NIFT అడ్మిషన్లు 2026, ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) 2026–27 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 13, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
NIFT అడ్మిసన్లు 2026 నోటిఫికేషన్ విడుదల (NIFT Admissions 2026 Notification Released): నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT ) 2026–27 విద్యా సంవత్సరానికి UG, PG, PhD ప్రోగ్రామ్లకు ప్రవేశాల గురించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది.దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 08 నుండి ప్రారంభమై , జనవరి 13,2026 వరకు కొనసాగుతుంది .ఆలస్య ఫీజు తో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు జనవరి 14 నుండి 16 ,2026 అవకాశం కల్పించారు.దేశవ్యాప్తంగా 20 నిఫ్ట్ క్యాంపస్‌లలో నాలుగు సంవత్సరాల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులుగా బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (B.Des) మరియు బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (B.FTech) అందుబాటులో ఉన్నాయి. ఫ్యాషన్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, యాక్సరీ డిజైన్, నిట్‌వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, లెదర్ డిజైన్, ఫ్యాషన్ ఇంటీరియర్స్ వంటి విభాగాలు ఉన్నాయి. అలాగే రెండేళ్ల పీజీ ప్రోగ్రామ్లలో మాస్టర్ ఆఫ్ డిజైన్ (M.Des), ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ మాస్టర్ (MFM), మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (M.FTech) కోర్సులు ఉన్నాయి, పరిశోధనలో ఆసక్తి ఉన్నవారికి PhD ప్రోగ్రామ్ కూడా అందిస్తోంది.
నిఫ్ట్ ప్రవేశ పరీక్ష విధానం అభ్యర్థి ఎంచుకున్న కోర్సుపై ఆధారపడి ఉంటుంది. B.Des, M.Des కోర్సులకు జనరల్ ఎబిలిటీ టెస్ట్ (GAT)తో పాటు క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ (CAT) ఉన్నాయి. B.FTech, M.FTech, MFM కోర్సులకు GAT మాత్రమే ఉంటుంది. కొన్ని కోర్సులలో వ్రాత పరీక్షతో పాటు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, సిచ్యుయేషన్ టెస్ట్ వంటి అదనపు దశలు కూడా ఉంటాయి. క్రెడిట్ ఆధారిత మార్కింగ్ లేదు, ప్రతి సరైన సమాధానానికి ఒకే ఒక మార్కు ఇవ్వబడుతుంది. UG ప్రోగ్రామ్లకు 01.08.2026 నాటికి గరిష్ఠ వయోపరిమితి 24 సంవత్సరాలు కాగా, మాస్టర్స్ మరియు PhD కోసం ఏ వయోపరిమితి లేదు.దరఖాస్తులో సవరణలు చేసుకునేందుకు జనవరి 18,19 తేదీల్లో అవకాశం ఉంటుంది.నిఫ్ట్ ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 08,2026న ఆఫ్ లైన్ లో నిర్వహించనున్నారు.
నిఫ్ట్ అడ్మిషన్స్ 2026 దరఖాస్తు లింక్ (NIFT Admissions 2026 Application Link)
నిఫ్ట్ 2026 UG, PG, PhD ప్రవేశాలకు దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్‌లో స్వీకరిస్తున్నారు. అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నిఫ్ట్ అడ్మిషన్లు 2026 ఆన్‌లైన్ దరఖాస్తు విధానం (NIFT Admissions 2026 Online Application Procedure)
నిఫ్ట్ 2026 UG, PG, PhD కోర్సుల దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఈ క్రింది విధముగా జరుగుతుంది.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ nift.ac.in లేదా exams.nta.ac.in/NIFT ను సందర్శించండి
- ఆ తరువాత NIFT Entrance Examination 2026 లింక్‌పై క్లిక్ చేయండి
- కొత్త అభ్యర్థులు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి
- లాగిన్ చేసి అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేయండి
- అవసరమైన వివరాలు నమోదు చేసి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి
- ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించండి
- అప్లికేషన్ ఫారమ్ సబ్మిట్ చేయండి
- భవిష్యత్ అవసరాలకు అప్లికేషన్ కాపీని సేవ్ లేదా ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.