TS TET ఆన్సర్ కీ విడుదల తేదీ 2026, కీ PDF లింక్, లైవ్ అప్‌డేట్లు
తెలంగాణ టెట్ ఆన్సర్ కీ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కొన్నిరోజుల విడుదల చేయనుంది. కాలేజ్ ధేఖో నిపుణుల అంచనా ప్రకారం ఈ నెల 25వ తేదీన రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన లైవ్ అప్‌డేట్లు ఇక్కడ అందించడం జరిగింది.
TG TET ఆన్సర్ కీ 2026 (TS TET Answer Key Release Date 2026 Live Updates) :తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ, పరీక్ష నిర్వహించిన కొద్ది రోజుల్లోనే తెలంగాణ టెట్ ఆన్సర్ కీని విడుదల చేయనుంది. కాలేజ్ ధేఖో నిపుణుల అంచనా ప్రకారం ఈ నెల 25వ తేదీన రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆలస్యమైన 26, 27వ తేదీల్లో రిలీజ్ అవుతుంది. TS TET పరీక్ష జనవరి 3 నుంచి 31, 2026 మధ్య నిర్వహించబడుతుంది. TS TET ఆన్సర్ కీ పేపర్ 1, 2 లకు విడిగా PDF రూపంలో అందుబాటులో ఉంచబడింది. TS TET కీ 2026 డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ ఈ పేజీలో అందించబడుతుంది.
TS TET పరీక్షలో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఆన్సర్ కీ PDFలో ఉంటాయి.TS TET కీరెండు దశల్లో విడుదల చేయబడుతుంది. ముందుగా ప్రొవిజనల్ ఆన్సర్ కీ, అనంతరం నిజమైన ఆన్సర్ కీని విడుదల చేయడం జరుగుతుంది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించడానికి పాఠశాల విద్యా శాఖ ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేస్తుంది. అభ్యర్థుల నుంచి వచ్చిన సవాళ్లను సమీక్షించిన తర్వాత TS TET ఫైనల్ ఆన్సర్ కీని(TG TET Answer Key 2026)విడుదల చేస్తారు.
TG TET కీ పేపర్ 2026ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download TS TET Key Paper 2026?)
TG TET పేపర్ 1 & 2 ఆన్సర్ కీలను డౌన్‌లోడ్ చేసుకునే ప్రక్రియ దిగువున అందించడం జరిగింది.
అభ్యర్థులు ముందుగా సంబంధిత అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.inకి వెళ్లాలి.
హోంపేజీలో “ఆన్సర్ కీ & రెస్పాన్స్ షీట్‌ను డౌన్‌లోడ్ చేయాలి” లేదా “TS TET 2026 ఆన్సర్ కీ” అని చెప్పే లింక్‌పై క్లిక్ చేయాలి.
మీరు రాసిన సరైన పేపర్ (పేపర్ 1 లేదా పేపర్ 2) సబ్జెక్టును (మ్యాథ్స్ & సైన్స్ లేదా సోషల్ స్టడీస్) ఎంచుకోవాలి.
ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ PDF ఫార్మాట్‌లో తెరుచుకుంటాయి. సూచన కోసం ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి సేవ్ చేయాలి.
మీ స్కోర్‌ను అంచనా వేయడానికి మీ సమాధానాలను అధికారిక సమాధానాలతో సరిపోల్చుకోవాలి.
మీకు ఏవైనా తేడాలు కనిపిస్తే, గడువు తేదీ (జూలై 8, 2026) లోపు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను సబ్మిట్ చేయాలి.
తెలంగాణ TET ఆన్సర్ కీ: అభ్యంతరాలను ఎలా లేవనెత్తాలి? (TSTET Key Challenge: How to Raise Objections?)
అభ్యర్థులు ఈ దిగువున ఇచ్చిన ప్రక్రియను ఉపయోగించి TG TET ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలియజేయవచ్చు.
అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి అభ్యంతరాలను వెల్లడించే లింక్‌ను గుర్తించాలి. అనంతరం దానిపై క్లిక్ చేయాలి.
అనంతరం ఓపెన్ అయ్యే పేజీలో అవసరమైన వివరాలను నమోదు చేయాలి.
అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసి, దానికి సంబంధించిన ఆధారాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
అనంతరం పేజీని సేవ్ చేయాలి.
సవాళ్లను స్వీకరించడానికి వారు కొంత ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది.
TS TET ఆన్సర్ కీ విడుదల తేదీ 2026 లైవ్ అప్‌డేట్లు
Jan 13, 2026 11:28 AM IST
TS TET స్కోర్‌కార్డులో ఏమి ఉంటాయి?
పేరు
పుట్టిన తేదీ
కేటగిరి
పరీక్షలో వచ్చిన మార్కులు
పరీక్ష అర్హత స్థితి
Jan 13, 2026 11:22 AM IST
TET సర్టిఫికెట్/మార్కుల మెమో చెల్లుబాటు
తెలంగాణ ప్రభుత్వం ఇతరత్రా నోటిఫై చేయకపోతే, నియామకం కోసం TET అర్హత సర్టిఫికెట్ల చెల్లుబాటు వ్యవధి జీవితాంతం చెల్లుబాటులో ఉంటుంది.
Jan 13, 2026 11:16 AM IST
TS TET పరీక్ష 2026 ఓవర్ వ్యూ
సంస్థ
తెలంగాణ పాఠశాల విద్యా శాఖ
పోస్ట్ పేరు
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET లేదా TG TET 2 2024)
ఆన్సర్ కీ స్థితి
త్వరలో విడుదల
అధికారిక వెబ్‌సైట్
tgtet2024.aptonline.in/tgtet
Jan 13, 2026 10:51 AM IST
TG TET 2026 ఆన్సర్ కీ ఏ వెబ్‌సైట్‌లో విడుదలవుతుంది?
TG TET 2026 ఆన్సర్ కీ అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.in లో విడుదలవుతుంది.
Jan 13, 2026 10:48 AM IST
TS TET 2026 ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసిన తర్వాత అభ్యర్థులు ఏమి చేయాలి?
TS TET 2026 ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, అభ్యర్థులు గడువుకు ముందే వారి సమాధానాలను పోల్చి చూసుకోవాలి. వారి మార్కులను అంచనా వేసుకోవచ్చు.
Jan 13, 2026 10:47 AM IST
TS TET 2026కి అర్హత మార్కులు ఎంత?
TS TET 2026 కోసం జనరల్ కేటగిరీ అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం 60 శాతం స్కోర్ చేయాలి, ఇతర కేటగిరీలు అర్హత సాధించడానికి 55% అవసరం.
Jan 13, 2026 10:44 AM IST
TS TET 2026 జవాబు కీపై అభ్యంతరాన్ని సమర్పించడానికి ఏ వివరాలు అవసరం?
TS TET 2026 ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలియజేయడానికి, అభ్యర్థులు తమ జర్నల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, సంబంధిత పరీక్షా పత్ర వివరాలను అందించాలి.