AP SSC కాంపోజిట్ తెలుగు ఛాప్టర్ వైజ్ వెయిటేజీ మార్కులు 2026, బ్లూప్రింట్
ఏపీ 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థుల కోసం ఇక్కడ ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం కాంపోజిట్ తెలుగు ప్రశ్నాపత్రం గురించి వివరంగా అందించాం.
AP SSC కాంపోజిట్ తెలుగు ఛాప్టర్ వైజ్ వెయిటేజీ మార్కులు 2026 (AP SSC Composite TELUGU Chapter wise Weightage Marks 2026) :
10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థులు సిలబస్‌లో ముఖ్యమైన అంశాలను రివిజన్ చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది విద్యార్థులు సబ్జెక్టుల వైజ్ తమ స్టడీ ప్లానింగ్‌లో రివిజన్ మొదలుపెట్టి ఉంటారు. తమ స్టడీలో భాగంగా విద్యార్థులు ప్రశ్నాపత్రాలపై కూడా అవగాహనతో ఉండాలి. ప్రశ్నాపత్రంలో ఏ ఛాప్టర్‌కు ఎన్ని మార్కులు ఉంటాయి. ఎలాంటి ప్రశ్నలను అడిగే అవకాశం ఉంటుందో కచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ కాంపోజిట్ తెలుగు ప్రశ్నాపత్రం గురించి తెలియజేశాం.
10వ తరగతికి సంబంధించిన AP SSC కాంపోజిట్ తెలుగు అధ్యాయాల వారీగా వెయిటేజ్ గద్యం, కవిత్వం, పాఠాలు, వ్యాకరణం (భాషాంశాలు), సృజనాత్మక రచన వంటి విభాగాలలో వివిధ రకాల ప్రశ్నలు ఉంటాయి. అంటే వ్యాసం, దీర్ఘ సమాధానం, సంక్షిప్త సమాధానం, లక్ష్య ప్రశ్నలు ఉంటాయి. భాషాంశాలు (వ్యాకరణం) వంటి విభాగాలు తరచుగా అధిక మార్కులను కలిగి ఉంటాయి. పద్య, గద్య విభాగాలు గ్రహణశక్తి, వ్యక్తీకరణను పరీక్షిస్తాయి.మేము AP SSC బ్లూప్రింట్‌తో సహా ప్రశ్నాపత్రం విధానాన్ని అందించాం. అలాగే మోడల్ పేపర్‌తో పాటు ప్రశ్నాపత్ర బ్లూప్రింట్‌ని ఇక్కడ అందించాం.
AP SSC కాంపోజిట్ తెలుగు ఛాప్టర్ల వారీగా వెయిటేజ్ మార్కులు 2026 (AP SSC CompositeTelugu Chapter-Wise Weightage Marks 2026)
AP SSC కాంపోజిట్ తెలుగు వెయిటేజ్ 2026 మార్కుల విధానాన్ని ఈ దిగువున ఉన్న పట్టికలో అందించాం.
క్రమసంఖ్య | విద్యా ప్రమాణాలు | మార్కులు | శాతం |
1. | అవగాహన-ప్రతి స్పందన | 20 | 29 శాతం |
2. | వ్యక్తీకరణ - సృజనాత్మకత | 36 | 51 శాతం |
3 | భాషాంశాలు | 14 | 20 శాతం |
మొత్తం | 70 | 100 శాతం |
క్రమసంఖ్య | విషయం | మార్కులు | శాతం |
1 | పద్యభాగం | 24 | 34 |
2 | గద్యభాగం | 20 | 29 |
3 | ఉపవాచకం | 12 | 17 |
4 | భాషాంశాలు | 14 | 20 |
మొత్తం | 70 | 100 |
సంఖ్య | ప్రశ్నల స్వరూపం | ప్రశ్నల సంఖ్య | మార్కులు | మొత్తం మార్కులు | శాతం |
1 | వ్యాసరూప ప్రశ్నలు | 5 | 8 | 40 | 57 |
2 | లఘు ప్రశ్నలు | 4 | 4 | 16 | 23 |
3 | అతి లఘు ప్రశ్నలు | 7 | 1 | 7 | 10 |
4 | లక్ష్యాత్మక ప్రశ్నలు | 7 | 1 | 7 | 10 |
మొత్తం | 23 | 70 | 100 |
AP SSC కాంపోజిట్ తెలుగు 2026 బ్లూప్రింట్ PDF
AP SSC కాంపోజిట్ 2026 బ్లూప్రింట్ PDF ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా వెళ్లవచ్చు
ఇతర సబ్జెక్టులకు AP SSC వెయిటేజ్ 2026
