తెలంగాణ NEET UG మెరిట్ లిస్ట్ 2025 విడుదల తేదీ, PDF డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ NEET మెరిట్ లిస్ట్ 2025 ఆగస్టు 2025 మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ర్యాంక్ జాబితాలో పొందిన ర్యాంక్ ఆధారంగా విద్యార్థులను రాష్ట్ర కౌన్సెలింగ్‌కు ఆహ్వానిస్తారు.
తెలంగాణ NEET UG మెరిట్ లిస్ట్ 2025 (Telangana NEET UG Merit List 2025) : తెలంగాణ NEET UG మెరిట్ లిస్ట్ 2025 ఆగస్టు 2025 మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ర్యాంక్ జాబితాను (Telangana NEET UG Merit List 2025) తెలంగాణలో 85 శాతం రాష్ట్ర కోటా కింద ప్రవేశం కల్పించడానికి పరిశీలిస్తారు. తెలంగాణ ప్రొవిజనల్ మెరిట్ జాబితా ముందుగా విడుదల చేయబడుతుంది. దీనిపై విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. అభ్యంతరాలు వచ్చిన ఆధారంగా ఫైనల్ తెలంగాణ NEET మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేయబడతుంది. జూలై 16 నుండి జూలై 25, 2025 వరకు అభ్యర్థులు తెలంగాణ నీట్ కౌన్సెలింగ్ 2025 కోసం నమోదు చేసుకోవడానికి అనుమతించబడ్డారు. తెలంగాణ NEET ర్యాంక్ జాబితా 2025లో కౌన్సెలింగ్ ప్రక్రియకు విజయవంతంగా నమోదు చేసుకున్న విద్యార్థుల పేర్లు మాత్రమే ఉంటాయి.
తెలంగాణ NEET UG మెరిట్ జాబితా 2025 విడుదల తేదీలు (Telangana NEET UG Merit List 2025 Release Dates)
తెలంగాణ NEET UG మెరిట్ జాబితా 2025 (Telangana NEET UG Merit List 2025) విడుదలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను దిగువున ఇచ్చిన టేబుల్లో చూడండి.
ఈవెంట్ | తేదీ |
---|---|
తెలంగాణ NEET UG 2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం నోటిఫికేషన్ | జూలై 15, 2025 |
తెలంగాణ NEET UG 2025 కౌన్సెలింగ్ అప్లికేషన్ | జూలై 16, 2025 నుండి జూలై 25, 2025 వరకు |
ప్రొవిజనల్ తెలంగాణ NEET మెరిట్ లిస్ట్ 2025 విడుదల తేదీ | ఆగస్టు మొదటి వారం, 2025 |
ప్రొవిజనల్ తెలంగాణ NEET మెరిట్ లిస్ట్ 2025 పై అభ్యంతరాలు స్వీకరించే తేదీలు | ఆగస్టు 2025 |
తుది తెలంగాణ మెరిట్ జాబితా 2025 విడుదల తేదీ | ఆగస్టు 2025 |
తెలంగాణ NEET UG 2025 మెరిట్ జాబితా లింక్ (Telangana NEET UG 2025 Merit List Link)
తెలంగాణ NEET UG మెరిట్ జాబితా 2025 PDF లింక్ దిగువున షేర్ చేయబడుతుంది:
ఈవెంట్ | డౌన్‌లోడ్ లింక్ |
---|---|
తెలంగాణ NEET UG 2025 మెరిట్ జాబితా | త్వరలో విడుదల కానుంది |
ఇది కూడా చదవండి: తెలంగాణకు నీట్ 2025 కటాఫ్
తెలంగాణ NEET UG మెరిట్ జాబితా 2025 వివరాలు (Details on Telangana NEET UG Merit List 2025)
తెలంగాణ NEET UG మెరిట్ జాబితా 2025 లో పేర్కొన్న వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
- విద్యార్థి పేరు
- NEET UG 2025 ర్యాంక్
- రాష్ట్ర నీట్ ర్యాంక్
- 2025 నీట్ పరీక్షలో వచ్చిన మార్కులు
- విద్యార్థుల NEET రోల్ నెంబర్
- విద్యార్థి జెండర్
- విద్యార్థుల కేటగిరి
తెలంగాణ NEET UG మెరిట్ జాబితా 2025 విడుదలైన తర్వాత ఏమిటి? (What After Telangana NEET UG Merit List 2025 is Out?)
తెలంగాణ NEET UG మెరిట్ జాబితా 2025 విడుదలైన తర్వాత అనుసరించే ప్రక్రియను చూడండి:
తెలంగాణ NEET UG మొదటి ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదలైన తర్వాత KNRUHS (పరీక్ష నిర్వహణ అధికారం) దానిపై అభ్యంతరాలను ఆహ్వానిస్తుంది.
విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను తయారు చేస్తారు.
విద్యార్థులు రాష్ట్ర ఎంపిక ప్రక్రియలో పాల్గొనాలి.
NEET UG 2025 స్కోరు, తెలంగాణ NEET ర్యాంక్, మెరిట్ లిస్ట్, సీట్ల లభ్యత ఆధారంగా సీట్లు కేటాయించబడతాయి.
విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేసి గడువులోపు సీట్లు పొందాలి.