త్వరలో TG TET ఫలితాలు 2026 విడుదల, డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ చూడండి
TG TET ఫలితాలు 2026 (TG TET Results 2026) ఫిబ్రవరి 10 నుంచి 16 తేదీల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో రిలీజ్ అయ్యే ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ వివరంగా అందించాం.
TG TET ఫలితాలు 2026 (TG TET Results 2026) :తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ, ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్య TG TET 2026 పరీక్షా ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. TG TET ఫలితాలు 2025 అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.in/tgtetలో చూడవచ్చు. TG TET ఫలితాలు 2025 తెలంగాణ ఫలితాన్ని చెక్ చేయడానికి డౌన్‌లోడ్ లింక్ ఈ పేజీలో అందించబడుతుంది. అభ్యర్థులు TG TET హాల్ టికెట్ నెంబర్ లేదా జర్నల్ నెంబర్, పుట్టిన తేదీ వంటి లాగిన్ వివరాలను ఉపయోగించి వారి ఫలితాలను చెక్ చేయవచ్చు. TG TET ఫలితాలు 2026తో పాటు TG TET స్కోర్‌కార్డ్ కూడా అందుబాటులో ఉంచబడింది. ఇది పరీక్షలో అభ్యర్థులు పొందిన మార్కులను కలిగి ఉంటుంది. మొదటి సెషన్ TG TET 2026 పరీక్ష జనవరి 3 నుంచి 31, 2026 మధ్య జరిగింది. ఫలితాలతో పాటు TG TET ఫైనల్ కీ విడుదల చేయబడుతుంది.
తెలంగాణ TET ఫలితం 2026: డైరెక్ట్ లింక్ (Telangana TET Result 2026: Direct Link)
TG TET ఫలితాలు 2026ను అతి త్వరలోతెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈలోపు అధికారిక వెబ్‌సైట్‌లో TG TET ఆన్సర్ కీ (ఫైనల్) కూడా విడుదల చేస్తుంది. ప్రొవిజనల్ ఆన్సర్ కీ తర్వాత, అభ్యర్థుల కోసం అభ్యంతర విండో కూడా యాక్టివేట్ చేస్తుంది. అభ్యర్థులు పరీక్ష ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలియజేయవచ్చు. NCERT నుంచి చెల్లుబాటయ్యే ప్రూఫ్ లేదా బోర్డు సిఫార్సు చేసిన పుస్తకాలతో మాత్రమే ఆన్సర్ కీపై అభ్యంతరాలను బోర్డు అంగీకరిస్తుంది.
తెలంగాణ TET ఫలితాల లింక్ 2026 (అప్‌డేట్ చేయబడుతుంది) |
TG TET 2026 ఫలితాలను ఎలా చెక్ చేయాలి? (How to Check TSTET Results 2026?)
TG TET ఫలితాలు ఆన్‌లైన్‌లో మాత్రమే ప్రకటించబడుతుంది. నియామకం కోసం TET అర్హత సర్టిఫికెట్ల చెల్లుబాటు వ్యవధి జీవితకాలం చెల్లుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్షలో TET స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఇవ్వబడుతుంది. జనరల్‌కు అర్హత మార్కులు 60 శాతం, BCకి 50 శాతం, SC, STకి 40 శాతం. TG TET ఫలితాలను చెక్ చేసుకునే విధానం ఈ దిగువున చూడొచ్చు.ముందుగా అభ్యర్థులు TG TET వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
హోంపేజీలో ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి.
అనంతరం హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేయాలి.
తర్వాత 'ఫలితాలను పొందండి' బటన్ పై క్లిక్ చేయాలి.
TG TET ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
TG TET ఫలితాలు 2026: ముఖ్యమైన అంశాలు (TG TET Result 2026: Important Points)
TG TET ఫలితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఈ దిగువున వివరంగా అందించాం.TG TET అర్హత సాధించిన అభ్యర్థులకు నేరుగా ఉద్యోగాలు లభించవు.
అభ్యర్థులు తెలంగాణలోని వివిధ పాఠశాలల్లో బోధనా ఉద్యోగాలకు పోస్టింగ్ పొందడానికి అర్హత ప్రమాణాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థులు పేపర్ 1, పేపర్ 2 TSTET పరీక్షలకు హాజరు కానవసరం లేదు.
TG TET అర్హత మార్కులు 2026 (TG TET Qualifying Marks 2026)
TG TET ఒక అర్హత పరీక్ష. అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీస అర్హత మార్కులను పొందాలి. క్రిందTS TET అర్హత మార్కులనుచూడండి.
కేటగిరి | ఉత్తీర్ణత మార్కులు |
|---|---|
జనరల్ | 60 శాతం అంతకంటే ఎక్కువ |
BC | 50 శాతం అంతకంటే ఎక్కువ |
SC, ST, PWD | 40 శాతం అంతకంటే ఎక్కువ |
TG TET స్కోర్ కార్డ్ 2026 (TG TET Score Card 2026)
TG TET స్కోర్ కార్డ్ 2026నుతెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తుంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.TG TET స్కోర్‌కార్డ్‌లోఅభ్యర్థి పరీక్షలో పొందిన కచ్చితమైన మార్కులు ఉంటాయి. మార్కులతో పాటు ఈ దిగువున అందించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ చూడొచ్చు.
పేరు
పుట్టిన తేదీ
కేటగిరి
పరీక్షలో వచ్చిన మార్కులు
- పరీక్ష అర్హత స్థితి
TG TET 2026 హైలెట్స్, టైమ్ లైన్ (TG TET 2026 Highlights & Timeline)
TG TET 2026 ముఖ్యమైన తేదీలు, వివరాలు ఈ దిగువున టేబుల్లో అందించాం.ఈవెంట్లు | తేదీలు |
TG TET 2026 పరీక్ష వ్యవధి | జనవరి 3, 2026 - జనవరి 31, 2026. |
TG TET 2026 ఫలితాల తేదీ | ఫిబ్రవరి 10 - ఫిబ్రవరి 16, 2026 (అంచనా) |
అధికారిక వెబ్‌సైట్ | https://tgtet.aptonline.in/tgtet/. |
TG TET 2026 ఆన్సర్ కీ విడుదల తేదీ | జనవరి చివరి వారంలో 2026 (అంచనా) |