వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో (Vizag Steel Recruitment 2023) పలు అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 250 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలు ఇక్కడ అందజేశాం.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ రిక్రూట్‌మెంట్ 2023 (Vizag Steel Recruitment 2023):
ఆంధ్రప్రదేశ్‌లోని 250 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అధికారులు ఇటీవల ఆన్‌లైన్ మోడ్ ద్వారా 250 పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్‌ను (Vizag Steel Recruitment 2023) పబ్లిష్ చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులందరూ వైజాగ్ స్టీల్ కెరీర్ అధికారిక వెబ్‌సైట్‌ను vizagsteel.com చెక్ చేయవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు 31 జూలై 2023లో లేదా అంతకు ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వైజాగ్ స్టీల్ ఖాళీల వివరాలు (Vizag Steel Plant Vacancy Details)
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 250 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున అందజేయడం జరిగింది.
పోస్టు పేరు
ఖాళీల సంఖ్య
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌షిప్ ట్రైనీ
200
టెక్నిషియన్ అప్రెంటీస్ షిప్ ట్రైనీ
50
వైజాగ్ స్టీల్ రిక్రూట్‌మెంట్ ఖాళీల అర్హత వివరాలు (Vizag Steel Plant Recruitment Required Eligibility Details)
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులు లేదా యూనివర్సిటీల నుంచి డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన జీతం వివరాలు ఇక్కడ తెలియజేయడం జరిగింది.
పోస్టు పేరు
జీతం
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌షిప్ ట్రైనీ
రూ.9000
టెక్నిషియన్ అప్రెంటీస్‌షిప్ ట్రైనీ
రూ.8,000
వైజాగ్ స్టీల్ ప్లాంట్ గ్రాడ్యుయేట్, టెక్నిషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ ఉద్యోగాలు 2023 కోసం దరఖాస్తు చేసుకోవడానికి స్టెప్స్ (Steps to Apply for Vizag Steel Graduate and Technician Apprenticeship Trainee Jobs 2023)
వైజాగ్ స్టీల్ ప్లాంట్ గ్రాడ్యుయేట్, టెక్నిషియన్ అప్రెంటీస్‌షిప్ ట్రైనీ ఉద్యోగాల కోసం ఈ దిగువున తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్
vizagsteel.com
ని సందర్శించండి
హోంపేజీలో దరఖాస్తు చేయబోయే వైజాగ్ స్టీల్ రిక్రూట్‌మెంట్ లేదా కెరీర్‌ల కోసం చెక్ చేయండి.
గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను ఓపెన్ చేసి, అర్హతను చెక్ చేయండి.
మీకు అర్హత ఉంటే ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తు ఫార్మ్‌ను పూరించండి.
తర్వాత దరఖాస్తు ఫార్మ్‌ను సబ్మిట్ చేయండి.
అనంతరం దరఖాస్తు ఫార్మ్ నెంబర్, రసీదు సంఖ్యను దగ్గర పెట్టుకోవాలి.
ఈ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పోస్టులకు అభ్యర్థులను మెరిట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.