TG EAMCET దశ 2 వెబ్ ఆప్షన్లు 2025 అంచనా విడుదల సమయం
TG EAMCET దశ 2 వెబ్ ఆప్షన్స్ జూలై 26న ప్రారంభం. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఆప్షన్లు నమోదు చేయాలి.దశ 2 వెబ్ ఆప్షన్స్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.
TG EAMCET 2025 దశ 2 వెబ్ ఆప్షన్స్ జూలై 26న ప్రారంభం , ఉదయం 10 గంటల నుంచే ప్రారంభం అయ్యే అవకాశం(TG EAMCET 2025 Phase 2 Web Options to begin on July 26, likely to start from 10 am): TG EAMCET 2025 దశ 2 కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ జూలై 26, 2025న ప్రారంభం కానుంది. ఈ దశలో ఫస్ట్ దశ లో సీటు రాని వారు లేదా తగిన కాలేజీ రాకపోవడం వల్ల సీటును రద్దు చేసుకున్న అభ్యర్థులు పాల్గొనవచ్చు. అధికారులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, జూలై 25న రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూలై 26న సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగుతుంది. అదేరోజున వెబ్ ఆప్షన్స్ కూడా ప్రారంభమవుతాయి. సాధారణంగా గత సంవత్సరాల ప్రకారం, వెబ్ ఆప్షన్స్ లింక్ ఉదయం 10:00 AM కు యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgeapcet.nic.inలో లాగిన్ అయి, తాము కోరే కాలేజీలు మరియు కోర్సులను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవచ్చు. జూలై 27వ తేదీతో వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ముగియనుంది. ఆ రోజు చివరి రోజు కాబట్టి, ఫ్రీజ్ చేసే ముందు ఆప్షన్లను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ముగిశాక, దశ 2 సీట్ల కేటాయింపు ఫలితాలు జూలై 30న విడుదల కానున్నాయి. అనంతరం కేటాయించిన అభ్యర్థులు కాలేజీకి రిపోర్ట్ కావాలి. అభ్యర్థులు అంతకుముందే ఇంటర్నెట్, ఆధార్, సర్టిఫికేట్లు మొదలైనవన్నీ సిద్ధంగా ఉంచుకుంటే, ఏవైనా సాంకేతిక సమస్యల్ని తొలగించవచ్చు. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ తనిఖీ చేయడం మంచిది.
TG EAMCET 2025 దశ 2 కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు(TG EAMCET 2025 Phase 2 Counselling Important Dates)
TG EAMCET 2025 దశ 2 కౌన్సెలింగ్‌లో పాల్గొనదలచిన అభ్యర్థులు ఈ క్రింది తేదీలను గమనించాలి. వెబ్ ఆప్షన్స్ నుండి సీటు కేటాయింపు వరకు ప్రతి దశకు పూర్తి ఇక్కడ టేబుల్ పట్టికలో అందించాము.
వివరాలు | తేదీలు |
TG EAMCET 2025 రిజిస్ట్రేషన్ & స్లాట్ బుకింగ్ తేదీ | జూలై 25, 2025 |
TG EAMCET సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ | జూలై 26, 2025 |
TG EAMCET వెబ్ ఆప్షన్స్ ప్రారంభ తేదీ | జూలై 26, 2025 (ఉదయం 10:00 AM నుండి) |
TG EAMCET ఆప్షన్స్ ఫ్రీజింగ్ తేదీ | జూలై 27, 2025 |
TG EAMCET 2025 సీట్ల కేటాయింపు ఫలితం తేదీ | జూలై 30, 2025 |
కాలేజీకి రిపోర్టింగ్ (Self Reporting) తేదీలు | జూలై 31 నుండి ఆగస్టు 2, 2025 (అంచనా) |
TG EAMCET రెండవ విడత కౌన్సెలింగ్ విద్యార్థులకు ఒక ప్రధాన అవకాశంగా మారుతుంది.అభ్యర్థులు తమకు తగిన ప్రాధాన్యతలతో కాలేజీలను జాగ్రత్తగా ఆప్షన్ చేసి ఫ్రీజ్ చేయాలి. వెబ్ ఆప్షన్స్ యాక్టివ్ టైమ్ జూలై 26 ఉదయం నుండి ఉండే అవకాశం ఉన్నందున అధికారిక వెబ్‌సైట్‌ను ఉదయం నుంచే పరిశీలిస్తూ ఉండాలి .
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.