆన్‌లైన్ ఫారం నింపండి.
- అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
- చివరగా సబ్మిట్ బటన్ నొక్కి దరఖాస్తు పూర్తి చేయండి.
- భవిష్యత్తులో అవసరానికి దరఖాస్తు కాపీని ప్రింట్ చేసుకోండి.
ముఖ్యమైన సూచనలు (Important Instructions)
RITES 2025 దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఈ క్రింది సూచనలను జాగ్రత్తగా చదవండి.
- సమర్పించే అన్ని వివరాలు ఖచ్చితంగా సరిగా ఉండాలి.
- వయస్సు, అర్హత, అనుభవం వంటి వివరాలకు సంబంధించిన సర్టిఫికెట్‌లు తప్పనిసరిగా జత చేయాలి.
- అసంపూర్ణంగా లేదా తప్పుగా నింపిన దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
- ఇంటర్వ్యూకు హాజరయ్యేటప్పుడు అసలు పత్రాలు తీసుకురావాలి.
- దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 8,2025 ఆ తేదీ తర్వాత అందించిన ఫారాలు పరిగణలోకి తీసుకోబడవు.
- రైట్స్ లిమిటెడ్ నిర్ణయం తుదిగా పరిగణించబడుతుంది.
రైల్వే మరియు ఇంజనీరింగ్ రంగాల్లో అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం రైట్స్ లిమిటెడ్‌లో ఈ ఉద్యోగావకాశం మంచి అవకాశం. అర్హుత ఉన్న అభ్యర్థులు ముందే, చివరి తేదీ డిసెంబర్ 8,2025 లోపు దరఖాస్తు చేయాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.