RRB ALP 2026 పరీక్ష షెడ్యూల్ విడుదల
RRB ALP 2026 పరీక్షా షెడ్యూల్ విడుదలైంది. CBT-1 పరీక్షలు ఫిబ్రవరి 16 నుండి 18 వరకు నిర్వహించబడనున్నాయి. పరీక్ష సిటీ స్లిప్ ఫిబ్రవరి 6న, అడ్మిట్ కార్డులు ఫిబ్రవరి 12 నుండి అందుబాటులో ఉంటాయి.
RRB ALP 2026 పరీక్ష తేదీలు విడుదల (RRB ALP 2026 Exam Dates Released):RRB ALP 2026 నియామక ప్రక్రియ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు కంప్యూటర్ ఆధారిత పరీక్షల పూర్తి వివరాల తేదీలను విడుదల చేశాయి. ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించబడతాయి మరియు వేల సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయడానికి అభ్యర్థుల ప్రాథమిక నైపుణ్యాలను పరీక్షిస్తాయి. CBT-1 పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది మరియు గణితం, రీజనింగ్, సాధారణ శాస్త్రం, సాధారణ అవగాహన వంటి విభాగాలలో అభ్యర్థుల ప్రాథమిక జ్ఞానాన్ని అంచనా వేయడానికి రూపొందించబడింది. పరీక్షకు హాజరు కావడానికి ముందు అభ్యర్థులు తమ ఆధార్ వివరాలను UIDAI సిస్టమ్‌లో అన్‌లాక్ చేసి ఉన్నారో లేదో ముందుగానే పరిశీలించుకోవాలి, ఎందుకంటే పరీక్ష రోజున బయోమెట్రిక్ ఆధారిట్‌మేషన్ ద్వారా మాత్రమే ప్రవేశం ఇస్తారు. దీంతో ఎంట్రీ, వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను వేగంగా, పారదర్శకంగా చేస్తుంది.
ALP నియామక ప్రక్రియ బహుళ దశలుగా ఉంటుంది. మొదటి దశ CBT-1లో అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాత విస్తృతంగా జరిగే CBT-2లో పాల్గొంటారు. ఈ రెండింటిని క్లియర్ చేసినవారికి మాత్రమే కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT)లో అవకాశం లభిస్తది, ఇది మానసిక సామర్థ్యాలు మరియు నిర్ణయ శక్తిని అంచనా వేశేందుకు ముఖ్యమైనది. చివరి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు జరుగుతాయి. ప్రతి దశలో అర్హులు మాత్రమే తదుపరి దశకు వెళ్లతారు.
RRB ALP 2026 ముఖ్యమైన తేదీలు (RRB ALP 2026 Important Dates)
RRB ALP 2026 పరీక్షకు సంబంధించిన కీలక తేదీలను అభ్యర్థులు ముందుగానే గుర్తించుకోవాలి.
వివరాలు | తేదీలు |
CBT-1 పరీక్ష తేదీలు | ఫిబ్రవరి 16,17,18 2026 |
ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ విడుదల తేదీ | ఫిబ్రవరి 06,2026 |
అడ్మిట్ కార్డ్ (E-Call Letter) డౌన్‌లోడ్ తేదీ | ఫిబ్రవరి 12,2026 నుండి |
SC/ST ట్రావెల్ అథారిటీ తేదీ | ఫిబ్రవరి 06,2026 నుండి |
RRB ALP 2026 CBT-1 పరీక్ష విధానం (RRB ALP 2026 CBT-1 Exam Pattern)
RRB ALP 2026 అభ్యార్థుల ప్రాథమిక జ్ఞానం, నైపుణ్యాలను అంచనా వేయడానికి పరీక్షను విభాగాల వారీగా రూపొందించారు.
పరీక్ష విధానం:కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ పరీక్ష (CBT-1)
- మొత్తం ప్రశ్నలు: 75
- మొత్తం మార్కులు: 75
- పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు
- నెగటివ్ మార్కింగ్: ఉంది
- ప్రశ్నల స్థాయి: 10వ తరగతి లెవల్
పరీక్ష విభాగాలు (Exam sections):
- గణిత శాస్త్రం (Mathematics)
- జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్
- జనరల్ సైన్స్
- జనరల్ అవేర్‌నెస్
RRB ALP 2026 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్, అడ్మిట్ కార్డ్ వివరాలు, ఎంపిక విధానం వంటి కీలక విషయాలను అభ్యర్థులు ముందుగానే తెలుసుకుని సిద్ధంగా ఉండటం ముఖ్యం. పరీక్ష రోజు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి కనుక అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచండి. అధికారిక RRB వెబ్‌సైట్లు రెగ్యులర్‌గా చూడటం ద్వారా తాజా అప్‌డేట్‌లను ఫాలో అవడం చాలా ఉపయోగకరం.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.