AIIMS హైదరాబాద్ బీబీనగర్ NEET కటాఫ్ 2025 ఎంత?
MBBS కోర్సుల్లో ప్రవేశాల కోసం AIIMS హైదరాబాద్ (బీబీ నగర్) NEET కటాఫ్ 2025ను (AIIMS Bibinagar Expected neet cutoff 2025) NTA త్వరలో విడుదల చేస్తుంది. ఇక్కడ అంచనాగా NEET కటాఫ్ వివరాలను అందించాం.
AIMS హైదరాబాద్ NEET అంచనా కటాఫ్ 2025 (AIIMS Bibinagar Expected neet cutoff 2025) :
MBBS కోర్సుల్లో ప్రవేశాల కోసం AIIMS హైదరాబాద్ (బీబీ నగర్) NEET కటాఫ్ 2025ను NTA త్వరలో విడుదల చేస్తుంది. హైదరాబాద్‌లోని బీబీ నగర్ AIMSలో ప్రవేశాల కోసం చాలామంది అభ్యర్థులు ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో NEET 2025 ఫలితాలు విడుదలైన తర్వాత AIIMS హైదరాబాద్ NEET కటాఫ్ AIIMS Bibinagar Expected neet cutoff 2025)
ఎలా ఉండబోతుందో ఇక్కడ అందించాం. అన్ని కేటగిరీలకు NEET 2025 కటాఫ్ వివరాలను అంచనాగా మాత్రమే అందించాం. ఇవి కేవలం అంచనా మాత్రమేనని వాస్తవ కటాఫ్ మారే అవకాశం ఉంటుందని అభ్యర్థులు గమనించాలి.
AIIMS కోసం NEET 2025 కటాఫ్ విద్యార్థుల కేటగిరి, కాలేజీల ఆధారంగా మారుతుంటుంది. అందుకే AIIMS కాలేజీల NEET పరీక్ష కటాఫ్ ప్రతి కేటగిరికి, ప్రతి కాలేజీకి విడి విడిగా విడుదలవుతాయ. AIIMSలో NEET 2025 కటాఫ్ స్కోర్‌ను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తుంది. ఈ ఏడాది NEET 2025 పరీక్ష కష్టంగా ఉందని నిపుణులు, విద్యార్థులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కటాఫ్ చాలా కీలకంగా మారబోతుంది. ఈ మేరకు కటాఫ్ వివరాల్లో చాలా మార్పు కూడా ఉంటుందదని నిపుణులు, అభ్యర్థులు కూడా భావిస్తున్నారు.
కేటగిరీల వారీగా ఎయిమ్స్ బీబీ నగర్ అంచనా కటాఫ్ 2025 (Category Wise AIIMS Bibinagar Expected NEET Cutoff 2025)
NEET 2025 ఫలితాలు విడుదలైన తర్వాత ఎయిమ్స్ బీబీనగర్ NEET కటాఫ్ 2025 కూడా విడుదల చేస్తుంది. NEET 2025కి హాజరైన అభ్యర్థులు ఇక్కడ కేటగిరీల వారీగా AIIMS బీబీ నగర్ అంచనా కటాఫ్ 2025ని తెలుసుకోవచ్చు . ఈ దిగువున ఆ వివరాలు పట్టికలో ఆ వివరాలు చూడవచ్చు. ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో ఇచ్చిన కటాఫ్ వివరాలు అంచనా మాత్రమేనని అభ్యర్థులు గుర్తించాలి.
కేటగిరి | అంచనా కటాఫ్ |
జనరల్ కేటగిరి | 700+ |
OBC | 695+ |
EWS | 692+ |
SC | 660+ |
ST | 650+ |
AIIMS మంగళగిరి క్వాలిఫైయింగ్ కటాఫ్ 2024 (AIIMS Mangalagiri Qualifying Cutoff 2024)
గత ఏడాది AIIMS మంగళగిరి క్వాలిఫైయింగ్ కటాఫ్ వివరాలు ఈ దిగువున అందించాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
కేటగిరి | NEET UG 2024 కటాఫ్ మార్కులు |
---|---|
జనరల్ కేటగిరి | 720 నుంచి 164 |
OBC | 163 నుంచి 146 |
SC | 163 నుంచి 129 |
ST | 163 నుంచి 129 |
EWS | 163 నుంచి 129 |
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.