మరికొన్ని గంటల్లో ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 (AP Inter Result Release Date 2025)
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల తేదీని (AP Inter Result Release Date 2025) ఇక్కడ అందజేశాం. గత ట్రెండ్‌లను అనుసరించి ఫలితాలు అంచనా తేదీని ఇక్కడ తెలియజేశాం.
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు ఎక్స్‌పెక్టెడ్ విడుదల తేదీ 2025 (AP Inter Result Release Date 2025) :
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి మార్చి 19, 2025 వరకు సాగాయి. అదేవిధంగా ఏపీ ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి మార్చి 20, 2025 వరకు కొనసాగాయి.
ఏపి ఇంటర్మీడియట్ ఫలితాల్లో మరి కొన్ని గంటల్లో విడుదలకానున్నాయి. ఈరోజు అంటే ఏప్రిల్ 12, ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే ఇక్కడ సంబంధిత ఫలితాల లింక్‌ను ఇక్కడ అందిస్తాం.
కాగా ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం పరీక్షలపై విద్యార్థులు మిశ్రమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అంటే కొన్ని పరీక్షలు చాలా సులభంగా ఉండగా మరికొన్ని మోడరేట్‌గా ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. దాదాపుగా మంచి స్కోర్ సాధించే అవకాశం ఉందని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పరీక్షలపై విద్యానిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
లేటెస్ట్...
ఏపీ ఇంటర్ ఫలితాల లింక్ 2025 | AP Inter Results 2025 ఎన్ని గంటలకు రిలీజ్ అవుతాయి? |
వాట్సాప్‌లో ఏపీ ఇంటర్ ఫలితాలు 2025, ఇలా చెక్ చేసుకోవాలి |
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో పలితాలు ఎప్పుడు విడుదలవుతాయనే విషయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతారు. విద్యార్థుల భవిష్యత్తు అడుగుల కోసం ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకం. పలు ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల ప్రవేశాల కోసం ఇంటర్ విద్యార్థులు కచ్చితంగా హాజరవుతారు. ఈ క్రమంలో ఇంటర్ ఫలితాలు చాలా కీలకంగా మారతాయి. ఈ నేపథ్యంలోనే ఇంటర్ ఫలితాల కోసం సర్వత్రా ఆసక్తి చూపుతున్నారు.
అయితే గత ట్రెండ్‌ల ప్రకారం ఇక్కడ ఏపీ ఇంటర్మీడియట్ మొదటి, రెండు సంవత్సరాల ఫలితాలు (AP Inter Result Expected Release Date 2025) ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఇక్కడ వివరంగా తెలియజేశాం. ఏపీ ఇంటర్ ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ, సమయం ఇక్కడ అంచనాగా అందించాం. అలాగే ఇంటర్ ఫలితాల మార్కుల షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో కూడా ఇక్కడ అందించాం. .
ఇంటర్మీడియట్ ఫలితం 2025 ఏపీ అధికారిక వెబ్‌సైట్ bieap.apcfss.in/లో పబ్లిష్ చేస్తుంది. విద్యార్థులు తమ రోల్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా 2025 ఏపీ ఇంటర్ ఫలితాలను ఆన్‌లైన్‌లో bie.ap.gov.in 2025 చెక్ చేయవచ్చు. అలాగే విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలను SMS ద్వారా చెక్ చేసే సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. ఈ ఏడాది నుంచి వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాలను పొందే ఏర్పాటును ప్రభుత్వం కల్పించనుంది. విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్ నెంబర్లకు ఫలితాలు పంపించే అవకాశం ఉంది. కాగా ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 లింక్ bie.ap.gov.inలో యాక్టివేట్ చేయబడుతుంది.
