TSRJC CET 2024 Application Form: టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణలోని గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం టీఎస్ఆర్‌జేసీ సెట్ 2024 అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అయింది. ఈరోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ (TSRJC CET 2024 Application Form) ప్రారంభమైంది. విద్యార్థులు మార్చి 16, 2024 వరకు అప్లై చేసుకోవచ్చు.
TSRJC CET 2024 అప్లికేషన్ ఫార్మ్ (TSRJC CET 2024 Application Form): TSRJC CET రిజిస్ట్రేషన్ 2024 ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలోని గురుకుల రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం టీఎస్ఆర్‌జేసీ సెట్‌ని నిర్వహించడం జరుగుతుంది. TSRJC CET అప్లికేషన్ లింక్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ తన అధికారిక వెబ్‌సైట్‌లో యాక్టివేట్ చేసింది. TSRJC ప్రవేశ పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులు TSRJDC అడ్మిషన్ వెబ్ పోర్టల్ tsrjdc.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు జనవరి 31 నుంచి మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.200లు చెల్లించాలి. ఇంటర్ మొదటి సంవత్సరం (ఇంగ్లీష్ మీడియం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ)లో ప్రవేశాల కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల విద్యార్థుల దరఖాస్తులు చేసుకోవచ్చు. రాష్ట్రంలో మొత్తం 35 గురుకుల జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సీట్ల భర్తీకి ఏప్రిల్ 21న పరీక్ష జరుగుతుంది. ఈ ప్రవేశ పరీక్షలో కనబరిచిన ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులు సెలక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన కౌన్సెలింగ్ మే నెలలో నిర్వహించే ఛాన్స్ ఉంది.
టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2024 ముఖ్యమైన తేదీలు (TSRJC CET 2024 Important Dates)
టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2024కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువున టేబుల్లో అందించాం.| TSRJ CET 2024 | ముఖ్యమైన తేదీలు |
| TSRJC CET 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ | జనవరి 31, 2024 |
| TSRJC CET 2024 అప్లికేషన్లు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | మార్చి 16, 2024 |
| టీఎస్‌ఆర్‌జేసీ హాల్ టికెట్లు 2024 | ఏప్రిల్ 15, 2024 |
| TSRJC CET 2024 పరీక్ష పేరు | 21 ఏప్రిల్, 2024 |
| టీఎస్‌ఆర్‌జేసీ ఫలితాలు విడుదల తేదీ | మే, 2024 |
TSRJC CET 2024 కోసం ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply for TSRJC CET 2024)
TSRJC CET-2024కి అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకోవాలి.
- ముందుగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో http://tsridc.cgg.gov.inని సందర్శించాలి.
- హోంపేజీలో TSRJC CET-2024 నోటిఫికేషన్ కనిపిస్తుంది.
- ముందుగా సర్వీసెస్ అనే కోలమ్‌లో ఉండే ఆన్‌లైన్ పేమంట్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థి పేరు, రిజర్వేషన్ కేటగిరి, జిల్లా, జెండర్ , అమౌంట్ వివరాలు ఇచ్చి పేమంట్ పే చేయాలి.
- ఫీజు పే చేసిన తర్వాత హోంపేజీలో సర్వీసెస్ కోలమ్‌లో ఉంేడ Online Applicationపై క్లిక్ చేయాలి.
- అనంతరం ఓ పేజీ తెరుచుకుంటుంది. అందులో జర్నల్ నెంబర్, ఫీజు చెల్లించిన డేట్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఇవ్వాలి. ఫోటో కూడా అప్‌లోడ్ చేసి కింద NEXT అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో కూడా ఇతర వివరాలు ఇచ్చి SUBMIT క్లిక్ చేయాలి.
- తర్వాత ఆ అప్లికేషన్‌ని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.