JoSAA 2025 రౌండ్ -1 సీట్ కేటాయింపు విడుదల తేదీ
JoSAA 2025 రౌండ్‑1 సీట్ కేటాయింపు ఫలితాలు జూన్ 14, 2025 ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి.విద్యార్థులు josaa.nic.inలో లాగిన్ అయి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.పూర్తి సమాచారం (JoSAA 2025 Round-1 Seat Allotment Release Date)ఇక్కడ అందించాము.
JoSAA 2025 రౌండ్ -1 సీట్ కేటాయింపు విడుదల తేదీ(JoSAA 2025 Round-1 Seat Allotment Release Date): JoSAA 2025 రౌండ్‑1 సీట్ కేటాయింపు ఫలితాలను జూన్ 14, 2025 ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్‌సైట్ అయిన josaa.nic.in లో విడుదల చేయనున్నారు. JEE మెయిన్స్ లేదా అడ్వాన్స్‌డ్ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు NITs, IIITs, IITs ,ఇతర ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కేటాయించబడతాయి. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి తాత్కాలిక కేటాయింపు లేఖ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం నిర్ణీత ఫీజును చెల్లించి, అవసరమైన డాక్యుమెంట్లను జూన్ 18 లోపు అప్లోడ్ చేయాలి.
JoSAA 2025 ముఖ్యమైన తేదీలు(JoSAA 2025 Important Dates)
ఈ క్రింద టేబుల్ పట్టికలో ఉన్న తేదీలను అనుసరించి మీ ఎంపికల లాకింగ్, సీటు ఫలితాలు, డాక్యుమెంట్లు అప్లోడ్ పనులను సకాలంలో పూర్తి చేయాలి. ఇది కౌన్సెలింగ్‌లో సీటు కోల్పోకుండా ఉండేందుకు ముఖ్యమైన దశ
వివరాలు | తేదీలు |
JoSAA 2025 మాక్ కేటాయింపు -1 | జూన్ 9, 2025 |
JoSAA 2025 మాక్ కేటాయింపు -2 | జూన్ 11, 2025 |
ఎంపికలు (Choices) లాకింగ్ చివరి తేది | జూన్ 12, 2025 సాయంత్రం 5:00 గంటలు |
ఫైనల్ రౌండ్ -1 సీట్ అలాట్‌మెంట్ | జూన్ 14, 2025 ఉదయం 10:00 గంటలు |
సీటు కన్‌ఫర్మేషన్ కోసం ఫీజు చెల్లింపు, డాక్యుమెంట్ అప్‌లోడ్ | జూన్ 14 నుండి జూన్ 18, 2025 |
JoSAA 2025 సీట్ అలాట్‌మెంట్ తర్వాత చేయాల్సిన ముఖ్యమైన చర్యలు(Important steps to take after JoSAA 2025 seat allotment)
- ఫలితాలు చూడాలి,https://josaa.nic.in వెబ్‌సైట్‌కి వెళ్లి, JEE మెయిన్స్/అడ్వాన్స్‌డ్ హాల్‌టికెట్ నెంబర్, పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
- తాత్కాలిక సీట్ల కేటాయింపు లేఖ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- సీటు అంగీకారం (Accept) చేసేందుకు ఫీజు చెల్లించాలి (ఒకసారి మాత్రమే ₹35,000/₹15,000).
- అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
- ఆన్‌లైన్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి.
JoSAA 2025లో అవసరమైన డాక్యుమెంట్ల జాబితా(List of documents required in JoSAA 2025)
- JEE మెయిన్స్ / అడ్వాన్స్‌డ్ Admit Card
- ర్యాంక్ కార్డు
- 10వ ,12వ మార్క్స్‌మెమోలు
- కేటగిరీ సర్టిఫికెట్ (ఒకవేళ ఉంటే)
- ఫోటో, సిగ్నేచర్
- ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ (ఆధార్ వంటివి)
JoSAA 2025 కౌన్సెలింగ్‌లో ఎంపికలను మార్చుకునే చివరి అవకాశం జూన్ 12 వరకు మాత్రమే ఉంది. ఒకసారి ఎంపికలు లాక్ చేసిన తర్వాత, రౌండ్ -1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాల ప్రకారం మీరు Freeze, Float, లేదా Slide ఎంపికలు తీసుకోవచ్చు. Freeze అంటే మీరు కేటాయించిన సీటుతో సంతృప్తిగా ఉన్నారు. Float అంటే మంచి కాలేజ్ వస్తే మారేందుకు అవకాశం ఇవ్వడం. Slide అంటే అదే కాలేజ్‌లో మంచి బ్రాంచ్ వస్తే మారడం. చివరి తేదీకి ముందే ఎంపికలు లాక్ చేయకపోతే, సిస్టమ్ ఆటోమేటిగ్గా మీ చివరిగా సేవ్ చేసిన ఎంపికలను లాక్ చేస్తుంది. ముఖ్యంగా జూన్ 11న వచ్చే రెండవ Mock ఫలితాలను పరిశీలించి, మీ ప్రాధాన్యతల క్రమాన్ని సరిచూసుకోండి. రౌండ్-1 ఫలితాలు జూన్ 14న విడుదలయ్యాక, జూన్ 18లోపు ఫీజు చెల్లించడం, డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి. లేకపోతే మీ కేటాయించిన సీటు రద్దవుతుంది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.