తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ లింక్ (TS Inter Hall Ticket 2025 Download Link)
తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ల (TS Inter Hall Ticket 2025 Download Link) డౌన్‌లోడ్ లింక్‌ని ఇక్కడ అందించాం. పరీక్ష రోజున విద్యార్థులు పాటించాల్సిన వివరాలను ఈ దిగువున అందించడం జరిగింది.
తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ లింక్ (TS Inter Hall Ticket 2025 Download Link) :
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థుల కోసం తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్
tsbie.cgg.gov.in
లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 5న ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరుకావడానికి విద్యార్థులకు ఈ హాల్ టికెట్లు తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు కచ్చితంగా హాల్ టికెట్లను తీసుకెళ్లాలి. అంతేకాదు హాల్ టికెట్లో ఎటువంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. తప్పులుంటే వెంటనే సరి చేయించుకోవాలి. లేదంటే పరీక్షా హాల్లోకి అనుమతించరు.
తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ లింక్ (TS Inter Hall Ticket 2025 Download Link)
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి |
తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి |
TSBIE హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ చేసుకునే విధానం (Steps to Download TSBIE Hall Ticket 2025)
తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అవ్వండి..- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను t sbie.cgg.gov.in సందర్శించాలి.
- హోంపేజీలో "డౌన్‌లోడ్ హాల్ టికెట్స్ ఐపీఈ మార్చి 2025 ” అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ సంవత్సరాన్ని (మొదటి సంవత్సరం లేదా రెండో సంవత్సరం) ఎంచుకోవాలి.
- హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వంటి మీ లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి.
- మీ హాల్ టికెట్ చూడటానికి “Submit” పై క్లిక్ చేయాలి.
- పరీక్ష రోజు హాల్ టికెట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
- ప్రత్యామ్నాయంగా, విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను వారి సంబంధిత పాఠశాలల నుంచి తీసుకోవచ్చు, అక్కడ వారు ప్రధానోపాధ్యాయుడు లేదా ప్రిన్సిపాల్‌లో స్టాంప్ వేసి, సంతకం చేసి హాల్ టికెట్లను పొందవలసి ఉంటుంది.
తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్ 2025పై ఉండే వివరాలు (Details Mentioned on TS Inter Hall Ticket 2025)
తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ 2025 వంటి ముఖ్యమైన సమాచారం ఇక్కడ అందించడం జరిగింది.- విద్యార్థి పేరు, రోల్ నెంబర్
- పరీక్షా కేంద్రం పేరు, చిరునామా
- సబ్జెక్ట్ కోడ్‌లు, పరీక్ష తేదీలు
- పరీక్ష సమయాలు
- పరీక్ష రోజు ముఖ్యమైన సూచనలు
తెలంగాణ ఇంటర్మీడియ్ హాల్ టికెట్ 2025 – ముఖ్యాంశాలు (TS Inter Hall Ticket 2025 – Highlights)
తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్‌లకు 2025 సంబంధించిన ముఖ్యాంశాల గురించి ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది.వివరాలు | వివరాలు |
పరీక్ష నిర్వహణ సంస్థ | తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TSBIE) |
పరీక్ష పేరు | TS ఇంటర్ 1వ సంవత్సరం & 2వ సంవత్సరం పరీక్షలు 2025 |
కేటగిరి | హాల్ టికెట్ / అడ్మిట్ కార్డ్ |
స్థితి | విడుదలైంది |
తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్ విడుదల తేదీ | మార్చ్ 2, 2025 |
తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష తేదీ 2025 | మార్చి 5 నుండి మార్చి 24, 2025 వరకు |
తెలంగాణ ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష తేదీ 2025 | మార్చి 6 నుండి మార్చి 25, 2025 వరకు |
ఇంటర్ హాల్ టికెట్ లభ్యత విధానం | ఆన్‌లైన్ |
అవసరమైన లాగిన్ ఆధారాలు | యూజర్ పేరు, పాస్‌వర్డ్ |
అధికారిక వెబ్‌సైట్ | https://tsbie.cgg.gov.in/ www.tsbie.cgg.gov.in ద్వారా |
TS ఇంటర్ హాల్ టికెట్ 2025 ముఖ్యమైన సూచనలు (TS Inter Hall Ticket 2025 Important Instructions)
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష రోజున విద్యార్థులు పాటించాల్సిన సూచనలు ఈ దిగువున అందించాం.- పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్ ప్రింట్ కాపీని తీసుకెళ్లాలి. హాల్ టికెట్ లేకుండా ప్రవేశం అనుమతించబడదు.
- పరీక్ష రోజు ముందు హాల్ టికెట్‌లోని అన్ని వివరాలను ధ్రువీకరించాలి.
- నిర్ణీత సమయానికి కనీసం 30 నిమిషాల ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
- హాల్ టికెట్‌లో పేర్కొన్న అన్ని COVID-19 మార్గదర్శకాలను, ఇతర సూచనలను పాటించాలి.
తెలంగాణ మొదటి సంవత్సరం 2025 టైమ్ టేబుల్ (TS 1st Year Exams 2025 Time Table)
తెలంగాణ మొదటి సంవత్సరం 2025 టైమ్ టేబుల్‌ని ఈ దిగువున పట్టికలో అందించాం.పరీక్షా తేదీ | సబ్జెక్ట్ |
05-03-2025 | పార్ట్ 2 సెకండ్ లాంగ్వేజ్ |
07-03-2025 | పార్ట్ 1 ఇంగ్లీష్ పేపర్ |
11-03-2025 | మ్యాథ్స్ పేపర్ 1 ఏ, బోటని పేపర్ -1, పొలిటికల్ సైన్స్ పేపర్ -1 |
13-03-2025 | మ్యాథ్స్ పేపర 1బీ, జువాలజి పేపర్ -1, హిస్టరీ పేపర్ -1 |
17-03-2025 | ఫిజిక్స్, ఎకనామిక్స్ |
19-03-2025 | కెమిస్ట్రీ, కామర్స్ |
21-03-2025 | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1 |
24-03-2025 | మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -1, జాగ్రఫీ పేపర్ -1 |