AP NEET UG మెరిట్ జాబితా 2025 విడుదల తేదీ, మెరిట్ ర్యాంకులు PDF డౌన్‌లోడ్ లింక్
ప్రొవిజనల్ ఆంధ్రప్రదేశ్ NEET UG మెరిట్ జాబితా 2025 ఆగస్టు 2025 మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యంతరాల గడువు ముగిసిన కొన్ని రోజుల తర్వాత ఫైనల్ AP NEET మెరిట్ జాబితా 2025 విడుదల చేయబడుతుంది.
AP NEET UG మెరిట్ లిస్ట్ 2025 విడుదల తేదీ (AP NEET UG Merit List 2025 Release Date) :
ప్రొవిజనల్ AP NEET UG మెరిట్ జాబితా 2025 (AP NEET UG Merit List 2025 Release Date) ఆగస్టు 2025 మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత విద్యార్థులు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి అనుమతించబడతారు. అభ్యంతరాల గడువు ముగిసిన కొన్ని రోజుల తర్వాత ఫైనల్ ఆంధ్రప్రదేశ్ NEET మెరిట్ జాబితా 2025 విడుదల చేయబడుతుంది. రాష్ట్ర ర్యాంక్ జాబితాలో పొందిన ర్యాంకుల ఆధారంగా విద్యార్థులు 85% AIQ సీట్లకు షార్ట్‌లిస్ట్ చేయబడతారు.
ఆంధ్రప్రదేశ్ NEET UG మెరిట్ జాబితాలో NEET 2025 రాష్ట్ర ర్యాంక్, విద్యార్థి పేరు, కేటగిరి, NEET 2025 పరీక్షలో పొందిన స్కోరు వంటి వివరాలు ఉన్నాయి. రాష్ట్రంలో NEET UG కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ జూలై 28, 2025 నుంచి ఆగస్టు 2, 2025 వరకు (ఆలస్య ఫీజు లేకుండా) జరుగుతోంది. ర్యాంక్ జాబితా విడుదలైన వెంటనే విద్యార్థులు ఎంపికలను పూరించవచ్చు మరియు కేటాయింపు ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ దిగువున మరిన్ని వివరాలు అందించాం.
ఆంధ్రప్రదేశ్ NEET UG మెరిట్ జాబితా 2025 విడుదల తేదీలు (Andhra Pradesh NEET UG Merit List 2025 Release Dates)
AP NEET UG మెరిట్ జాబితా 2025 ఈవెంట్ తేదీ, వివరాలను ఈ దిగువ పట్టిక నుండి చూడవచ్చు.
ఈవెంట్ | తేదీ |
---|---|
ఆంధ్రప్రదేశ్ NEET UG 2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం నోటిఫికేషన్ | జూలై 7, 2025 |
ఆంధ్రప్రదేశ్ NEET UG 2025 కౌన్సెలింగ్ దరఖాస్తు ప్రారంభ తేదీ | జూలై 28, 2025 |
ఆంధ్రప్రదేశ్ NEET UG 2025 కౌన్సెలింగ్ దరఖాస్తు ముగింపు తేదీ | ఆగస్టు 2, 2025 |
తెలంగాణ NEET UG మెరిట్ జాబితా విడుదల తేదీ | ఆగస్టు 2025 మొదటి వారం |
తెలంగాణ NEET ప్రొవిజనల్ మెరిట్ జాబితాపై అభ్యంతర విండో | ఆగస్టు 2025 |
తెలంగాణ NEET ఫైనల్ మెరిట్ జాబితా విడుదల తేదీ | ఆగస్టు 2025 |
ఇది కూడా చదవండి: AP NEET కౌన్సెలింగ్ 2025
ఆంధ్రప్రదేశ్ NEET UG 2025 మెరిట్ లిస్ట్ లింక్ (Andhra Pradesh NEET UG 2025 Merit List Link)
ఆంధ్రప్రదేశ్ NEET UG 2025 తాత్కాలిక మెరిట్ జాబితా PDF లింక్ దిగువున యాక్టివేట్ చేయబడుతుంది:
ఈవెంట్ | డౌన్‌లోడ్ లింక్ |
---|---|
ఆంధ్రప్రదేశ్ NEET UG 2025 మెరిట్ జాబితా | విడుదల కానుంది |
ఆంధ్రప్రదేశ్ NEET UG మెరిట్ జాబితా 2025 లో పేర్కొన్న వివరాలు (Details Mentioned in Andhra Pradesh NEET UG Merit List 2025)
AP NEET UG మెరిట్ జాబితా 2025 లో పేర్కొన్న వివరాలు:
- విద్యార్థి పేరు
- NEET UG 2025 రాష్ట్ర ర్యాంక్
- 2025 నీట్ పరీక్షలో వచ్చిన మార్కులు
- విద్యార్థుల NEET 2025 రోల్ నెంబర్
AP NEET UG మెరిట్ జాబితా 2025 విడుదలైన తర్వాత ఏమిటి? (What After AP NEET UG Merit List 2025 Is Released?)
AP NEET UG మెరిట్ జాబితా 2025 విడుదలైన తర్వాత తదుపరి దశలు ఏమిటో చూడండి:
ఆంధ్రప్రదేశ్ NEET మొదటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదలైన తర్వాత, డాక్టర్ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అభ్యంతర విండోను సక్రియం చేస్తుంది.
అభ్యంతరాల విండో ముగిసిన వెంటనే AP ఫైనల్ NEET మెరిట్ జాబితా రూపొందించబడుతుంది.
NEET UG 2025 స్కోరు, మెరిట్ లిస్ట్, సీట్ల లభ్యత ఆధారంగా, విద్యార్థులకు సీటు కేటాయించబడుతుంది.
ఆంధ్రప్రదేశ్ వైద్య కళాశాలలో సీటు కేటాయించిన విద్యార్థి నిర్ణీత సమయంలోపు సంబంధిత కళాశాలకు రిపోర్ట్ చేసి, వారి అడ్మిషన్‌ను నిర్ధారించుకోవాలి.
తాత్కాలిక తెలంగాణ NEET UG మెరిట్ లిస్ట్ 2025 ఆగస్టు 2025 మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. AP NEET UG కౌన్సెలింగ్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి చివరి తేదీ ఆగస్టు 2, 2025 (ఆలస్య ఫీజు లేకుండా). ఆలస్య ఫీజుతో AP NEET UG మెరిట్ జాబితా 2025 రిజిస్ట్రేషన్‌ను ఆగస్టు 3, 2025 నుండి ఆగస్టు 4, 2025 వరకు పూర్తి చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ NEET UG 2025 ఫైనల్ మెరిట్ లిస్ట్ 2025 ఆగస్టు మధ్యలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.