ఇవాళ్టి నుంచే తెలంగాణ టెట్ 2025 రిజిస్ట్రేషన్, ఈ అర్హతలుంటే వెంటనే అప్లై చేసుకోండి (TS TET June 2025 Registration)
తెలంగాణ టెట్ (TS TET June 2025 Registration) జూన్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు నుంచి అంటే మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
తెలంగాణ టెట్ 2025 రిజిస్ట్రేషన్ (TS TET June 2025 Registration) :
తె
లంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2025 June 2025) 2025 దరఖాస్తు ప్రక్రియ (TS TET June 2025 Registration) ఈరోజు నుంచి అంటే ఏప్రిల్ 15 ,2025 నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.inలో అప్లై చేసుకోవచ్చు.
TS TET 2025 అనేది రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతులకు ఉపాధ్యాయులు కావాలనుకునే అభ్యర్థులకు తప్పనిసరి అర్హత పరీక్ష. తెలంగాణ టెట్ 2025 జూన్ 15, 2025 నుంచి జూన్ 30, 2025 మధ్య జరుగుతుంది. ఇది ఒక కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT). TS TET 2025 జూన్ అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అయిన వెంటనే ఇక్కడ లింక్ అందిస్తాం.
లేటెస్ట్ :
TS TET 2025 రిజిస్ట్రేషన్ ఎన్ని గంటలకు మొదలవుతుంది?
TS TET జూన్ 2025 రిజిస్ట్రేషన్ అర్హత ప్రమాణాలు (TS TET June 2025 Registration Eligibility Requirements)
TS TET జూన్ 2025 రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన అర్హత ప్రమాణాలు ఈ దిగువున అందించడం జరిగింది. అయితే అభ్యర్థి పేపర్ I లేదా పేపర్ IIకి దరఖాస్తు చేస్తున్నారా అనే దానిపై ఆధారపడి అర్హత ప్రమాణాలు మారతాయి. విద్యార్హతలు, వయస్సు నిబంధనలు ఇక్కడ చూడండి.
TS TET 2025 జూన్ పేపర్ 1కి హాజరయ్యే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు...
- పేపర్ 1కి హాజరయ్యే అభ్యర్థులు 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed.) చేసి ఉండాలి.
- 4 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (B.El.Ed.), 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి.
TS TET 2025 జూన్ పేపర్ II (VI నుంచి VIII తరగతులు)కి హాజరయ్యే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు...
- కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేట్ (SC, ST, BC, వికలాంగులకు 45 శాతం మార్కులు) అయి ఉండాలి.
- బి.ఎడ్. లేదా బి.ఎడ్. (స్పెషల్ ఎడ్యుకేషన్) డిగ్రీతో పాటు లేదా 4 సంవత్సరాల BAEd/B.Sc.Ed చేసి ఉండాలి.
- లేదా సంబంధిత భాషను ఐచ్ఛిక అంశంగా తీసుకుని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత పద్ధతిలో లాంగ్వేజ్ పండిట్ శిక్షణ సర్టిఫికెట్ లేదా బి.ఎడ్ చేసి ఉండాలి.
- అలాగే డి.ఎల్.ఎడ్. లేదా బి.ఎడ్. చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు పరీక్ష రాయడానికి అర్హులు కానీ అర్హత పూర్తి చేయకపోతే ఉపాధ్యాయ నియామకానికి హాజరు కాలేరు.
- TS TET 2025కి హాజరు కావడానికి నిర్దిష్ట వయోపరిమితి లేదు. కానీ అభ్యర్థులు దరఖాస్తు సమయంలో అన్ని విద్యా అర్హతలను కలిగి ఉండాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.