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల తేదీ, సమయం 2025 (అంచనా) (AP Intermediate Result Release Date, Time 2025 (Estimated)
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025 విడుదల తేదీ, సమయం ఈ దిగువున టేబుల్లో ఫలితాలను అంచనాగా అందించడం జరిగింది. విద్యార్థులు గమనించవచ్చు.ఈవెంట్ | వివరాలు |
ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల తేదీ | ఏప్రిల్ 12, 2025 |
ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల సమయం | ఉదయం 11 గంటలకు |
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025 తేదీ, ట్రెండ్స్ (AP Inter Results 2025 Result Date Trends)
గత మూడేళ్లగా ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు వివిధ తేదీల్లో విడుదలయ్యాయి. ముఖ్యంగా 2022లో ఏపీ ఇంటర్ పరీక్షలు చాలా ఆలస్యంగా జరిగాయి. అంటే ఏప్రిల్ 27 నుంచి మే 24, 2022 వరకు జరిగాయి. దాంతో ఆ ఏడాది ఫలితాలు జూన్ 22, 2022న రిలీజ్ అయ్యాయి. అలాగే 2023లో ఏపీ ఇంటర్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 4, 2023 వరకు జరిగాయి. పరీక్షలు పెన్, పేపర్ మోడ్‌లో నిర్వహించబడ్డాయి. ఆ సంవత్సరం ఫలితాలు ఏప్రిల్ 26న జరిగాయి. గత ఏడాది అంటే 2024లో మార్చి 1 నుంచి మార్చి 20 వరకు ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఆ ఏడాది ఫలితాలు ఏప్రిల్ 12, 2024 జరిగాయి.
విద్యార్థులు గత సంవత్సరాల AP ఇంటర్మీడియట్ ఫలితాల ప్రకటన తేదీలను ఈ దిగువున టేబుల్లో చూడవచ్చు
పరీక్ష రకం | 2024 | 2023 | 2022 |
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల తేదీ | ఏప్రిల్ 12, 2024 | ఏప్రిల్ 26, 2023 | జూన్ 22, 20222 |
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా తేదీలు | మార్చి 1 నుంచి మార్చి 20, 2024 | మార్చి 16 నుంచి ఏప్రిల్ 4, 2023 | ఏప్రిల్ 27 నుంచి మే 24, 2022 |
ఏపీ ఇంటర్మీడియట్ మార్కుల మెమో 2025ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download AP Intermediate Year Marks Memo 2025?)
ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు ఏపీ ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు అందుబాటులోకి వస్తాయి. మార్కుల షీట్‌ని ఈ దిగువున తెలిపిన విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.- స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in ని సందర్శించాలి.
- స్టెప్ 2: హోమ్‌పేజీ ఎగువన ఉన్న 'IPE ఫలితాలు 2025' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: 'ఏపీ ఇంటర్మీడియట్ 2025 జనరల్ ఫలితాలు' లేదా 'ఇంటర్మీడియట్ 2025 వృత్తి ఫలితాలు' అనే ఆప్షన్‌ని ఎంచుకోవాలి.
- స్టెప్ 4: లాగిన్ విండోలో మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
- స్టెప్ 5: 'ఫలితాన్ని పొందండి' బటన్‌ను క్లిక్ చేయాలి.
- స్టెప్ 6: మీ AP ఇంటర్ 2వ సంవత్సరం మార్కుల మెమో 2025 తెరపై ప్రదర్శించబడుతుంది.
- స్టెప్ 7: భవిష్యత్తు సూచన కోసం కాపీని ప్రింట్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025 వివరాలు
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025లో పేర్కొన్న వివరాలు ఈ దిగువున అందజేయడం జరిగింది.- విద్యార్థి పేరు
- హాల్ టికెట్ నెంబర్
- విషయాలు
- బోర్డు పేరు (ఇంటర్మీడియట్ విద్య బోర్డు ఆంధ్రప్రదేశ్ - BIEAP)
- వచ్చిన మొత్తం మార్కులు
- అర్హత స్థితి (పాస్ లేదా ఫెయిల్)
- తరగతులు
- ప్రతి సబ్జెక్టులో సాధించిన మార్కులు
ఇంపార్టెంట్ లింక్స్ |