JEE మెయిన్ 2026 అడ్మిట్ కార్డులు పొందాలంటే ఇది చేయాల్సిందే..!
JEE మెయిన్ 2026 అడ్మిట్ కార్డులు త్వరలో విడుదలకానున్నాయి. జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈసారి అడ్మిట్ కార్డులను పొందడానికి వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి.
JEE Main 2026 అడ్మిట్‌కార్డులు (JEE Main 2026 Admit Card) :
సెషన్ 1 JEE Main 2026 రాత పరీక్షలు పరీక్ష జనవరి 21న ప్రారంభమై జనవరి 30, 2026న ముగుస్తాయి. పరీక్ష రెండు షిఫ్టులలో జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. అతి త్వరలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిటి ఇంటిమేషన్ స్లిప్‌ను విడుదల చేయనుంది. అలాగే అడ్మిట్‌కార్డులు రాత పరీక్షలు కొన్ని రోజులకు ముందు జనవరి 16, 17 తేదీల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సిటి ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డులు JEE అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in, nta.ac.inలో కూడా అందుబాటులో ఉంటాయి.
అయితే JEE మెయిన్ అడ్మిట్‌కార్డులను 2026 పొందాలంటే మాత్రం ఈసారి అభ్యర్థులు కచ్చితంగా ఒక పనిచేయాల్సి ఉంటుంది. అదే ఐడెంటిటీ వెరిఫికేషన్. ఇది చేయకపోతే అడ్మిట్ కార్డులను పొందండం కష్టం అవుతుంది. ఈ విషయాన్ని ఇటీవలె NTA ప్రకటించింది. ఈ వెరిఫికేషన్ కోసం జనవరి 15, 2026వ తేదీ వరకు అవకాశం ఉంది. ఈలోపే అభ్యర్థులు పూర్తి చేయాలి.
జేఈఈ మెయిన్ 2026 కోసం వేలాది సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే కొందరు అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ఫోటోలు, వారి ఆధార్ రికార్డుల్లో ఉన్న ఫోటోలకు తేడాలు ఉన్నట్టు అధికారులు గుర్తించరు. ఆధారే కాకుండా ఇతర గుర్తింపు కార్డులను అప్‌లోడ్ చేసిన అభ్యర్థుల్లో కూడా ఇదే సమస్య ఉన్నట్టు గమనించారు. దీంతో వారి వివరాలను అభ్యర్థులు కచ్చితంగా ధ్రువీకరణ చేసుకోవాల్సి ఉంది. ఫోటోలు మిస్ మ్యాచ్‌గా ఉన్నవాళ్లు గెజిటెడ్ అధికారుల నుంచి గుర్తింపు ధ్రువీకరణ తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది.
JEE మెయిన్ 2026 - ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి?
జేఈఈ మెయిన్ 2026 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్‌లో ఇచ్చిన ఫోటోలు, వారి గుర్తింపు కార్డులో ఉన్న ఫోటోలకు పొంతన లేకపోతే అభ్యర్థులు కచ్చితంగా ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవాలి. దీనికోసం గెజిటెడ్ 1 ఆఫీసర్లు అంటే తహసీల్దార్లు, రెవెన్యూ ఆఫీసర్లు, SDM, DM వీరిలో ఎవరితోనైనా పత్రాలని ధ్రువీకరించుకోవాలి. NRI అభ్యర్థులు భారత రాయబార కార్యాలయ గెజిటెడ్ అధికారుల సంతకం తీసుకుంటే సరిపోతుంది. అంతేకాదు ఎగ్జామ్ రోజు అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులతో పాటు తమ ఒరిజినల్ గుర్తింపు కార్డులను ఫిజికల్‌గా అభ్యర్థులు తీసుకెళ్లాలి. మరిన్ని వివరాల కోసం NTA హెల్ప్‌లైన్ నెంబర్లు 011-40759000 లేదా 011-69227700 లను సంప్రదించవచ్చు. లేదా jeemain@nta.ac.inకి కూడా ఈ మెయిల్ పంపవచ్చు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.