TS EAMCET 2025కి ఇంకా దరఖాస్తు చేసుకోలేదా ? లేట్ ఫీజు రూ.500తో ఈరోజే లాస్ట్ ఛాన్స్
TS EAMCET 2025 ఇంకా దరఖాస్తు చేసుకోని వాళ్లు ఆలస్య ఫీజు రూ.500తో (TS EAMCET 2025 Registration) అప్లై చేసుకోవడానికి ఈరోజు చివరి తేదీ.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
TS EAMCET 2025 ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? (TS EAMCET 2025 Registration) :
TS EAMCET 2025కి దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు లేట్ ఫీజుతో ఇంకా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రూ.500ల ఆలస్య ఫీజుతో ఈరోజు అంటే ఏప్రిల్ 14న దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్
eapcet.tsche.ac.in
లో అప్లై చేసుకోవచ్చు. TS EAMCET 2025 దరఖాస్తు ప్రక్రియలో రిజిస్ట్రేషన్, అప్లికేషన్ పూరించడం, డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడం ,ఫీజు చెల్లింపు వంటి అంశాలు ఉంటాయి. దరఖాస్తుదారులు అప్లికేషన్‌ని (TS EAMCET 2025 Registration) పూరించే ముందు TS EAMCET 2025 అర్హత ప్రమాణాలు చెక్ చేయాలి.
TS EAMCET 2025 ఫీజు వివరాలు (TS EAMCET 2025 Fee Details)
TS EAMCET 2025 ఫీజు వివరాలు (TS EAMCET 2025 Fee Details) ఇంకా పరీక్షా తేదీలు ఈ క్రింద టేబుల్ లో ఇచ్చాము గమనించగలరు.
ఈవెంట్ | తేదీలు |
రూ. 500/- లేట్ ఫీజుతో ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ. | ఏప్రిల్ 14,2025 |
రూ. 2500/- లేట్ ఫీజుతో ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ. | ఏప్రిల్ 18,2025 |
రూ. 5000/- లేట్ ఫీజుతో ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ. | ఏప్రిల్ 24,2025 |
ఇంజనీరింగ్, వ్యవసాయం ఫార్మసీ కోసం వెబ్‌సైట్ నుండి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోండి. | ఏప్రిల్ 19,2025 |
TS EAMCET-2025 పరీక్ష | |
అగ్రికల్చర్ & ఫార్మసీ (A&P) | ఏప్రిల్ 29,2025 (FN & AN) & ఏప్రిల్ 30,2025 (FN) |
ఇంజనీరింగ్ (E) | మే 2 నుండి మే 5 వరకు 2025,(FN & AN) |
TS EAMCET 2025 కోర్సుల వారీగా ఫీజు వివరాలు
స్ట్రీమ్ | కేటగిరీ | ఫీజు |
ఇంజనీరింగ్(E) | SC/ST &PH ఇతరులు | రూ. 500/ రూ. 900/ |
వ్యవసాయం & ఫార్మసీ (ఎ & పి) | SC/ST &PH ఇతరులు | రూ. 500/ రూ. 900/ |
ఇంజనీరింగ్ (ఇ) అగ్రికల్చర్ & ఫార్మసీ (ఎ & పి) రెండూ | SC/ST &PH ఇతరులు | రూ. 1000/ రూ. 1800/ |
ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షగా ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ eapcet.tsche.ac.in నుంచి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ & ఫార్మసీ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లకు, డౌన్‌లోడ్ సేవ ఏప్రిల్ 19, 2025 నుండి అందుబాటులో ఉంటుంది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.